ముత్తెపు ముక్కర | Mutthepu Mukkara | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 21, 2023 · 10 MIN

ముత్తెపు ముక్కర | Mutthepu Mukkara | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ముత్తెపు ముక్కర రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గొప్ప మనసున్న కొందరు మహనీయులు తమ పరివారాన్నికూడా తమ బంధువులుగా ఆత్మీయులు గా చూచు కొంటారు. ఆపని వారికి దైవ సమానం.. వారే సర్వస్వం. శివాలయంలో జగన్మాత సన్నిధిలో ఎంతో భక్తితో మోకరిల్లారు రంగమ్మ రాముడు. వారివురూ ఆ జగన్మాతా పితలను కోరింది తమ యజమాని కాళేశ్వర రావు, వారి అర్ధాంగి శ్యామలాంబ కొడుకు ప్రతాపరావు ఎప్పుడూ.. నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని, ఆ ఇంటి చాకిరి చేస్తూ తమ జీవితాలు వారి ఉప్పూ పులుసు తింటూ, వారి మన్నలను పొందుతూ ఆనందంగా సాగిపోవాలని. అర్చకుడు మంగళ హారతిని వెలిగించి, ఆ తల్లి కి చూపించి ఆ అమ్మను వీక్షిస్తున్న ఈ ఇరువురికి చూపించాడు. తీర్ధప్రసాదాలను ఇచ్చాడు. మరోసారి ఆ మాతాపితలకు నమస్కరించి రంగమ్మ రాముడు ఆలయం బయటికి నడిచారు. పద్ధతి ప్రకారం ఆలయం ముందున్న మండపంలో కూర్చున్నారు. కొన్ని క్షణాలు ఆ దేవ దేవీలను ధ్యానించారు. కళ్ళను తెరిచిన రంగమ్మ.. “బావా!.. ” “ఏం.. రంగా!.. ” “అమ్మతల్లి ముక్కెర చూచావా?.. ఎంత అందంగా వుందో.. ” “ఓసి.. పిచ్చిదానా!.. ఆ తల్లి ముక్కెర అందంగా లేకపోతే.. ఇంకెవరిది వుంటదే !.. ” నవ్వాడు రాముడు. “బావా.. నాకో చిన్న ఆశ.. ” “ఎంటే రంగా.. ” “ఆ ముక్కెర ఎంతవుద్దంట”.. రాముడు వెంటనే లేచి ఆలయంలో ప్రవేశించాడు. రంగమ్మ ఆశ్చర్యంతో అతన్ని అనుసరించింది. రాముడు పూజారిని సమీపించాడు. “సామీ!.. ” “ఓ.. చిన్న మాట.. ” “ఏందిరా.. ” “ ఆ అమ్మ ముక్కుకు వున్న ముక్కెర ఎంతవుద్ది సామి.. ” వినయం నిండివున్న రామూ ప్రశ్న, “ఒరేయ్.. రామూ.. అది ముత్తెపు బంగారు ముక్కెర రా.. ఈనాటి వెల ప్రకారం దాని విలువ యాభై వేలకు పైనేఉంటుందిరా. !.. ” రాము రంగి ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంతో చూచుకొన్నారు. “అవునురా! ఆ ముక్కెర వెలతో నీకేం పనిరా.. !” నవ్వుతూ అడిగాడు అర్చకుడు. “సామీ.. ఈ రంగీ అలాంటి ముక్కెర కావాలని అడిగింది. ఎంతవుద్దో తెలుసు కోవాలని అడిగినా”.. క్షణం సేపు పూజారి కళ్ళలోకి చూచి.. లజ్జతో తల దించుకున్నాడు రాముడు. రంగి దీనంగా అతని ముఖంలోకి చూచింది. రాము బాధను గమనించిన పూజారి.. “అమ్మకు వుండే ముక్కెర చాలా పెద్దదిరా.. రంగికి అంత పెద్దది ఎందుకు.. పది పదిహేను వేలల్లో చిన్నది చిక్కుతుంది. దాన్ని కొని ఇవ్వరా!.. ” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Hpt3Pb0Ir2Q

Episode metadata supplied by the publisher feed · Published Feb 21, 2023

Embed this episode

NOW PLAYING

ముత్తెపు ముక్కర | Mutthepu Mukkara | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 10:15

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 21, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!