మనసున్న మనిషి | Manasunna Manishi | Telugu Short Story | Muralidhara Sarma Pati | manatelugukathalu.com  episode artwork

EPISODE · Sep 15, 2022 · 6 MIN

మనసున్న మనిషి | Manasunna Manishi | Telugu Short Story | Muralidhara Sarma Pati | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనసున్న మనిషి  రచన: పతి మురళీధర శర్మ "పార్వతీ! టిఫిన్ తయారయిందా?” వంటింట్లో ఉన్న భార్యని అడిగేడు భాస్కరరావు. "ఇంకా లేదు. అయినా ఈవేళ ఆదివారం కదా! ఆఫీసు ఉండదన్న సంగతి మర్చిపోయేరా?" గుర్తుచేసింది భార్యామణి. "ఆ సంగతి గుర్తులేక కాదు.  ఆఫీసుకి  సెలవు గాని ఆరగింపుకు  సెలవు ఉండదు కదా! ఆఫీసు లేదని ఆకలి వెయ్యడం మానేయదు  కదా! "సంజాయిషీ ఇచ్చేడు సదరు భర్త గారు. "పనిమనిషి ఎన్ని గంటలకు వచ్చిందనుకున్నారు? 7 ½ కి. ఉదయాన్నే వచ్చి చెయ్యగలిగితే చెయ్యి. లేకపోతే  మానేయమని చెప్పేసేను. ఈవేళ ఆదివారం కాబట్టి సరిపోయింది. లేకపోతే టిఫినే తయారు చెయ్యనా? లేక వంట చేసి మీకు కేరేజీయే కట్టనా? పైగా ప్రతి ఏడాదీ జీతం పెంచమంటుంది." పనిమనిషి మీద పార్వతి ఫిర్యాదు. "చూడు పార్వతీ! మన ఇంట్లో మన పనే మనం చేసుకోలేక పనిమనిషిని పెట్టుకుంటున్నాం. అలాంటిది వాళ్ళు వాళ్ళింట్లో పని చేసుకుని వచ్చి నాలుగిళ్ళల్లో పని చేస్తేనేగాని వాళ్లకు గడవదు. ముందొస్తేనేమో  'తెల్లారేసరికి వచ్చేసేవు.. పడుకోనివ్వకుండా' అంటారు. ఆలస్యంగా వస్తే 'ఇప్పుడా వస్తావు?' అంటారు. మరి అందరిళ్ళకీ ముందూ కాకుండా, ఆలస్యం కాకుండా ఒకే టైమ్ కి రావాలంటే వాళ్ళకి మాత్రం ఎలా అవుతుంది చెప్పు? వాళ్ళకిచ్చే నెల జీతం మనం ఒక రోజు రెస్టారెంట్ కీ, సినిమాకీ వెళ్తే అవుతుంది." అని చెప్పుకుంటూ పోతున్న భర్తతో అంది పార్వతి. "తెల్లారిందా మీ సూక్తిముక్తావళికి? అయినా పనిమనిషి తరఫున మీరు వకాల్తా పుచ్చుకున్నారా ఏంటి? మీరు చెప్పిందల్లా వింటూ కూచుంటే అవతల వంటింటి పని ఎవరు చేస్తారనుకున్నారు?" "పోనీ నేనూ ఓ చెయ్యి వెయ్యనా?” అడిగేడు ఆయనగారు. "చెయ్యి వెయ్యొద్దు గాని నన్ను చేసుకోనివ్వండి చాలు." అంది అర్థాంగి. "ప్చ్! ఇప్పుడేం మాట్లాడకూడదు."అనుకుంటూ అక్కడనుండి నిష్క్రమించేడు పతిదేవుడు. ∙                            *                               * భోజనాలయిపోయేక పార్వతి అడిగింది భర్తని "అవునూ! టాయ్ లెట్లు క్లీన్ చేయడానికి వచ్చిన ఆ పనివాడితో మీ పలకరింపులేంటి? వాడు వచ్చిన పని వాడు చేసుకుపోతాడు. వాడు చేసిన పనికి వాడికి మనం డబ్బులిస్తాం. అంతే. అంతవరకే. కాని వాడి యోగక్షేమాలు మీకెందుకు?" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/_6CR9CW9Gk8

Episode metadata supplied by the publisher feed · Published Sep 15, 2022

Embed this episode

NOW PLAYING

మనసున్న మనిషి | Manasunna Manishi | Telugu Short Story | Muralidhara Sarma Pati | manatelugukathalu.com

0:00 6:42

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 15, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!