EPISODE · Apr 3, 2023 · 9 MIN
మయోంగ్ | Mayong | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మయోంగ్ రచన: మావూరు విజయలక్ష్మి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “మయోంగ్! ఓ అద్భుతం! ఓ రహస్యం! ఓ గగుర్బాటు! ఓ భయం! ఓ భీభత్సం! ఊహకందనిఊహాతీతశక్తి!”ఆ గడ్డ మీద ఎదో శక్తి ఉంది. అలాగని అదేదో దేవాలయం కాదు. అక్కడికెళితే ఏవో వింత వింత శబ్దాలు వినపడతాయి. అలాగని అదేదో ఘోస్ట్ విలేజ్ కాదు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతలోనే ఒళ్ళు గగుర్పొడిచే భయముంది. నిశ్శబ్దం లోనే లీలగా భయంకర శబ్దాలు.... అవి మనకు కూడా వినిపిస్తుంటాయి. కాని ఆ శబ్డాలేంటో మాత్రం మనం చెప్పలేం. అసలా శబ్దాలుఎక్కడి నుంచి వస్తుంటాయో కూడా అర్థం కావు. అదే అద్భుత మాయాలోకం “మయోంగ్...”. అదేదో మరో లోకంలో లేదు ఈ భూమ్మీదే మన దేశంలోనే ఉంది. అసోం రాజధాని గౌహతి కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది మయోంగ్. ఈ గ్రామానికి మయోంగ్ అన్న పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఇక్కడి జనాలు మాయలు చేస్తారు. మంత్రాలు వేస్తారు. ఇంద్రజాలంలో ఆరి తేరిన వారు.అంతెందుకు ఇక్కడ అంతా మాయనే కాబట్టి ఈ ప్రాంతానికి మయోంగ్ అనే పేరు వచ్చింది. మయోంగ్ మారిగాన్ (మొరిగోన్) జిల్లాలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున కొన్ని గ్రామాల సముదాయమే ఈ మయోంగ్. ఇక్కడ బ్లాక్ మేజిక్ తోఅందరినీ మాయ చేస్తారు. ఇంతలా ఇంద్రజాలం చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరేమో అనేది ఈ ప్రాంతీయుల గురించి ప్రపంచం చెప్పుకునే మాట. అందుకే మయోంగ్ ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. స్వదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఎంతోమంది పర్యాటకులు మయోంగ్ మాయలు చూడ్డానికొస్తారు కూడా.చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అందర్నీ విపరీతంగా ఆకట్టుకునే అద్భుత మాయాలోకం హేరీపోటర్. హేరీపోటర్ సినిమాలు చూస్తున్నప్పుడు వా...వ్..ఇలాంటి స్కూల్స్, ఇలాంటి ఊర్లు నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో.... అనుకుంటాం. మరీ అచ్చంగా అలాగే కాకపోయినా ఆ హేరీపోటర్ మాయాలోకానికి చాలా దగ్గరగా కనిపించే ఒక మాయాలోకం, అద్భుత ప్రపంచం ఈ మయోంగ్.ఊరి పేరు వెనుక కథ.ఈ ప్రాంతం ఇప్పటిది కాదు పురాణకాలం నాటి ప్రదేశం. ద్వాపరయుగంలో తన క్రూరత్వంతో, మాయలు, మంత్రాలతో ఎంతోమంది సాధువులను, సజ్జనులనువణికించినవాడు, సత్యభామ, శ్రీకృష్ణుల చేతిలో హతమయినవాడు, ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దీపావళి పండుగకు కథానాయకుడు అయిన నరకాసురుని రాజ్యానికి రాజధాని అయిన ప్రాగ్జోతిషపురమే ఈ అసోం. ఆ అసోంలో కొంతభాగమే ఈ మయోంగ్.ఈ ఊరికి మయోంగ్ అని పేరు రావడానికి చాలా కథలే చెప్తారు. ఈ ప్రాంతానికి మహాభారత కాలానికి సంబంధం ఉంది. పాండవులలో ఒకడైన భీముడి కుమారుడైనఘటోత్కచుడికి సంబంధించిన రాజ్యం, ఇప్పటి మాయోంగ్ ప్రాంతంలోనే ఉండేదట. ఘటోత్కచుడు పెనుమాయల్ని చిటికలో చిత్తుచిత్తు చేసే మాయగాడు. అలాంటిఘటోత్కచుడు తన సైనికులకు, తన అనుయాయులకు కూడా ఈ మయోంగ్ లోనే శిక్షణ ఇప్పించి, వారినా విద్యల్లో ఆరితేరేలా చేసేవాడట. పూర్వం ప్రపంచంలో ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి మర్మ విద్యలు, మాయా విద్యలు నేర్చుకోడానికి ఇక్కడికి వచ్చేవారట. అలా మహాభారతం కాలం నుంచి ఇప్పటి వరకు ఆ వంశస్తులు మాయలు చేస్తూనే ఉన్నారట. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/ABySoaX6Bzs
Embed this episode
NOW PLAYING
మయోంగ్ | Mayong | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.