మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 1 | Manasuloni Prema Episode 1 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 1, 2023 · 5 MIN

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 1 | Manasuloni Prema Episode 1 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) యశోద పులుగుర్త గారి కొత్త ధారావాహిక మనసులోని ప్రేమ ప్రారంభం 'Manasuloni Prema Episode 1/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 1/6' తెలుగు ధారావాహిక ప్రారంభం రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మురారి కి ముఫ్పై రెండు సంవత్సరాలు. అందగాడు, పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. అతని కాలేజ్ మేట్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయి వారికి పిల్లలు కూడా పుట్టేసారు. మురారి అక్కా చెల్లెలికి పెళ్లిళ్లు అయిపోయాయి. తమ్ముడు కూడా సంవత్సరం క్రితమే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడైనాడు. మురారి తల్లి లీలావతి కి కొడుక్కి పెళ్లికావడం లేదన్నదే దిగులు. ఎన్ని సంబంధాలను చూపించినా విముఖతగా ఉంటున్నాడు. మొదటినుండీ తన చదువు, కెరీర్ తప్ప పెద్దగా దేని గురించి ఆలోచించేవాడు కాదు. అటువంటి మురారికి ‘ప్రేమ’ అనే పదానికి అర్ధం తెలియదా అనుకుంటే పొరపాటే. తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడు. ప్రేమంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అందమైన బంధమనీ, ఆ బంధాన్ని జీవితాంతం వరకూ కాపాడుకోవాలని భావించేవాడు. దాదాపు పది సంవత్సరాల నాటి గతంలో ‘ప్రేమ’ అనే రెండక్షరాలు అతనికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నపుడు క్లాస్ మేట్ చైత్రను ఇష్టపడ్డాడు. చైత్ర అందమైన అమ్మాయే కాకుండా చాలా చురుగ్గా కలివిడిగా అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఆమెను మనసులో నింపుకుని ఆరాధించడం మొదలు పెట్టాడు. తన ‘ప్రేమ’ ను డైరక్ట్ గా ప్రపోజ్ చేస్తే, ఒక వేళ చైత్ర ‘నో’ అంటే అని ఊహించుకుంటూ భయపడేవాడు. ఫైనల్ ఇయర్ లో కేంపస్ ఇంటర్వ్యూలు జరిగి తను సెలక్ట్ అయ్యాడు. మంచి కంపెనీ, హేండ్సమ్ పేకేజ్. అందరూ తనని అభినందించారు. ఉద్యోగంలో బాగా సెటిల్ అయ్యాక చైత్రతో తన లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటూ కలలు కనేవాడు. ఒకరోజు కాలేజ్ కేంటిన్ లో కాఫీ తాగుతున్నాడు. “హాయ్ అన్న పిలుపుకు తలెత్తి చూసాడు”. “ఎదురుగా చైత్ర”. “కంగ్రాట్స్ మిస్టర్ మురారీ, కేంపస్ సెలక్షన్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసారుగా". "ఓ ధాంక్యూ" అంతకు మించి సంభాషణ ఏమీ జరగలేదు. సంభాషణ అనేది ఒక కళ. పదాలు భావాలను వ్యక్తం చేస్తాయి. తనకా చాకచక్యం లేదు. కొంచెం సేపు తనేమైనా మాట్లాడతాడేమోనని ఎదురుచూసిన చైత్ర 'ఆల్ ది బెస్ట్ మురారీ అని చెప్పి వెళ్లిపోయింది. రోజూ క్లాస్ లో చైత్రను చూస్తున్నా చొరవగా పలకరించ లేకపోయేవాడు. చిన్నప్పటి నుండీ అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? తనకు అందరూ ఉన్నా ఎందుకో ఇంట్రావర్ట్ గా పెరిగాడు. ఒక నెల రోజుల్లో తన చదువు పూర్తి అయిపోతుంది. ఒకరోజు చైత్ర చాలా స్పెషల్ గా తయారై వచ్చింది కాలేజ్ కు. అందరూ ఆమెకు అభినందనలు చెపుతున్నారు. హేండ్ బేగ్ లోనుండి బయటకు ఏవో కవర్లు తీస్తోంది. తన దగ్గరకు కూడా వచ్చింది. చిరునవ్వుతో “హాయ్ మురారీ ఎక్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారంటూనే" పెళ్లి శుభలేఖ అందించింది. “అనుకోకుండా నా పెళ్లి కుదిరింది మురారిగారూ. పరీక్షలు అయిపోయిన వెంటనే నా పెళ్లి”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/My8Yjr2CUzg

Episode metadata supplied by the publisher feed · Published Jul 1, 2023

Embed this episode

NOW PLAYING

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 1 | Manasuloni Prema Episode 1 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 5:50

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 1, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!