మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4 | Manasuloni Prema Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 18, 2023 · 6 MIN

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4 | Manasuloni Prema Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Manasuloni Prema Episode 4/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4/6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక పోవడంతో ఆమెకు మరొకరితో వివాహం అవుతుంది. ఆమెను మర్చిపోలేని మురారికి మరే అమ్మాయీ నచ్చదు. అతనికి నందిని అనే అమ్మాయినుండి ఫోన్ వస్తుంది. మురారి ప్రొఫైల్ తనకు నచ్చిందని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. తన బావ ఫణింద్రతో కూడా ఆ సంగతి చెబుతుంది. మురారి తల్లి మరణిస్తుంది. తన పెళ్లి బావతో ఫిక్స్ అయినట్లు చెబుతుంది నందిని. ఇక మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4 చదవండి.. ''ఆ రోజు మీరు కళామందిర్ లో షాపింగ్ ముగించుకుని వస్తూండగా మాకు ఎదురుపడ్డారు. ‘హమ్మయ్య! వెతకబోయిన తీగ కాలికే తగిలి’నట్లు హుషారు వచ్చేసింది నాకు. బావను ఏడిపించే ఒక మంచి అవకాశం అనుకుంటూ మనిద్దరకూ పెళ్లి చూపులైనాయని, నాకు మీరు నచ్చారని చెప్పేసరికి మా బావ ముఖం ఎలా మాడిపోయిందో గమనించారా మురారిగారూ? ఎలా వాళ్ల నాన్నను ఒప్పించాడోగానీ మా పెళ్లికి పచ్చ జండా ఊపాడు మా మామయ్య. అందుకనే ఈ రోజు మీకు జరిగింది వివరంగా చెపుదామనే ఇలా వచ్చాను. మిమ్మలని ఒక్క విషయం అడగచ్చా?” “ఏ విషయం నందినీ?” “ఇంతకాలం మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?” జవాబు చెప్పలేక మౌనం వహించాడు. "నేను చెప్పనా? మీరు ఒక అమ్మాయిని ప్రేమించి ఉండచ్చని ఊహిస్తున్నాను". నందిని మాటలకు తృళ్లిపడ్డాడు. "మీరు మీ ప్రేమను ఆ అమ్మాయితో చెప్పలేకపోయారు. ఆ అమ్మాయిని మరచిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండి పోయారు. చూడండి మురారిగారూ, మనకు ఇష్టమైన వస్తువు పట్ల ప్రేమను పెంచుకుంటూ దానిని సొంతం చేసుకోవడానికి అహర్నిశలూ ప్రయత్నిస్తూ మొత్తానికి దానిని చేజిక్కించుకుంటాం. ప్రేమ కూడా అంతే. అసలు మీరు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందో ఎక్కడ ఉందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఎందుకు తెలుసుకోవడం అంటారా? ఏమో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా అని మీరనుకోవచ్చు. కానీ ఆ పెళ్లి కాస్తా పెటాకులు అయిపోయి ఉంటే? అమెరికా సంబంధాలైతే ఇంక చెప్పనవసరమే లేదు. ఎన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయండీ ఇవాళా రేపూ? ఒకవేళ ఆ అమ్మాయి తన భర్త పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటుంటే మీరెందుకు తన గురించి దేవదాసు అయిపోవాలండీ? తొందరలో మీరూ పెళ్లి చేసుకోండి మురారిగారూ. సారీ, మీమీద జాలితోనో, సానుభూతితోనో నేను ఈ మాటలు చెప్పడం లేదు. మీరంటే ఒకలాంటి గౌరవం అంతే. మా పెళ్లికి తప్పక రావా”లంటూ వెళ్లిపోతున్న నందిని వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/n7c9fzIXRck

Episode metadata supplied by the publisher feed · Published Jul 18, 2023

Embed this episode

NOW PLAYING

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4 | Manasuloni Prema Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 6:13

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 18, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!