EPISODE · May 18, 2023 · 4 MIN
నా హృదయంలో నిదురించే చెలి | Na Hrudayamlo Nidurinche Cheli | Telugu Short Story | Anjani Gayathri | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా హృదయంలో నిదురించే చెలి రచన : అంజనీగాయత్రి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి.. వయ్యారి వై.." అని పాత సినిమా పాట పాడుతూ బైక్ తుడుచుకుంటున్నాడు సుందరం. పక్కింటి పద్మ, నీళ్లు పట్టుకుందామని కుళాయి దగ్గరికి వచ్చింది. అతడి పాట విని మనసులో నవ్వుకుంటోంది. పైకి గట్టిగా నవ్వకపోయినా, నవ్వుతో కూడిన ఆమె మోము చూసి, పాడుతున్న పాట ఆపేసాడు. సుందరం మరియు పద్మవాళ్ళఇళ్ల వాటాలు పక్కపక్కనే కావడం మూలంగా, గట్టిగా మాట్లాడుకుంటే, ఒకరి మాటలు మరొకరి ఇంట్లోకి వినిపిస్తాయి. ఇద్దరూ, అద్దెఇళ్లకోసం వచ్చి ఆ ఇళ్లలో ఉంటున్నవాళ్లే. ఇంటి ఓనర్ ఇంకో ఊర్లో ఉంటారు. అందుకే వీళ్ళు స్వేచ్ఛగా, ఆ ఇళ్లలో ఉంటూ సొంత ఇళ్ళులా వాడుకుంటున్నారు. సుందరం ఇంట్లో తల్లి మరియు తమ్ముడు తో సుందరం ఉంటాడు. తండ్రి గతంలో చనిపోయాడు. పద్మ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, పద్మ మరియు వాళ్ళ అన్నయ్య ఉంటారు. సుందరానికి పాటలు పాడుతూ పని చేసుకోవడం అలవాటు. పద్మ ఎప్పుడైనా అతని పాటలు వింటుంటే, "పాటలంటే ఇంట్రెస్ట్ ఏమో?బానే పాడుతున్నాడు, "అని మనసులో అనుకొని, ఒకరోజు ఉండబట్టలేక, పాటపాడుకుంటూ బైక్ తుడుచుకుంటూఉన్న అతనిని, "పాటలు బానే పాడుతున్నారు మీరు, పాడుతా తీయగా లాంటి సంగీత ప్రోగ్రామ్స్ లాంటివి, వేటికి అయినా వెళ్లొచ్చు కదా??" అని అడిగేసింది. "నాకు అంత సీన్ లేదండి, సంగీతం రాదు, ఏదో సినిమాలో పాటలు విని సరదాగా పాడుతూ ఉంటాను," అని తడబడుతూ చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. మనసులో మాత్రం నిజంగా పొగిడిందా?? లేక వెటకారంగా ఆ మాటలు అందా?? అనే అనుమానం మాత్రం అతని మనసును వీడిపోలేదు. ఆమె నిజంగానే బాగా పాడాడని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతోటే అనడం వలన, అతను అన్నమాటకు ఆమె మళ్లీ కల్పించుకుని, "పాటలు పాడాలంటే సంగీతం నేర్చుకోనక్కర్లేదు. పాడాలనే ఉత్సాహం, ఉండి, విన్నపాటను విన్నట్లుగా పాడటం అనేది అరుదైన విషయం. మీలో ఆ టాలెంట్ ఉంది," అని చెబుతూ తన సెల్ తీసుకుని, అతనిని అతనికి నచ్చిన పాట పాడమని, సెల్ లో వీడియోగా తీసింది. ఆ పాటని యూట్యూబ్ లో పెట్టింది. యూట్యూబ్లో పాట చూసిన వారందరూ ఎంతో బాగా పాడారని కామెంట్లు, లైకులు పెడుతూ తమ ప్రోత్సాహం అందించారు. మంచి కామెంట్లు, లైక్ లు వచ్చాక ఆ వీడియో తీసుకొచ్చి అతనికి చూపించింది. అవి చూసి, అతను ఆశ్చర్యపోయి, తనలో అంత టాలెంట్ ఉందా?? అని, తన టాలెంట్ ను ఆమె గుర్తించినందుకు మరియు ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది సుందరానికి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/T0O_rAgu54E
Embed this episode
Ready to play
నా హృదయంలో నిదురించే చెలి | Na Hrudayamlo Nidurinche Cheli | Telugu Short Story | Anjani Gayathri | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.