EPISODE · Sep 22, 2022 · 11 MIN
మురిసిన పసిహృదయం | Murisina Pasi Hrudayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మురిసిన పసిహృదయం రచన: యశోద పులుగుర్త స్కూల్ కి టైమ్ అవుతోందని, స్కూల్ బస్ వచ్చేస్తుందని చక చకా తయారౌతోంది తొమ్మిదేళ్ల సితార.. బస్ మిస్ అయితే స్కూల్ కి వెళ్లడం చాలా కష్టం.. నాన్న కారులో డ్రాప్ చేయాలి.. అసలుకే నాన్న చాలా బిజీ .. ఈ లోగా మూడేళ్ల 'సిద్దూ' వచ్చి తను స్కూల్ బేగ్ లో సర్దుకున్న పుస్తకాన్నీ బయటకు లాగి పారేసేసరికి సితారకు చాలా కోపం వచ్చి వాడి పిర్రమీద రెండు అంటించేసరికి వాడు గట్టిగా ఆరున్నొక్క రాగం ఎత్తుకున్నాడు.. వాడి ఏడుపుకి కంగారపడుతూ నీరజ పరుగెత్తుకుంటూ వచ్చేసింది.. " ఏయ్ మొద్దూ.. ఎందుకే తమ్ముడిని అంతలా కొట్తావు? చిన్న పిల్లాడు కదా.. నెమ్మదిగా బుజ్జగించి చెప్పలేవా?” అంది నీరజ. "నెమ్మదిగానా? వాడు నా పుస్తకాలన్నీ లాగేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా అమ్మా" అప్పటికే నీరజ చంకనెక్కేసిన సిద్దూ వైపే కోపంగా చూస్తూ అంది సితార. “అయినా ఏం కోపమే తల్లీ, పెద్దదానివౌతున్నావు, కాస్త నిదానం నేర్చుకోవే” అంటూ నీరజ కోపంగా సిద్దూని ఎత్తుకుని అక్కడనుండి వెళ్లిపోయింది.. ఈలోగా సితార కంటే రెండేళ్ల చిన్నదైన ' సింధుజ' తయారైపోయి తనవైపు ఓరగా చూసుకుంటూ బేగ్ ఊపుకుంటూ దర్జాగా “అమ్మా! బై..” అని చెపుతూ వెళ్లిపోయింది. సింధూది కూడా సితార చదివే స్కూలే.. ఇద్దరిదీ ఒకటే బస్.. తనకంటే రెండేళ్లమాత్రమే చిన్నదైన సింధూని ‘చిన్నపిల్ల’ అంటూ అమ్మ దానికి దగ్గరుండి అన్నీ సర్దిపెడ్తుంది. నోట్లో పెట్టి మరీ తినిపిస్తుంది. తను మాత్రం అమ్మా నాన్నా దృష్టిలో పెద్దది. సింధూకంటే ఎంత పెద్దదాన్నని అనుకుంటుంది అమ్మ! సితారలో ఎప్పుడూ కలిగే సందేహమే ఇది.. ఆరోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే హోమ్ వర్కు చేసుకుంటున్న సితార నాన్న కేకలకు చివ్వున తలెత్తింది.. నాన్న ఆఫీసునుండి రావడం కూడా గమనించనే లేదు.. వస్తూనే సితార తో " సీతూ! సిద్దూ మోకాలు చూడు ఎంతలా కొట్టుకుపోయిందో, ఆడుకుంటూ పడినట్లు ఉన్నాడు.. వాడిని కాస్త కనిపెట్టుకు చూడమని నీకెన్నిసార్లు చెప్పాను? పెద్దదానివి, వాడిని కాస్త చూసుకోవద్దూ” అంటూ నాన్న కళ్ళెర్ర చేస్తుంటే బెదిరిపోయింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/iX2r709m08k
Embed this episode
NOW PLAYING
మురిసిన పసిహృదయం | Murisina Pasi Hrudayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.