EPISODE · Nov 26, 2022 · 8 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 1 | Nakemavuthondi Episode 1 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది ఎపిసోడ్ 1 రచన: మల్లవరపు సీతారాం కుమార్ మల్లవరపు సీతారాం కుమార్ రచించిన కొత్త ధారావాహిక 'నాకేమవుతోంది' ప్రారంభం పెళ్ళై మూడు నెలలే అయింది. అంతలో అనుకోని సమస్యలు ఎదురయ్యాయి ప్రియ అనే అమ్మాయికి. ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణను ఈ ధారావాహికలో కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది. ఈ సీరియల్ ను మల్లవరపు సీతారాం కుమార్ రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ. ఇక కథ ప్రారంభిద్దాం. "ప్రియా... ప్రియా! మెలకువలోకి రా. ఎందుకలా కేకలు పెడుతున్నావు?" నా భుజం పట్టి కుదుపుతూ అడిగాడు నా భర్త తరుణ్. "ఉలిక్కి పడ్డాను. నేను మంచి నిద్రలో ఉండగా తరుణ్ నన్ను లేపాడు. "ఏమైంది తరుణ్? ఎందుకు లేపావు.." అంటూ లేచి కూర్చో బోయాను. "వెంటనే లేవకు. కాస్త రిలాక్స్ అవ్వు" అంటూ నన్ను ఆపబోయాడు. నేను అతని చేతుల్ని నెట్టేస్తూ బెడ్ మీద లేచి కూర్చుని "ఇప్పుడు చెప్పు తరుణ్! అసలు ఏం జరిగింది?" అని అడిగాను. అతను నా ముఖం లోకి ఆశ్చర్యంగా చూస్తూ "అంటే.. జరిగింది నీకు నిజంగా గుర్తుకు రావడం లేదా?" అన్నాడు. "కామెడీలు చేయకు తరుణ్. నువ్వు మరేదో ఉద్దేశంతో లేపి ఉంటావు. మంచి నిద్రను పాడు చేశావు" అన్నాను కాస్త కోపంగా. "బీ సీరియస్ ప్రియా! మరో సారి అడుగుతున్నాను.. నిజంగా నీకేమీ గుర్తుకు రాలేదా?" అన్నాడు తరుణ్. అతని గొంతులో తీవ్రత చూస్తుంటే నిజంగానే ఏదో జరిగి ఉంటుంది అనిపించింది. "ప్రామిస్ తరుణ్! డిన్నర్ అయ్యాక కాస్త తల తిరుగుతున్నట్లు అనిపించింది. టీవీలో మూవీ చూద్దామని నువ్వు అడుగుతున్నా, నిన్ను చూసుకోమని చెప్పి నేను పడుకున్నాను. తర్వాత ఇదిగో.. ఇప్పుడే నువ్విలా నా భుజం కదిలిస్తూ నిద్ర లేపావు. అంతకుమించి నాకేమీ తెలియదు. మళ్లీ మళ్లీ గుర్తు లేదా అని అడక్కు. అసలు విషయం ఏమిటో చెప్పు" అన్నాను. "సారీ డార్లింగ్! నువ్వు చేసిన పనికి నేను షాక్ తిన్నాను కాబట్టే అన్ని మార్లు అలా అడగాల్సి వచ్చింది" అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి, నాకు అందించాడు. "కాస్త మంచినీళ్లు తాగి రిలాక్స్ అవ్వు. విషయం చెబుతాను" అన్నాడు తరుణ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/J0-3iwCOJk8
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 1 | Nakemavuthondi Episode 1 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.