మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3 | Manasuloni Prema Episode 3 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 12, 2023 · 5 MIN

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3 | Manasuloni Prema Episode 3 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Manasuloni Prema Episode 3/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3/6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక పోవడంతో ఆమెకు మరొకరితో వివాహం అవుతుంది. ఆమెను మర్చిపోలేని మురారికి మరే అమ్మాయీ నచ్చదు. అతనికి నందిని అనే అమ్మాయినుండి ఫోన్ వస్తుంది. మురారి ప్రొఫైల్ తనకు నచ్చిందని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. తన బావ ఫణింద్రతో కూడా ఆ సంగతి చెబుతుంది. మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3 చదవండి.. మర్నాడు సాయంత్రమే మురారి తిరుగు ప్రయాణం. ఆఫీస్ లో పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నాయనుకుంటూ నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ఎంతకూ నిద్రలేవని తల్లి గదిలోకి లేపాలని వెళ్లారు మురారి అక్కా, చెల్లెలూ. ఉన్నట్టుండి "ఒరేయ్ మురారీ!" అంటూ గావుకేక పెట్టింది మురారి అక్క విరజ. గబ గబా వెళ్లాడు. తల్లి ని కుదుపుతూ లేపుతున్నారు అక్కా, చెల్లీ. ఆవిడ కదలకుండా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోతోంది. డాక్టర్ వచ్చి చూసాడు. రాత్రి నిద్రలో కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పాడు. మురారి దుఖం చెప్పనలివికాదు. అందరూ తల్లి చుట్టూ చేరి దుఖిస్తున్నారు. “నీ పెళ్లి పెళ్లి అంటూ కలవరించేదిరా అమ్మ. ఆ శుభకార్యం అయ్యేవరకైనా అమ్మ ఉండాల్సింది" అంటూ విరజక్క ఒకటే ఏడుపు. చెల్లెలు వినతి దుఖాన్ని ఆపలేకపోతున్నారు ఎవరూ కూడా. అమ్మకు తన పెళ్లి మీదే బెంగ. తను అమ్మ కిచ్చిన మాట నిలపెట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. తల్లికి జరపాల్సిన కార్య క్రమాలన్నీ పూర్తిచేసి హైద్రాబాద్ వచ్చేసాడు. తన సెల్ ఫోన్ చూసుకుంటే నందిని నుండి ఎన్నో మిస్డ్ కాల్స్, మెసేజస్. "ఏమిటో ఈ జీవితం? ఇష్టపడిన వాళ్లు దూరమైతే, వద్దనుకునేవారు వెంటపడడం ఆశ్చర్యమే కదూ"! పదిహేను రోజులు శెలవు తీసుకోవడంతో చాలా పని పెండింగ్ ఉండిపోయింది. ప్రాజక్ట్స్ డెడ్ లైన్స్ సమీపిస్తున్నాయి. మధ్య మధ్యలో అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు భారమై పోతోంది. "షాదీ డాట్ కామ్" నుండి చాలా మెయిల్స్ వచ్చాయి. "మీ ఫ్రీ సమయం చెపితే మాటలాడతామంటూ". నందిని మనస్సులో మెదిలింది. ఆ అమ్మాయి తనని ఇష్టపడుతోంది. ఇరువురి మధ్యా ఎనిమిదేళ్ల వయస్సు వ్యత్యాసం. మరీ చిన్నపిల్లేమో? పెళ్లైనాకా తమ కాపురం సజావుగా నడిస్తే ఫరవాలేదు. అభిప్రాయబేధాలు వచ్చి జరగరానిది ఏమైనా జరిగితే? "కానీ వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు కదా"! తను సరైన నిర్ణయం తీసుకోలేక పోవడం వలన విభిన్నరకాల సంఘర్షణల కు లోనౌతున్నాడు. ఏది కావాలో ఏది వద్దో తెలియని డోలాయమానం. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నందిని నుండి ఫోన్. Read the full story on⁠ www.manatelugukathalu.com⁠ ఈ కథ⁠ మనతెలుగుకథలు.కామ్⁠ లో ప్రచురింప బడింది. ⁠మనతెలుగుకథలు.కామ్⁠ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). ⁠https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ⁠ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/UaFYMIAJtEo

Episode metadata supplied by the publisher feed · Published Jul 12, 2023

Embed this episode

NOW PLAYING

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3 | Manasuloni Prema Episode 3 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 5:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 12, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!