EPISODE · Nov 28, 2022 · 3 MIN
మన సంప్రదాయం | Mana Sampradayam | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మన సంప్రదాయం రచన: ముక్కామల జానకిరామ్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చైత్ర 4 వ తరగతి చదువుతుంది. నాన్నంటే అమితమైన ప్రేమ.నాన్న ఏ పని చెప్పినా చిటికెలో చేసేది.అది చూసి వాళ్ళ అమ్మ కూడా సంతోషపడేది. సాయంత్రం పనికి వెళ్ళిన నాన్న ఇంటికి రాగానే కూతురుతోనే గడిపేవాడు. కానీ ఒక విషయంలో మాత్రం నాన్న మీద కోపంగా ఉండేది చైత్రకు. నాన్న అంటే కొంచెం భయం కూడా ఉండడంతో నాన్నతో విషయం చెప్పకపోయేది. నాన్న పనికి వెళ్ళినప్పుడు 'నేనే కుర్చీలో కూర్చుంటాను నువ్వు నాన్నతో చెప్పు' అని అమ్మతో గొడవపడేది చైత్ర. 'నాన్న వయసులో పెద్దవాడు కదా తల్లీ ! కింద కూర్చొని భోజనం చేయాలంటే నాన్నకు కష్టంగా ఉంటుంది' అని అమ్మ చైత్రకు సర్దిచెప్పేది. 'నాన్న వింటే బాధ పడతారు ఇంకా ఎప్పుడూ అలా అనకు తల్లీ?' అని అమ్మ ఎంత సర్ది చెప్పినా చైత్ర మనసులో నేనే కుర్చీ మీద కూర్చొని తినాలని అనుకునేది. చైత్ర వాళ్ళ తాతయ్య, చైత్రను చూడడానికి పండ్లు తీసుకొని వచ్చాడు. పనికి వెళ్లిన నాన్న సాయంత్రం ఇంటికి రాగానే తన తండ్రి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. రాత్రి భోజన సమయంలో చైత్రతో పాటు నాన్న కూడా కిందనే కూర్చొని భోజనం చేయడంతో చైత్ర ఆశ్చర్య పడింది. 'ఎప్పుడూ కుర్చీ పై కూర్చొని తినే నాన్న ఈ రోజు కింద కూర్చున్నాడు' అని మనసులో అనుకుంది. తాతయ్య వారం రోజులు ఉండి వెళ్ళాడు. ఆ వారం రోజులూ నాన్న కింద కూర్చొనే భోజనం చేశాడు. 'అమ్మా! అమ్మా! నాన్న కింద కూర్చొనే భోజనం చేశాడు ఏంటి' అని అడిగింది. 'అమ్మా చైత్రా! మన ఇంటిలో భోజనం చేయడానికి ఒకటే కుర్చీ ఉన్నది. అది నీకు తెలుసు కదా!. తాతయ్య వయసులో నాన్న కన్నా పెద్దవారు. కింద కూర్చోలేరు. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. మనకన్నా వయసులో పెద్దవారిని మనం గౌరవించాలి. అందుకే నాన్నగారు కింద కూర్చున్నారు ' అని అమ్మ చెప్పగానే తన తప్పు తెలుసుకున్న చైత్ర నాన్నపై ఉన్న కోపాన్ని విడిచిపెట్టింది. ఇంటికి పెద్దలెవరు వచ్చినా తను లేచి వారికి కుర్చీ ఇచ్చి, వారిని గౌరవించేది. వారికి కావలసిన పనులు చేసి పెట్టి ప్రేమగా మాట్లాడేది. చైత్రలో వచ్చిన మార్పుకు తల్లి చాలా సంతోషించింది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/dINpGfkV-Hk
Embed this episode
NOW PLAYING
మన సంప్రదాయం | Mana Sampradayam | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.