EPISODE · Sep 22, 2022 · 15 MIN
మనశ్శాంతి | Manassanthi | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనశ్శాంతి రచన: దాసు రాధిక "అబ్బా ఆ దిండు కింద చూడవచ్చు గా... రోజూ వెతకటమే... తాళాల కోసం... ఒక్క నిమిషం ప్రశాంతంగా దేవుడికి దణ్ణము కూడా పెట్టుకో నివ్వరు" ... ప్రసాద్కిది మామూలే… "రాజేష్, ఫోను మ్రోగుతున్నది, ఎత్తచ్చు కదరా ?" "సార్, ఒక్క నిమిషం, నేను ఇక్కడ చిమ్ముకొని అవతలకి పోతాను... నాకూ టైమ్ అవుతోంది"... పనిమనిషి కూడా ఊపిరి తీస్తున్నది… అటు పనిమనిషి చేతిలో ఉన్న చీపురు తనకు తగలకుండా ఇటు పెళ్లాంతో, కొడుకు తో మాట్లాడుతూ దేవుడి ని ఆ క్షణం తను అడగాలనుకున్నది కూడా మర్చిపోయాడు ప్రసాద్... ఒక్క నిమిషం ప్రశాంతంగా దేవుడి ముందు చేతులు జోడించి నిలబడ లేని పరిస్థితి... ప్రతీ రోజు అంతే... ఏంటో... కాస్త పలహారం నోట్లో పడుతుండగానే కాలింగ్ బెల్లు మ్రోగింది... ఆ నిమిషంలో ఇంట్లో ఉన్న మనుషులంతా మాయమైపోయారా ఏం? ఒక్కరూ వచ్చి తలుపు తియ్యలేదు అని టిఫిన్ తినకుండా చెయ్యి కడుక్కొని తలుపు తీశాడు ప్రసాద్... "ఎవరు నాన్న? " అని లోపల నుండి అరిచాడు రాజేష్... "నీకెందుకు రా, ఆ కంప్యూటర్ దగ్గరే తగలడు" అన్నాడు ప్రసాద్. కొడుకు రాజేష్ కి పగలు రాత్రి తేడా లేకుండా పోయింది... ఆ కంప్యూటర్ మెడ కి కట్టు కొని తిరుగుతాడు... ఇప్పటికే స్టార్ట్ అప్ అని ఎంతో డబ్బు ఎన్నో సార్లు తగ లేశాడు ... ఇంట్లో ఏం జరుగుతున్నదో అతనికి సంబంధం లేదు... వచ్చింది పేపర్ బిల్లు తీసుకొని న్యూస్ పేపర్ బాయ్... వాడికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు తయారైపోతాడు ... ఎన్ని సార్లు మొత్తుకున్నాడో ప్రసాద్... వీడి మొహాన ఆ బిల్లు డబ్బులు ఇచ్చేస్తే టిఫిన్ తిన్నంత ఫలితం... ఒట్టి పేచి కోరు... మొత్తం చిల్లర తో సహా చెల్లించాడు అతనికి ప్రసాద్... లేకపోతే ఏదో బాకీ వాడు ఇంటి ముందు గోల చేసినట్టు చేస్తాడు వెధవ… ఈ తలనొప్పి తనకే ... పేపర్ అందరూ చదువుతారు కాని తన అర్ధాంగి ప్రమీల ఏ రోజు నెల వారీ బిల్లులు కట్టదు... అర్ధాంగి అనే మాట కు తన జీవితం లో అర్థం లేదు, (అదే అర్ధం కాలేదు ఇన్ని ఏళ్లు గా)అంగీ మటుకు ఉంది... అర్ధం కాలేదా? అదేనండి… కొన్నేళ్లుగా ఉద్యోగానికి రోజూ ఆడవాళ్లందరి లాగా చీరెలకు స్వస్తి చెప్పి పంజాబీ డ్రస్సులు వేసుకుంటోన్ది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/1iyCJHpUHok
Embed this episode
NOW PLAYING
మనశ్శాంతి | Manassanthi | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.