మనసంతానువ్వే 3 | Manasantha Nuvve 3 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 11, 2023 · 13 MIN

మనసంతానువ్వే 3 | Manasantha Nuvve 3 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  మనసంతా నువ్వే 3 రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏయ్ కానిస్టేబుల్! ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు. మీరంతా పైనకు వెళ్ళండి. దొరికవాళ్ళను దొరికినట్టు పట్టుకోండి, " అంటూ పరుగున సీత ఉన్న బంగళాలోకి వెళ్ళాడు. అటువైపు తిరిగివున్న సీతను చూసి, "చేతులు పైకెత్తు. కదిలావంటే కాల్చేస్తాను” తుపాకి సీత వీపుకు తగిలించి అన్నాడు ఎస్సై రఘు. ఒక్క క్షణం అర్ధం కాలేదు సీతకు. "ఫ్లీజ్ మా అమ్మ చనిపోయింది. ఏం చెయ్యాలో అర్ధం కాక అలా కూర్చుండిపోయాను. నేను మీరనుకున్నట్టుగా అలాంటిదాన్ని కాను. మంచి మనసుతో నాకు సహాయం చెయ్యండి ఫ్లీజ్, "అంది. అప్పుడు చూసాడు జయమ్మ వైపు. టక్కున తుపాకి వెనక్కి తీసుకున్నాడు. వీణమీటినట్లున్న ఆ గొంతులో ఏదో అధికారం ధ్వనించినట్టయింది. "సారి అండి.. నేను చూడలేదు. ఉండండి.. మా కానిస్టేబులందరు మీ వాళ్ళను పట్టుకోవడానికి పైనకు వెళ్ళారు. వాళ్ళందరిని జీపులో ఎక్కించాక ఈవిడ సంగతి చూస్తాము. ఇంతలో మీరు తప్పించుకోవడానికి చూడకండి, " అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వెనక్కి తిరిగి చూసింది. ఇద్దరూ ఒకేసారి చూడడంవల్ల నాలుగుకళ్ళు కలుసుకుని విడిపోయాయి. రఘు కళ్ళల్లో ఏదో మెరుపు మెరిసినట్టయింది. ఎంతందంగా ఉంది! అచ్చు సీతకూడా పెద్దగా అయితే సరిగ్గా ఇలాగే ఉండేదేమో.. చిన్నప్పుడు పోతపోసిన బంగారంలా ఉండేది. అవును.. సీతలాగా ఉండడమేంటి.. సీతనే కాబోలు. తన పేరడిగితే! అనుకుంటూ నోరు తెరిచాడు అడగడానికని. "మీరు .. నువ్వు రఘు కదా! మీ నుదిటిమీద ఆ మచ్చ.. అవును మీరు మా బావ రఘునే కదా?, ” సగం అనుమానం సగం సంతోషంతో అడిగింది సీత. "అవును. నేను రఘునే.. అంటే .. అంటే నువ్వు సీతవా? సీతా.. నిజంగా నువ్వు సీతవేనా? అవును నువ్వు నా సీతవే.. అనుకుంటూనే ఉన్నాను.. కుందనపు బొమ్మలా ఉంది, సీతకూడా ఇలానే ఉంటుందేమోనని. నా అనుమానం నిజమైంది. ఎలా ఉన్నావు సీతా? ఇన్నాళ్ళు నీ కోసం వెదుకుతూనే ఉన్నాను, నా అన్వేషణ వృధా పోలేదు. పద.. నిన్ను ముందు మీ నాన్నవాళ్ళ దగ్గరకు తీసుకవెళతాను, ” ఆనందం, ఆత్రుతతో అన్నాడు రఘు. "బావా .. నా పిలుపు కొత్తగా ఉందికదా! చిన్నప్పుడు నిన్ను ఎప్పుడు కూడా ఇలా పిలవలేదు, మనిద్దరం ఒక దగ్గరనే పెరిగాం కానీ! నీతో నేనెప్పుడు మర్యాదగా ప్రవర్తించలేదు, నేను అందగత్తెనన్న అహంభావంతో నిన్ను అనరాని మాటలని చాలా బాధపెట్టాను. నిన్ను రెచ్చగొడితేనే కదా ఆ రోజు నా మెడలో అమ్మవారి దగ్గరున్న మంగళసూత్రం నా మెడలో కట్టావు.. నేను నాన్నకు చెపుతానేమోనని నువ్వు ఇంట్లోనుండి పారిపోయావు. ఇదంతా నావల్లనే కదా! నన్ను క్షమించగలవా బావా, " రెండు చేతులు జోడిస్తూ అడిగింది సీత. "సీతా .. నువ్వు .. నువ్వు నన్ను బావ అని పిలుస్తున్నావా? ఇది నిజమా.. కలకాదుకదా!, " ఆశ్చర్యంగా అడిగాడు రఘు. "ఇంకా ఎందుకు బావా చచ్చినపాము చంపుతావు, ఇప్పుడు నేను ఎవ్వరికి పనికిరాని దాన్ని, అందరూ ఉండి కూడా ఎవరికి లేని ఏకాకిని, " అంది ఏడుస్తూ. "ఛ ఛా.. ఏమిటామాటలు సీతా, నీ కోసం అత్తా మామ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తిరిగివస్తావనన్న కొండంత ఆశతో కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అక్కునచేర్చుకునే అమ్మానాన్నలుండగా అనాథగా ఉండిపోతావా సీతా? నిన్ను మీ అమ్మానాన్నలకు అప్పచెప్పితే తప్ప నా మీద పడిన నిందను నేను తుడుపుకోలేను. నా కోసమైనా నువ్వు రావాలి. తప్పదు, " అన్నాడు రఘు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/SZlCBB0pex4

Episode metadata supplied by the publisher feed · Published Apr 11, 2023

Embed this episode

NOW PLAYING

మనసంతానువ్వే 3 | Manasantha Nuvve 3 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

0:00 13:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!