EPISODE · Oct 27, 2022 · 14 MIN
మరో సమిథ | Maro Samidha | Telugu short Story | Aduri Hymavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మరో సమిథ రచన: ఆదూరి హైమావతి కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి "భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలా తెల్సుకోనూ?" అంది భీతి గా. "ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ? నేనొస్తాగా" అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య. ఇద్దరూ నడుస్తూ మైన్ ఆఫీస్ లోనికెళ్ళారు. తనను పరిచయం చేసుకుని, తన పాప క్లాస్ ఎక్కడో అడగ్గా, ఆఫీస్ లో ఆ ఉద్యోగి ఒక వ్యక్తిని తోడుగా పంపాడు, క్లాస్ చూపను. క్లాస్ లో ఒక మహిళా లెక్చరర్ ఉన్నారు. అక్కడ సిరి, వాళ్ళనాన్న గారూ ఆగగానే ఆమె తలెత్తి చూసింది. "మేడం.. న్యూ అడ్మిషన్!" అనిచెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. "మా అమ్మాయండీ! కొత్తగా ఇక్కడ చేరను వచ్చింది." అని పరిచయం చేశాక, ఆమె "అలాగే! మీరు నిశ్చింతగావెళ్ళి రండి" అని ఆమె చెప్పాక, "వస్తానమ్మా! సిరీ తల్లీ!, సాయంకాలం వచ్చి తీసుకెళతాగా! ధైర్యంగా ఉండు" అని చెప్పి, కూతురు తలమీద నిమిరి వెళ్ళారాయన. క్లాసులో మేడం "రామ్మా! వచ్చి కూర్చో" అన్నాక వెళ్ళి ఖాళీగా ఉన్న మొదటి బెంచీలో కూర్చుంది సిరి. ఆ మేడం అందరినీ పరిచయం చేసుకుంటూ, ఒక్కోరినీ లేపి పేరూ, ఊరూ, చదివిన హైస్కూల్, మార్కులూ మొదలైనవి అడుగుతుండగా, సిరి వంతు వచ్చింది. "నీపేరేంటి!" అని ఆమె అడగ్గానే లేచి నిలుచుంది సిరి. "నాపేరు సిరి" అంది. "ఎక్కడ చదివావు ఇంతకుముందు?" అనగానే సిరి "మా ఊర్లోనే నండీ! ఒకటో క్లాస్ నుండీ పదోక్లాస్ వరకూ అక్కడే." "మీ ఊరి పేరేంటమ్మా?" "మా ఊరు చింతక్రిందిపల్లె" అనగానే క్లాసంతా నవ్వారు. 'పాత చింతకాయ పచ్చడన్నమాట ' 'చూస్తే తెలీడంలా! ఆ పట్టు పరికిణీ, మోచేతుల వరకూ జాకెట్టూ, చుట్టూ త్రిప్పి దోపుకున్న పమిటా, నడుం దిగేలా జడ కుచ్చుల జడా, తల్లో పూలూ, చేతికి బంగారు గాజులూ, మెడలో నెక్లెస్, కళ్ళకు కాటుకా, మొహాన నల్లని బొట్టూ, అన్నీ చింతకింది పల్లె లక్షణాలే' అనే ఒక్కోరి కామెంట్స్ సిరికి విని పించాయి. క్లాసులో మేడంకూడా అన్నీ విని మెల్లిగా నవ్వుకుని "సిరీ! మీ ఊళ్ళో హైస్కూల్ ఉందా!" అని అడిగాక " అవునండీ! ఉంది నేనక్కడే చదివాను." "అలాగా! ఎన్నిమార్కులొచ్చాయి?" అనగానే సిరి “నాకు స్టేట్ ఫస్ట్ వచ్చిందండీ! ఇదిగోండి నామార్క్స్ షీట్" అని మేడం దగ్గర్కెళ్ళి చూపింది. ఆమె ఆషీట్ అందుకుని పైకి పెద్దగా చదివింది. "తెలుగు 99, ఇంగ్లీష్ 99, మాత్స్ హండ్రెడ్ ఔటాఫ్ హండ్రెడ్, కెమిస్ట్రీ, 98, ఫిజిక్స్ 99” ఇలా అన్నీ చదవి క్లాప్స్ ఇవ్వగానే అంతా క్లాప్స్ ఇచ్చారు. "ఓహో! నీవేనా.. స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ మన కాలేజ్ లో చేరబోతున్నదని మేనేజర్ గారు చెప్పారు, మీ నాన్నగారు ఫీజ్ కన్ సెషన్ కూడా వద్దన్నా రుట." అంది మేడం. “ఔనండీ! మా నాయనగారు ప్రతి ఏడాదీ పది మందికి ఫీజ్ కడుతు న్నారు. నాకెందుకూ కన్ సెషన్" అంది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2DruS5ElvFI
Embed this episode
NOW PLAYING
మరో సమిథ | Maro Samidha | Telugu short Story | Aduri Hymavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.