EPISODE · Jun 19, 2022 · 9 MIN
నా నాన్న | Na Nanna | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా నాన్న రచన : బివిడి ప్రసాదరావు "ఏమిటమ్మా.. ఆయన మరీ కటువైపోతున్నాడు" అన్నాను. "ఆయనా.. ఎవరూ." విస్మయమయ్యింది అమ్మ. "అదే.. నీ ఆయన." చెప్పాను. "ఒరే.. ఆ పెడసరమేమిటిరా. నాన్నా అనవచ్చుగా." కసిరింది అమ్మ. "ఏమోనమ్మా.. ఆయన అలా అనిపించడం లేదు. నా పాలిటి విలన్ లా కనిపిస్తున్నాడు." చెప్పాను. "చాల్లే. నోరు అదుపులో పెట్టుకో.. ఆయన నీ నాన్న.. నీ మేలు కోరడమే తప్పా.. ఆయనకి నీ మీద ఏమీ లేదు" అనేసింది అమ్మ. "అవునులే.. నీ ఆయన్ని ఎప్పుడూ వెనుకేసుకు వస్తావు." గుణిశాను. నా పేరు కుమార్. టెన్త్ చదువుతున్నాను. చూస్తున్నానుగా.. చిన్నప్పటి నుండి.. ఆయన.. అదే.. చెప్పాలి కనుక చెప్పుతున్నాను.. నాన్న.. నా పట్ల మొదటి నుండి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నా ప్రతి పనిని పట్టి పట్టి చూస్తుంటాడు. అలాగని 'తిడతాడా' అంటే లేదు.. 'కొడతాడా' అంటే లేదు. మార్కులు బాగా తెచ్చుకుంటున్నా.. 'ఏం పట్టనట్టు ప్రొగ్రస్ కార్డు మీద సంతకం' పెట్టేస్తాడు. 'బాగా చదవాలి. పరీక్ష తప్పితే నా కోపం ఏమిటో మరింత తెలుస్తుంది' అని మాత్రం అనేస్తాడు. అదీ నాతో కాదు.. అమ్మతో చెప్పిస్తాడు. చెప్తే నమ్మరు కానీ.. చాక్లెట్ కాదు కదా.. చిన్న తీపి బిళ్ల నాకు ఇప్పటికీ ఇచ్చేదే లేదు. అమ్మే లేక పోతే.. ఈ నాన్నతో ఉండేది పరమ కష్టం. అమ్మో.. తల్చుకుంటేనే భయమేస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/INNBDXZKz1o
Embed this episode
NOW PLAYING
నా నాన్న | Na Nanna | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.