EPISODE · Jul 28, 2023 · 11 MIN
మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 6 | Manasuloni Prema Episode 6 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Manasuloni Prema Episode 6/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 6/6' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అప్పట్లో ఈ విషయం నీకు చెప్పాలంటే ఏదో బెరుకు, నీవు తిరస్కరిస్తావేమోనన్ను సంశయం. అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి అయింది. ఇంకా పరిపక్వత రాని వయస్సు. నీ పెళ్లి శుభలేఖ ఇస్తూ రమ్మనమని ఆహ్వానించావు. నీ కోసం ఒక చక్కని రాధాకృష్ణుల విగ్రహం బహుమానము గా కొన్నాను. నిన్ను ఇంక జీవితంలో చూడలేనన్న బాధ, నా తొలిప్రేమ విఫలమైందేనన్న ఒకలాంటి వైరాగ్యం నన్ను నీ పెళ్లి చూడకుండా అడ్డుకున్నాయి. నీ పెళ్లి బహుమానము అలాగే నా షోకేస్ లో అలంకరణగా ఉండిపోయింది. ఆ విగ్రహాన్ని చూస్తూ నీవెలా ఉన్నావో, అసలు నేను నీకు గుర్తు ఉన్నానా అనుకుంటూ తలపోస్తూ ఉంటాను. ఆ తరువాత ఏ అమ్మాయి నీలా అనిపించలేదు. పెళ్లిమీద విముఖతతో ఉండిపోయాను". “నిజమా మురారీ, నమ్మలేకపోతున్నాను”. 'ఆమె కళ్లు దుఖమో, ఆనందమో తెలియని ఉద్విగ్నతతో వర్షిస్తున్నాయి'. "నిజం చైత్రా, నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం. మనకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం". ''అప్పుడు కలలా నా జీవితంలోకి వచ్చావు, కలగంటున్నపుడు వెళ్లిపోయావు, మళ్లీ ఇలా మెరిసావ్. కలో నిజమో ఇంకా అర్ధంకావడంలేదు. దీన్ని నిజం చేయవూ చైత్రా"? “నేను జీవితంలో మోసపోయాను మురారీ. ప్రేమ, పెళ్లి అనేవి నా జీవితంలో ఎండమావులే అనుకుంటూ బ్రతుకు తున్నాను. కానీ ఇలా నన్నే ఆరాధిస్తూ, నా మీద సముద్రమంత ప్రేమను తన మనసులోనే దాచేసుకుంటూ బ్రతుకుతున్న నా మురారి 'వాసంత సమీరంలా' వచ్చి తన ప్రేమతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడని ఊహించలేదు. నేను ఎంతటి అదృష్టవంతురాలిని మురారీ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటున్న చైత్రను అక్కడ నుండి లేపి ఆసరాగా ఆమె భుజాలచుట్టూ చేతులు వేసాడు. ''మా నాన్నకీ విషయం చెపితే ఎంత సంతోష పడ్తాడో మురారీ. మా చెల్లెలి పెళ్లి కుదిరినప్పటి నుండీ మా నాన్నకి నామీద దిగులు మరీ ఎక్కువైంది. నేను ఒంటరిగా ఉండిపోతానేమోనని. మా తమ్ముడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బెంగుళూర్ లో సెటిల్ అయ్యాడు. మా చెల్లెలికి హైద్రాబాద్ లో జాబ్ వచ్చిందని మా అమ్మా నాన్నా రెండు సంవత్సరాల క్రితం వైజాగ్ నుండి వచ్చేసి మా చెల్లెలితో ఇక్కడే ఉంటున్నారు. నాన్న రిటైర్ అయిపోయారు. మా నందిని పెళ్లి మా మమయ్య కొడుకుతో జరగబోతోంది". 'నందిని' పేరు విన్న మురారి ఒక్క క్షణం గతుక్కుమన్నాడు. "ఏ నందినీ” అంటూ అనుమానంగా అడిగాడు? "ఏ నందిని గురించి నీకు తెలిసేమి”టంటూ చిలిపిగా అడిగింది. "శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పనిచేసే నందిని తో నాకు పరిచయం ఉంది. అందుకని కాస్త డౌట్ వచ్చింది". ''తను మా చెల్లెలే. మా మామయ్య కొడుకూ, నందూ ప్రేమించుకున్నారు. మామయ్స కి మా నాన్న అంటే ఇష్టంలేదు మొదటినుండీ. దానికి తోడు నాకు డివోర్స్ అయిందని, మా తమ్ముడిది ప్రేమ వివాహమన్న వ్యతిరేక భావం మా కుటుంబం మీద. అదీగాక మా నాన్న తన పిల్లలకు పూర్తి స్వేఛ్చని ఇచ్చేసాడన్న ఒకలాంటి అసహనం. నందూని కోడలుగా చేసుకోడానికి అభ్యంతరం పెట్టాడు. నందూ చాలా మొండిది. బావను తప్పించితే ఎవరినీ చేసుకోనని హఠం వేసి మొత్తానికి సాధించింది. ఎలాగైతేనేమీ వారిరువురి పెళ్లికి మామయ్య అంగీకరించాడు''. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/veGbYaaMRZ4
Embed this episode
NOW PLAYING
మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 6 | Manasuloni Prema Episode 6 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.