EPISODE · Oct 26, 2023 · 8 MIN
మనుషులు మారాలి ఎపిసోడ్ - 1 | Manushulu Marali Episode 1 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Manushulu Marali Episode 1' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 20/10/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 1' తెలుగు ధారావాహిక ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అది మధ్యాహ్నం లంచ్ సమయం. ఆఫీస్ లంచ్ రూమ్ లో ఒకే టేబిల్ మీద కూర్చుని కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు సుప్రజ, మాధవి, నీరజ. లంచ్ టైమ్ అరగంటలో వాళ్ల మాటలు ఎక్కువగా తమ కుటుంబాలకి సంబంధించినవై ఉంటాయి. ముగ్గురివీ ఆఫీస్ లో వేర్వేరు విభాగాలైనా లంచ్ సమయంలో కలుసుకుంటూ విధిగా ఒకే టేబుల్ పై కూర్చుని భోజనం చేయడం దాదాపు పది సంవత్సరాల నుండి జరుగుతోంది. “ఈ ఆదివారం మా ఆడపడుచు సరళ వస్తానని ఫోన్ చేసిందే” అంటూ సంభాషణ ప్రారంభించిన సుప్రజ వైపు చూసారు మాధవి, నీరజ. “మీ ఆడపడుచు రావడంలో వింతేముందే సుప్రజా. ఒకే ఉర్లో ఉంటున్న మూలాన మీ ఆడపడుచు ప్రతీ ఆదివారం వచ్చి మీ అత్తగారి యోగక్షేమాలను శ్రధ్దగా విచారించి నీ నెత్తిమీద నాలుగు అక్షింతలు జల్లి వెళ్లడం పరిపాటేకదా. పాపం ఆవిడ ప్రాణాలన్నీ మీ అత్తగారిమీదే పెట్టుకుని జీవిస్తోందాయ్. ఈ సుప్రజ అనే రాక్షసి తన తల్లిని ఎంత హింసపెడ్తోందోనన్న ఆరాటమే కదా ఆమెకు ఎప్పుడూనూ”. “అవునే, వచ్చిన ప్రతీసారీ మా అమ్మ ఇది తినదు, అది తినదు, ఈ చప్పిడ తిళ్లు ఎలా తింటుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరుస్తుంది. మా అత్తగారికి బి. పి, సుగర్ ఉందని నేను జాగ్రత్తపడుతూ వంటలు చేస్తూంటే ఇలా ప్రతీదానికి వంకలు పెడ్తూ నేను మా అత్తగారికి తిండి పెట్టకుండా మాడ్చివేస్తున్నానని ఆవిడ ఉద్దేశ్యం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/g0TxwrOqdFs
Embed this episode
NOW PLAYING
మనుషులు మారాలి ఎపిసోడ్ - 1 | Manushulu Marali Episode 1 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.