EPISODE · Apr 8, 2023 · 16 MIN
మనసంతానువ్వే 2 | Manasantha Nuvve 2 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనసంతా నువ్వే 2 రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)“ఛీ... అంటే ఆ నల్లటివాడే నా మొగుడు అంటావు, నేను చచ్చినా వాడిని చేసుకోను. మీరు బలవంతంగా నన్ను ఒప్పించారంటే, మీకెవ్వరికి కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోతాను, ” అంది బెదిరిస్తూ. “అయ్యో అవేం మాటలే తల్లి, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాము నిన్ను, ఆ అపశకునం మాటలెందుకు మాట్లాడుతున్నావు, పైన తథాస్తూ దేవతలుంటారట. ఇంకెప్పుడు అలా అనకు. నీ బాగోగులు మాకు తెలుసు కదా! మీ నాన్న నేను అన్నీ చూసుకుంటాము. నువ్వు ఆ విషయం వదిలేసి ముందు చదువు మీద ధ్యాసపెట్టు ” అంది సీతను దగ్గరకు తీసుకుంటూ. రఘు చేసిన పనికి రఘును మందలించాలని ఇల్లంతా వెదికింది. రఘు కనిపించలేదు. సాయంకాలమైనా రఘు ఇంటికి రాలేదు. ఏమైనా అంటారనే భయంతో ఎవరైనా స్నేహితుడి ఇంటిలో దాక్కున్నాడేమో, ఎక్కడికి పోతాడు వాడే వస్తాడు.. ఈ విషయం ఈయనకు తెలిసిందంటే చంపేస్తాడు వాణ్ణీ. ఇప్పుడే ఏమి చెప్పను.. అనుకుని రఘు గురించి అడిగినా కావాలనే అబద్ధం చెప్పింది, స్నేహితుడింటికి వెళ్లాడని. రఘు ఇంట్లోనుండి వెళ్ళిపోయి పరుగుపెడుతూనే ఉన్నాడు. ఉన్న ఊరు దాటాడు. తనకోసం ఎవరైనా వస్తున్నారేమోనని వెనక్కి కూడా చూడకుండా పరుగెడుతున్నాడు. ఎదురుగా వస్తున్న లారిని ఆపి అందులో ఎక్కేసాడు. “ఏంది పిల్లగా ఇంట్లో చెప్పకుండా వస్తున్నావా? ఎక్కడనన్నా దొంగతనం చేసావా భయపడుతున్నావు? పోలీసులు తరుముతున్నారా, ” అడిగాడు లారీ డ్రైవరు. “కాదుకాదు.. దొంగతనం చెయ్యలేదు, మా మామ నన్ను కొడతాడని ఇంట్లోనుండి తప్పించుకుని వస్తున్నాను, ” అంటూ జరిగిందంతా చెప్పాడు. “అయ్యో బిడ్డా.. ఎంతపని జరిగింది, పోనిలే నువ్వు నాతోనే ఉందువుగానీ.. నాకు పిల్లలులేరు. నీకు పిడికెడంతా కూడు పెట్టుడు నాకేం బరువుకాదు బిడ్డా, ” అన్నాడు ఆప్యాయంగా రఘు భుజంమీద చెయ్యివేస్తూ. ఆ ఆప్యాయతకు రఘు కళ్ళు చెమరించాయి. బికారిలాగా అయిపోతుంది అనుకున్న తన బ్రతుకుకు తోడు దొరికినందుకు సంతోషంతో దేవుడికి దండం పెట్టుకున్నాడు మనసులోనే. ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు సీతకు. ఎందుకంటే తన స్నేహితులతో ఎప్పుడు చెప్పేది. నాకు అందమైన రాకుమారుడిలాంటి భర్తవస్తాడని ఎప్పుడు చెప్పేది. “వాళ్ళుకూడా అవునే సీతా.. నీ అంత అందగత్తెకు ఖచ్చితంగా రాకుమారుడే వస్తాడనే వాళ్ళు, ”కానీ! ఒక్క రాణి మాత్రం ఎప్పుడు నన్ను ఏడిపించేది. “నీకు మీ బావనే సరిజోడి, ” అని. “ఏంకాదు .. నేను ఆ నల్లోడిని అస్సలు చేసుకోను, కావాలంటే నువ్వే చేసుకో ఆ నల్లోడిని, ” అంటూ గొడవేసుకునేది. అలాంటిది ఇప్పుడు మా అమ్మ ఆ తాళిబొట్టు తీయ్యద్దొ మంచిదికాదు అంటుంది అంటే, ఖచ్చితంగా నాకు అతనితోనే పెళ్ళి జరిపిస్తారన్నమాట. అమ్మో నా వల్లకాదు. నేను ఒప్పుకోను. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇంట్లోనుండి వెళ్ళిపోయి వీళ్ళను భయపెట్టిస్తాను. నాకు వేరే పెళ్ళి చేస్తానంటేనే ఇంటికి వస్తాను అన్నాననకో. తప్పకుండా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా అలానే చేస్తాను.. అనుకుని తృప్తిగా కళ్ళుమూసుకుని పడుకుంది. ఉదయం లేస్తూనే చకచకా తయారయి స్కూల్ కు వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయింది అనుమానం రాకుండా. సాయంకాలం ఐదవుతున్నా సీత ఇంటికి రాకపోవడంతో కంగారు పడసాగింది కామాక్షి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/_bhfQ69Gts4
Embed this episode
NOW PLAYING
మనసంతానువ్వే 2 | Manasantha Nuvve 2 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.