EPISODE · Nov 19, 2023 · 9 MIN
మనుషులు మారాలి ఎపిసోడ్ - 5 | Manushulu Marali Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Manushulu' Marali Episode 5' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “మరి నీవే మాధవీ”? “ఏముందే సుప్రజా చెప్పడానికి. నాలుగు రోజుల క్రితమే మా మరిది ఫోన్ చేసాడుట మా వారికి. ‘వాళ్ల జీతాల్లో సగం భాగం అంతా ఇంటి లోన్ కే పోతోంది. అమ్మా నాన్న మందులకి ఖర్చులకు ప్రతీ నెల డబ్బు పంపించు అన్నయ్యా’ అంటూ. ఈ సారి ఒక పదివేలు ట్రాన్స్ ఫర్ చేయమన్నాడు. తల్లీ తండ్రినీ తను చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్లను తన దగ్గరే ఉంచుకుంటానని తీసుకు వెళ్లడం ఎందుకో నాకూ మా వారికి అర్ధం కాలేదు. మా అత్తగారూ మామగారూ మా దగ్గర ఉన్నప్పుడు వారిరువురి బాధ్యత మాదే అనుకుంటూ ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకున్నాం. మా మరిది ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు తల్లీ తండ్రిని చూడడానికి. ఏనాడూ కనీసం పండ్లు కూడా తెచ్చేవాడు కాదు. ఒక్క వంద రూపాయలు కూడా ఉంచుకోండంటూ చేతిలో పెట్టేవాడు కాదు. ఇప్పుడు వాళ్ల పోషణకు మా నుండి డబ్బు అడగడం ఏమంత బాగుందే? భార్యా భర్తలిరువురూ బాగానే సంపాదించుకుంటున్నారు. కన్న తల్లీ తండ్రిని ఆ మాత్రం చూసుకోలేని దుస్థితి కాదు. మేమేదో లక్షలు సంపాందించుకుంటూ వెనకేసుకుంటున్నామన్న దుగ్ధ కూడా మా మరిది మాటల్లో ప్రస్ఫుటమౌతుంది. ఇంటికి పెద్దవాడిని, ఇవ్వలేనంటే ఏం బాగుంటుందంటారు మా వారు. ముందు మా మరిదికి పంపించాకా తరువాత మిగిలిన డబ్బుతో పిల్లలకు బట్టలు కొనాలని అనుకుంటున్నాం”. “మన మధ్య తరగతి జీవితాలు అంతేనే మాధవీ. ఒకరి కష్టాలు మరొకరం పంచుకోడానికే భగవంతుడు మన ముగ్గురినీ కలిపాడనుకుంటూ ఉంటాను ఎప్పుడూ. మీకు ఏ విషయంలో సహాయం కావలసి వచ్చినా నేను ఉన్నానే”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/GKoClDyaA6A
Embed this episode
NOW PLAYING
మనుషులు మారాలి ఎపిసోడ్ - 5 | Manushulu Marali Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.