'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు episode artwork

EPISODE · Aug 21, 2021 · 48 MIN

'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు

from Harshaneeyam

గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxPగత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోని విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి.  https://bit.ly/3scvsxPఅదొక చిన్నరైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలవల్ల స్టేషన్ భవనం, గోడలు పెచ్చులూడిపోయాయి. భవనం పైనుండి కారిననీటి ధారల మూలంగా గోడల మీద చారికలు ఏర్పడినాయి. రైల్వే స్టేషను కుడిఎడమల పాతిన సిమెంట్ పోల్స్, కట్టిన ఫెన్సింగు వైరు అక్కడక్కడ విరిగి పోయాయి. ఆ స్టేషన్లోకి వచ్చే ప్రయాణీకులు పోయే ప్రయాణీకులు సాధారణంగా స్టేషన్ ద్వారం నుండి కాక విరిగిన సిమెంట్ పోల్స్ ఫెన్సింగు నుంచే నడుస్తారు.రైల్వే స్టేషన్ వెనుకవైపు, స్టేషన్ కట్టినప్పుడే కట్టిన క్వార్టర్లలో నాలుగు కూలిపోయి ఉన్నాయి. మిగతా క్వార్టర్లలో రైల్వేగ్యాంగు వాళ్లు తప్ప బుక్కింగు క్లర్కుగాని స్టేషన్మస్టరు గాని ఉండటం లేదు. వాళ్ళు దాదాపు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో గల ఓ మాదిరి పట్నం నుంచీ రోజూ వస్తారు.రైల్వే స్టేషను దక్షిణాన నీలగిరి చెట్లు పెరిగి ఉన్నాయి. నీలగిరి చెట్ల కింద ఆకులుపడి ఆ స్థలమంతా తెల్లగా మెరుస్తున్నది. స్టేషన్‌కు ఎదురుగా పసిరిక చెట్లు, వేపచెట్లు, తుమ్మచెట్లు పెరిగి ఉన్నాయి. ఆ చెట్లకింద రైలు పట్టాలకు ఆవలి వైపున ‘తాటికల్లు’ కుండల్లో నురుగు వస్తుండగా నలుగురు గౌండ్ల వాళ్ళు గిరాకి లేక దిగాలు పడి కూర్చున్నారు. వాళ్ళకు కొంచెం దూరంలో పసుపుపచ్చ ప్లాస్టిక్ ట్రేలో సారా ప్యాకెట్లు పెట్టుకొని పేడి మూతి ఉపేంద్ర కూర్చున్నాడు.పొద్దున తయారుచేసిన ‘మిరపకాయ బజ్జీలు’ చల్లారిపోగా షేక్ దావూద్ గొణుగుతున్నాడు.వేపచెట్టు కింద కాల్చిన మొక్కజొన్న కంకులు పెట్టుకొని ముగ్గురు పల్లెటూరి ఆడవాళ్ళు ఒకరినొకరుతిట్టుకుంటున్నారు.పరికి పండ్లు అమ్మే ముసలవ్వ ఎందుకో విచారంగా కూర్చున్నది.ఆ చెట్ల కింద దుమ్ములో కూర్చుండలేక, అలాగని ఎంతో సేపు నిలబడలేక ఒక కుటుంబం దిక్కులు చూస్తున్నది.“అట్ల పోయి రైలెప్పుడు కాలవడ్తదో తెలుసక రాపోరాదు!” భార్య భర్త మీద విసుక్కున్నది. భార్య పేరు గంగమ్మ. ఆమె గులాబిరంగు పాలిస్టర్ చీర కట్టుకున్నది. చెవులకు బంగారు జూకాలున్నాయి. కాళ్ళకు పట్ట గొలుసులు, వెండి మట్టెలున్నాయి. భర్త రాయేశం తన అంగీజేబులో చెయ్యి పెట్టి, భార్యకేసి చూసి వంకర నవ్వు నవ్వాడు.రాయేశం తెల్లటి పాలిస్టర్ కమీజు తొడిగి ధోవతి కట్టుకొన్నాడు. కాళ్ళకు సింగరేణి బొగ్గుగని బూట్లు వేసుకున్నాడు. మెడకు మఫ్లర్, ఎడమచేతికి గడియారమున్నది. .“అమ్మా పరికి పండ్లే!” వారిద్దరి పదేండ్ల కొడుకు అడిగాడు. “మీ బాపు నడుగుపో” గంగమ్మ పిల్లవాడ్ని కసిరింది. రాయేశం వంకర నవ్వుకు గంగమ్మ ఎలాంటి అడ్డంకి చెప్పకపోయేసరికి ఉపేంద్రం దగ్గరికి నడిచి “ఎంతకోబత్త (సారా ప్యాకెటు) పిలడా?” అడిగాడు.“మీ కాలేరు (కాలరీ) లెంత?” ఉపేంద్రం. “మా బొగ్గుబాయిల కాడ అమ్మినట్టే అమ్ముతానవా?” “ఈడ అంతరేటు కమ్ముతె బొక్కలిరువరా?” ఒక గౌండ్లాయన కోపంగా అన్నాడు. “ఎవలు?” రాయేశం. “ఇంకెవలు పాముకోరలిరిసినోళ్ళే” ఇంకో గౌండ్లాయన. పాము కోరలిరిసినోల్లెవరో రాయేశం అడుగలేదు. వాళ్లు చెప్పలేదు. “రెండున్నర” ఉపేంద్రం.“లావు సస్తనే ఉన్నది. మా వూల్లే సార మావులా పట్టిన కొత్తల నాలుగు రూపాయలన్నరు. లొల్లయి నంక గిప్పుడు గిదేధర”.“మీ వూల్లేంది ఈ సుట్టు పక్క అన్ని ఊళ్ళల్లగిదే ధర – ఈసారి మావుల (కంట్రాక్ట్) పట్టినోడు మన్నై పోయిండనుకో.”“మా కాలేరుమీద దోసుకుంటండ్లు – ఆడ బత్తకు అయిదు రూపాయలు” రాయేశం. రెండు సారా ప్యాకెట్లు తీసుకొని ఒకటి కట్టుక్కున కొరికి నోట్లో పోసుకొని ఇంకొకటి జేబులో వేసుకున్నాడు. అయిదు రూపాయల నోటు తీసి ఇచ్చాడు.ఆ వాసన తనకే వచ్చినట్లుగా ఒక అంగన్‌వాడి టీచరమ్మ అటేపు జరిగింది.ఒక ముసలమ్మ చెవుల గంటీలు ఊగుతుండగా “రైలెప్పుడత్తది పిలడా! సిటక్కున సీకటైనంకనా?” అన్నది. “ఆ ముసలమ్మ మనవడు “ప్యాసెంజర్ రైలు గంట కొట్టేదనుక తెలువదే” బియ్యం సంచి మీద కూర్చుండి జవాబు చెప్పాడు. అతను ప్యాంటు వేసుకొని ఉన్నాడు.కొంచెం దూరంలో అదివరకే తాగి ఉన్న ఒక బతికి చెడ్డ రైతు ఎవరినో అంతూ పొంతూ లేకుండా తిడుతున్నాడు.రైలు కిందబడి కాలు ఎప్పుడో తెగిపోయిన కుంటి ముసలి బిచ్చపాయన“నిన్ను సిలువకు గట్టిరిబిడ్డా నా యేశయ్యా!కీలుకీలున మొలలు గొట్టిరి తండ్రీ యేశయ్యా!” అంటూ యేసుక్రీస్తు మరణఘట్టాన్ని తను ‘నిజంగా’ చూసినట్లుగానే వర్ణించి పాడుతున్నాడు. ఆ గొంతులో విచిత్రమైన “వణుకు” అక్కడి వాళ్ళకు దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆ పాటలోని నాదం వారికి అనుభవంలో ఉన్నట్టే ఉంది. అందరికీ చేయిచాపుతూ కర్రకాలు పొడుచుకుంటూ తిరుగుతున్నాడు.రైలు టైం కనుక్కోవడానికి బయలుదేరిన రాయేశం ఇరువై అయిదు పైసల బిళ్ళ తీసి కుంటాయన చిపులోవేసి “ఏసయ్యను కాదు గరీబోని” అని పాటకు అర్థం  చెప్పి కదలబోయాడు.ఇంతలోనే పెనుకేక వేస్తూ ఏదో ఎక్స్ ప్రెస్ రైలు దూసుకపోయింది.రైలు వెళ్లేదాకా ఆగి రాయేశం పట్టాలు దాటాడు. అతని వెనుకనే రాబోయిన కొడుకు భయపడి తల్లి దగ్గరికి పరుగెత్తాడు.రాయేశం స్టేషన్లోకి అడుగుపెట్టాడు. టికెట్లిచ్చే కిటికీ మూసున్నది. స్టేషన్ మాస్టర్ గదిలోకి తొంగిచూశాడు.ఒక పాతటేబుల్ ముందు అంతకన్నా పాతగీలిన  స్టేషన్ మాస్టర్ విచారంగా కూర్చున్నాడు.ఇంతలోనే స్టేషన్ ద్వారం నుంచీ ఆదరబాదరగా వచ్చిన రైల్వే పోలీసు స్టేషన్ మాస్టర్ రూంలోకి నడిచాడు. టోపి తీసి ఉఫ్మనుకున్నాడు.“వాని వివరాలు తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చిండ్లు సార్” ఆ కష్టమంతా ముఖంలో తొంగి చూస్తుండగా మాట్లాడసాగాడు పోలీసు.“సార్ వాన్ని వారం రోజుల క్రితం మన రైలు స్టేషన్లో రాత్రి చలికి వణుకుతుంటే పోలీసులు పోలీస్ స్టేషను పట్టుక పోయిండ్లట. అసలే ఈ ఏరియాల డేంజర్ గున్నది కదా! మల్ల వీడు పడుసు పోరడాయె. ఏదడిగిన నోరు తెరువకపాయె. పొద్దటినుంచి సాయంత్రం దాకా ఎంత తన్నినా ఏం మాట్లాడలేదట. ఆఖరుకు వాని తల్లి గురించి చెప్పిండట. ఎంక్వయిరీల వీళ్ళది కుద్దు రాములపల్లెనట. తండ్రి బేవార్సు  గాడట. భూములమ్ముకొని పెద్దపెల్లిల తిరుగుతున్నడట. వాడు పాతకాపేనట. ఏడాది కరీంనగర్ సబ్ జైల్ల ఉండచ్చిండట. తల్లి కూలినాలి చేసి వీన్ని పెంచి పెద్దజేసిందట. ఆవార కేసని విడిచి పెట్టిండ్లట” రైల్వే పోలీసు గుక్క తిప్పుకున్నాడు. –వాడు ఏదైతే మనకేమిటి గని – మన నెత్తిమీదికి తెచ్చాడు. ప్యాసింజర్ వెళ్ళిపోతే ఈ చలిలో రాత్రంతా చావాల్సిందే” స్టేషన్ మాస్టర్..“సార్ మనము కూడా ఆవారా కేసు కింద పంచనామా చేస్తే?” రైల్వే పోలీసు.“అసలే రోజులు బాగాలేవు. వెధవ పెంట మనమీదికొస్తే! అచ్ఛా నువ్వు పోయి శవం దగ్గర కావలి వుండు. రంగయ్య టీకి పోయి వస్తాడు! ఈ లోగా నేను వాడి తల్లి, తండ్రి కోసం ట్రై చేస్త”. స్టేషన్‌ మాస్టర్.రైల్వే పోలీసు గది బయటకు వచ్చాడు.“ఏందేంది?” రాయేశం. “ఏమున్నదివయ్యా! మర్డర్లు, కూలీలు, చావడాలు, చంపడాలు – ఆజ్ కల్కా దునియా ఖుద్మర్ నా కిసీ కో మార్ డాల్ నా (ఇయ్యల్ల రేపు ప్రపంచంల తను చావడం ఇంకోన్ని చంపడం)”“దాసుకోవయ్యా! అమ్మమ్మ నీ ఉచ్చ మందులకు గావాలంటె చింతకొమ్మ లెక్కి చిమ్మిచ్చి పోసిందట” రాయేశం.“పొద్దటి నుంచి చెప్పలేక నోరు పోతంది. అగో క్యాబిన్ దగ్గర ఓ మాదెర్ చోదుగాడు రైలుకింద తలకాయ బెట్టిండు. పంచనామా చేసి పారేత్తమంటే మా స్టేషన్‌ మాస్టర్ ఉచ్చపోసుకుంటుండు – వాని తండ్రి వీనికన్నా ఆవారా ఉన్నడు”. చెమట పట్టిన ఖాకీ బట్టలు మాటిమాటికి లూజు చేసుకుంటూ ఉత్తరం వేపు క్యాబిన్ కేసి నడిచాడు.స్టేషన్ మాస్టర్ పెద్దపల్లికి ఫోన్ చేశాడు“ఇంతకు ముందు వైర్ లెస్ ల  ఇక్కడి పోలీస్ స్టేషన్ కు కబురు వచ్చింది. వాళ్లి పోలీసు వాళ్లు వెతికి పట్టుకున్నారు. సింగరేణి రైలులో తీసుకు వస్తున్నారు” ఆవలి కంఠం.మళ్ళీ తల్లి ఉండే ఊరు ఓదెలకు ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు ఆ ఊరులో రైల్వే స్టేషనున్నది. “వాని తల్లి, బంధువులు ఎడ్ల బండిలో వస్తున్నారు” అక్కడి నుంచి.స్టేషన్‌ మాస్టర్ ఈ కబురు శవం దగ్గర కావలున్న రైల్వే పోలీసులకు తెలుపాలనే ఉద్దేశంతో గది బయటకొచ్చాడు.“సార్ ప్యాసెంజర్ టైమెంత?” రాయేశం.“ఉండవయ్య మగడా!” స్టేషన్ మాస్టర్ దిక్కులు చూస్తూ చిరాకుగా అని గ్యాంగుమన్ కోసం వెతకసాగిండు.“నేను శవాన్ని సూసత్తసార్! ఏం చెప్పమంటారు?” రాయేశం. “వాని తండ్రి సింగరేణి రైలులో వస్తున్నడని చెప్పు” స్టేషన్ మాస్టర్. రాయేశం చేతులూపుకుంటూ ప్లాట్‌ఫారం మీద నుండి ఉత్తరం వేపు పోవడం చూసి “రైలచ్చే యెల్లయ్యింది మల్లేడ కాల్వడ్తన్నవ్ ?” రైలు పట్టాల ఆవలి నుంచీ రాయేశం భార్య గంగమ్మ కేకేసింది. ఆ కేకను పట్టించుకోకుండానే రాయేశం చరచరా నడుస్తున్నాడు.రాయేశం బూట్లకింద ఇసుక కరకర లాడుతోంది.ప్లాట్‌ఫారంకు వందగజాల దూరంలో క్యాబిన్ కు ప్లాట్ ఫారంకు మధ్యన పదిమంది మనుషులు కన్పించారు.అక్కడ నలుగురు చేతి సంచీలు పట్టుకొని విచార వదనాలతో నిలబడి వున్నారు.రైల్వే పోలీసులిద్దరు అక్కడ శవం వున్నదన్న మాట మరిచిపోయి బీడీలు పీలుస్తూ లోక రివాజు గురించి మాట్లాడుకుంటున్నారు.ఢిల్లీ వెళ్లే రైల్వేలైను పక్క కంకరరాళ్ళ మీద ఒక మొండెం పడుకోబెట్టి వున్నది. శవం మీద చాలీచాలని తెల్లని గుడ్డ కప్పి వున్నది. పట్టాల మధ్య కండ్లు భయంకరంగా తెరుచుకున్న తల వున్నది. తలకు మొండానికి మధ్య రక్తం మడుగుకట్టి జొబ్బజొబ్బ పెద్ద ఈగలు ముసురుతున్నాయి.– ఇంకా మీసం సరీగ మొలువని లేత ముఖం – ఎత్తు దవడలు – ఎంత అందమైన ముఖం! నెత్తిమీద రక్తంతో తడిసి పిడుచగట్టిన వెంట్రుకలు – మొండెం మీద కప్పిన గుడ్డ సరిపోక పిక్కలు పాదాలు కన్పిస్తున్నాయి. మడిమెలు గిలగిల తన్నుకోవడం వల్ల పగిలున్నాయి. ప్యాంటు చిరిగి వుంది.రాయేశం నిషా దిగిపోయింది. కడుపులో చెయ్యేసి ఎవరో దేవినట్లనిపించింది. “ఛీ మనిషి జల్మంత పాపకారి జల్మ మరోటి లేదు” అన్నాడు. ..రాయేశంకు తమ బొగ్గు గనిలో పైకప్పు కూలి చనిపోయిన కార్మికుల శవాలు కండ్ల ముందు మెదిలాయి.‘రాయేశం కాళ్ళమీద కూలబడి “అయ్యో బిడ్డా! కట్టం సుకం సూడాల్సినోడివి ఎంత కర్మాని కెత్తుకున్నవ్” అని బొటబొట కన్నీళ్ళు కార్చాడు.“ఖర్మమేమున్నది బై – ముచ్చు దొబ్బుకత్తె  ఎవడైన గంతే” రంగయ్య అనే రైల్వే పోలీసు.“ఛ….” చుట్టు మూగుతున్న మందిని ఇంకో పోలీసు దూరం కొట్టాడు. “ఏ తల్లి గన్న బిడ్డో ! ఊళ్లో బతుకు గడవక సింగరేణి గనుల్లో పరుగుపందెంలో నౌఖరికోసం పోతున్నవాడన్నాడు.“కట్టాలలో జెనుకక (భయపడక) సీతమ్మ తీర అగ్గినుంచి బయటి కచ్చినోడే మనిషి” ఒక ముసలయ్య.“అరె! కష్టాలుంటయి. సుఖాలుంటయి, మనిషి పుటుకే అసొంటిది. ఈ కాలపు పోరగండ్లకు అన్ని ముంగటికి రావాలె” రంగయ్య.“ఔ బాంచెన్ – నీ తీర అందరికి కొలువు దొరకద్దా” ఒక ముసలమ్మ. “ఔ బై కొలువు దొరకలే, సచ్చుడేనా?” రంగయ్య వాదంలోకి దిగుతూ.“సావకుంటే ఏం జేసుడువయ్యా! అడుక్క తినమంటావా? ఊళ్ళమీద బడి దోసుకు తిన మంటావా?” ఎవరో మందిలోనుంచి.“అయిరెండూ బమ్మకట్టాలే” యువకుడు. ఇంకో రైల్వే పోలీసు బీడి విసిరికొడుతూ “ఔ” నంటూ ఒప్పుకున్నాడు.“ఆ దమ్మున్నోడు సావడు. అడ్డమచ్చినోన్ని సంపుతడు” రంగయ్య తన అనుభవం...

Episode metadata supplied by the publisher feed · Published Aug 21, 2021

Embed this episode

NOW PLAYING

'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు

0:00 48:43

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 48 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on August 21, 2021.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!