EPISODE · Apr 5, 2023 · 15 MIN
మనసంతానువ్వే 1 | Manasantha Nuvve 1 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి మనసంతానువ్వే 1 రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మనసంతా నువ్వే పెద్ద కథ 1/3 “సీతా … ఎక్కడున్నావే, స్కూల్ టైయమయితుంది తొందరగా రావే” అంటూ కేకవేసింది సీత తల్లి కామాక్షి. “అత్తా … సీత పెరటిలో నందినితో ఆడుకుంటుంది, వస్తుందిలే అత్తా నేనువెళ్ళి పిలుచుకొని వస్తాను,” చెబుతూనే పరుగెత్తాడు రఘు. “ఏమిటో ఈ పిల్ల ఒక్కమాట వినిపించుకోదు, తండ్రి గారాబం ఎక్కువ అందుకే నా మాటవినదు, అన్ని తండ్రితోనే చేయించుకుంటుంది, రేపు పెద్దవుతుంటే తెలుస్తుంది నా అవసరం ఏంటో, పాపం తల్లిలేని పిల్లాడు రఘు ఎలా చెబితే అలా వింటాడు, వాణ్ణిచూస్తేనే ఈసడించుకుంటుంది సీత, ఈ పిల్లకు ఎలా చెప్పాలో నాకర్ధం కావడంలేదు,” అని తన మనసులో తానే గొణుక్కుంటుంది కామాక్షి. “ఏయ్ నల్లోడా నన్ను వదులు నువ్వు నన్ను ముట్టుకోవద్దు,” అంటూ ఏడుస్తూ రఘు చేతిని విడిపించుకోవాలని చూస్తుంది సీత. “చూడత్తా… ఎన్నిసార్లు రమ్మని పిలిచినా రానుపో అంటూ వెక్కిరిస్తుంది, అందుకే చెయ్యిపట్టి తీసుకొస్తున్నాను,” చెప్పాడు సీతమీద సంజాయిషీ ఇస్తూ. రఘు చెయ్యిపట్టుకున్నాడని చెయ్యినంతా సబ్బుపెట్టి రుద్దుకుంటుంది సీతా. అంటే నేను నల్లగా ఉన్నానని నా నలుపు తనకంటుతుందని అనుకుంటుందేమో అది చూసి రఘు మనసు కలతచెందింది. పన్నెండు సంవత్సరాలు వయసుకే ఇది ఇలా ఉంది అంటే రేపురేపు రఘు ఉనికినే సహించుకోదేమో. చూడడానికి నలుపైనా పిల్లవాడు మంచివాడు. ఎలా చెబితే అలా వినేరకం. ఒక్కతే కూతురు కదా బయటకు పంపడమెందుకని రఘును అల్లుడిగా చేసుకోవాలనుకున్నాము. వాడు ముట్టుకున్నందుకే సబ్బుతో చెయ్యిరుద్దిపెడుతుంది ఇంకా వాడినేం భరిస్తూంది. ఆలోచిస్తూ కంచం ముందు కూర్చున్న రఘుకు అన్నం పెట్టడం మరిచిపోయింది. “అత్తా… అన్నంపెట్టు తొందరగా వెళ్ళాలి,” “అయ్యో నా మతిమండా, ఏదో ఆలోచిస్తూ మరిచేపోయాను అదెక్కడా,” అంటూ అటుఇటు చూసింది. కిసుక్కున నవ్వాడు రఘు. "అయ్యో అత్తా…. సీత స్కూల్ కు వెళ్ళిపోయింది గదా! మామ సీతకు అన్నంకలిపి తినిపించి తీసుకునిపోయాడత్తా,” అన్నం తింటూ చెప్పాడు. “ఏమండి … మీరు సీతను మరీ గారాబం చేసి చెడగొడుతున్నారు, ఈ రోజు ఏం చేసిందో తెలుసా? ఉదయం జరిగిన సంగతి చెబుతూ, “చూడండి మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత ఊరికే రాలేదండి, నా మాటెలాగు వినదు మీ గారాబం చూసుకుని కనీసం మీరైనా చెప్పండి దానికి, ఇదిలాగే ఆ అబ్బాయిని మాటకు మొదలు నల్లోడా అనడం మానేయ్యమని చెప్పండి, రఘు మాత్రం ఎన్ని రోజులు భరిస్తాడు చెప్పండి, ఎప్పుడో చెప్పాపెట్టకుండానే ఇంట్లోనుండి వెళ్ళిపోతాడు,” అంది బాధపడుతూ. “ఏమిటి కాముడు నువ్వు మరీ చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు, అదీ వాడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు వెంటనే కలిసిపోతారు, మన పెద్దవాళ్ళము పిల్లల విషయాలు పట్టించుకోకూడదు, నువ్వు అనవసరంగా మనసు పాడుచేసుకోకు,” భార్యను మందలించాడు ప్రకాశం. “అంతేలెండి, “పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగున్నట్లు” మీకు మీ కూతురు ఏం చేసినా మురిపెంగానే ఉంటుంది, లేకలేక పుట్టినకూతురాయే ఈగవాలనివ్వరు,” అంది మూతితిప్పుతూ. “భలేదానివి కాముడు నువ్వు… అది నా ఒక్కడికే కూతురు నీకు కాదన్నట్టు చెబుతున్నావు, నువ్వు మాత్రం తక్కువ గారాబం చేస్తావా ఏంటి ? ఏదో రఘును అలా అంటుందని గానీ, లేకపోతే పల్లెత్తుమాట అననిస్తావా నాకు తెలియనట్టు చెబుతున్నావు, సరే నీ మాటలెందుకు కాదనాలే ఇప్పుడు పిలిచి చెబుతాలే సీతకు,” అంటూ “ అమ్మా సీతా… ఏం చేస్తున్నావు తల్లి ఒకసారి ఇలా వస్తావు,”మురిపెంగా పిలిచాడు. బయట స్నేహితులతో తొక్కుడుబిళ్ళ ఆడుతున్న సీతను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/11TeZXLrbYA
Embed this episode
NOW PLAYING
మనసంతానువ్వే 1 | Manasantha Nuvve 1 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.