EPISODE · Feb 2, 2023 · 4 MIN
మోసపోయిన స్నేహితుడు | Mosapoyina Snehithudu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మోసపోయిన స్నేహితుడు రచన: కిడాల శివకృష్ణ (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఈ ఇద్దరు మిత్రులలో ఒకరు ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన పేరు చంద్ర. ఇంకొకరు వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ఈయన పేరు రవి. ఈ విషయాన్ని తన మిత్రుడైన చంద్రకు చెప్పాడు రవి. అప్పుడు చంద్ర సరే నేనుకూడా నీకు పెట్టుబడికి సాయంగా కొంత మొత్తంలో డబ్బును ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఎలాగో నీవు కూడా డబ్బును పెట్టుబడి పెట్టడానికి ముందు వస్తున్నావు కాబట్టి ఇద్దరం కలిసి పాట్నర్స్ గా ఉందామని రవి చెప్పాడు. అనుకున్న విధంగానే ఒకే వ్యాపారాన్ని ఇద్దరి పెట్టుబడులతో మొదలుపెట్టారు, కొన్నాళ్ళు సాఫీగానే నడిపారు ఇద్దరు మిత్రులు వ్యాపారాన్ని. చంద్ర ఎప్పుడో ఒక్కసారి మాత్రమే షాప్ ను చూడటానికి వచ్చే వాడు. రవి మాత్రం ఎప్పుడూ షాప్ ను చూసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అయితే చంద్ర తన అవసరాల నిమిత్తం తన పెట్టుబడి మొత్తాన్ని తీసుకుని ఖర్చు చేసుకుంటూ ఉన్న పెట్టుబడి మొత్తాన్ని రవి దగ్గర నుండి తీసేసుకున్నాడు. రవి కూడా సరేలే వాడి డబ్బులే కదా వాడు ఖర్చు చేసుకోవడంలో తప్పులేదు నేను అడ్డు చెప్పడం సబబు కాదని అడిగినప్పుడు అడిగినంత ఇచ్చేశాడు. కొన్ని రోజులకు చంద్ర షాప్ దగ్గరికి వచ్చాడు. వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వు అంటూ మాటలతో యుద్ధం చేశాడు. అయినప్పటికీ రవి తను ఇచ్చిన మొత్తానికి సంభంధించిన ఆధారాలను చూపించి “నీ పెట్టుబడి మొత్తాన్ని నీవు ఖర్చు చేశావు. నేను నీకు ఇచ్చాను” అంటూ ఆధారాలను చూపించి చెప్పాడు. అప్పుడు చంద్ర “నాకు అదంతా సంబంధం లేదు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి” అన్నాడు. సరే నా మిత్రుడే కదా డబ్బులు అడుగుతున్నాడు.. ఇప్పుడు ఇచ్చినా నేను తర్వాత అయినా సంపాదించుకుంటాను అనుకుని అడిగినంత డబ్బు ఇచ్చేశాడు రవి. ఇదిలా ఉండగా మరో రెండు నెలలకే చంద్ర నుంచి రవికి కాల్ వచ్చింది. “నేను పోలీస్ స్టేషన్లో నీమీద కేస్ పెట్టాను, నువ్వు నాకు డబ్బు ఇవ్వాల్సిందే. నేను మొదట్లో ఇచ్చిన డబ్బు మొత్తం..” అంటూ మాట్లాడసాగాడు చంద్ర. ఆ మాటలు విన్న రవికీ విషయం మొత్తం అర్థం అయిపోయింది. తన మిత్రుడే తనని మోసం చేశాడు. ఇంకా మోసం చేయాలి అనుకుంటున్నాడు అన్న విషయం. వెంటనే రవి తన మామగారి సహాయంతో పోలీస్ స్టేషన్లో ఆధారాలు చూయిస్తూ జరిగిన సంఘటనను పూస గుచ్చినట్లు వివరించాడు. అయినప్పటికీ Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/QZMnHrEx7Jo
Embed this episode
NOW PLAYING
మోసపోయిన స్నేహితుడు | Mosapoyina Snehithudu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.