EPISODE · Jan 30, 2023 · 16 MIN
మనసు - మార్పు | Manasu Marpu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనసు - మార్పు రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు ఆదివారం. సూరజ్, సౌజన్య, కమలమ్మ అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నపుడు ‘ఏమ్మా, నీకు ఇక్కడ ఎలా ఉంది, బోర్ కొట్టడం లేదుకదా’? అప్పుడే నీవు వచ్చి నెలరోజులు దాటిపోయింది కదూ’ అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కొడుకు వైపే చూస్తూ 'ఏమిటో మీ ఉద్యోగాలూ మీరూనూ. శుక్రవారం రాత్రి వచ్చి సోమవారం తెల్లవారుఝామునే బయలదేరి వెళ్లిపోతావు. నీ భార్య ఆఫీస్ కు పొద్దున వెళ్లితే సాయంత్రం ఆరుగంటలకు గానీ రాదు. బోర్ గా ఉండక ఎలా ఉంటుంది? గుంటూర్ లో మీ తమ్ముడింట్లో ఎంత సందడో. సాయంత్రం అయిదు గంటలకల్లా వాడు బేంక్ నుండి వచ్చోస్తాడు. మీ మరదలు ఎప్పుడూ గిలకలా తిరుగుతూ ఏదో పనిచేస్తుంటే సందడిగా ఉంటుంది. పైగా వాళ్ల మూడేళ్ల పిల్లాడు రోహిత్ ముద్దు మాటలతో సమయం భలే గడచిపోతుంది” “సరేలే అమ్మా, నీ చిన్న కొడుకు వేణు అదృష్టవంతుడు. మాకు ఉన్న టెన్షన్స్ వాడికి లేవు. ఏం చేస్తాం చెప్పు, కష్టపడుతున్నాం, తప్పదుకదా?” “ఏరా సూరజ్, పెద్దదాన్ని, నీవు విల్లా కొంటున్నానవి నిన్న సాయంత్రం సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న పద్మావతిగారు చెప్పారు. ఆవిడ అల్లుడు, నీవూ ఒకే ఆఫీస్ లో పనిచేసారుట కదా. ఆ శుభవార్తేదో నా చెవిని కూడా వేస్తే సంతోషించనా?” నిష్టూరం నిండిన గొంతుకతో ఠక్కున అనేసిన కమలమ్మ మాటలకు సూరజ్ నవ్వేస్తూ, “ఓసి పిచ్చి అమ్మా, నీకు చెప్పకుండా ఎలా దాచిపెడ్తాననుకున్నావు? అవును, విల్లా కొనాలనుకుంటున్నాం. రెండు నెలల క్రితం బిల్డర్ కు ఒక ఇరవై లక్షలు అడ్వాన్స్ కట్టాం. మరో ఇరవై లక్షలు అడ్వాన్స్ పే చేసాక మా పేరు మీద బుక్ అవుతుంది. అప్పుడు నేనూ, సౌజన్యా కలసి మా జీతాల మీద బేంక్ లోన్ కి అప్లై చేయాలి. అడ్వాన్స్ పే మెంట్ పే చేయడం కోసం సౌజన్య నగలనను బేంక్ లో పెట్టి లోన్ తీసుకోవా లనుకుంటున్నాను. అడ్వాన్స్ పూర్తిగా కట్టేసాక, విల్లా మా పేరు మీద బుక్ అయ్యాక మీ అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు దాస్తానమ్మా, డబ్బులకోసం కొంతం టెన్షన్ పడుతున్నాం, అందుకనే చెప్పలేదు నీకు. మాకా సేవింగ్స్ లేవు. అడ్వాన్స్ పేమెంట్ కే అప్పులు చేయాల్సి వస్తోంది”. “అదేమిటిరా, మరీ చోద్యం కాకపోతే? ఇద్దరూ లక్షలు లక్షలు సంపాదించుకుంటూ కూడా అప్పులేమిటిరా? ఈ మాటలు నాదగ్గరైతే అన్నావుగానీ మరెవరిదగ్గరైనా అంటే నవ్విపోతారు’”. “అమ్మా, నీ దగ్గర అబధ్దాలెందుకమ్మా'? అమ్మవి కాబట్టి అర్ధం చేసుకుంటావనే నిజం చెపుతున్నాను" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/PEbZ379rAFY
Embed this episode
NOW PLAYING
మనసు - మార్పు | Manasu Marpu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.