EPISODE · Feb 10, 2023 · 18 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 10 | Nakemavuthondi Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 10 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ స్టేషన్ నుండి బయటకు వచ్చి, తమ సెల్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు రంగనాథం, సందీప్ లు. అంతలో ఒక ఇన్నోవా కారు వాళ్ళ ముందు ఆగింది. అందులోంచి నలుగురు బలిష్ఠులైన వ్యక్తులు దిగి వాళ్ళిద్దరినీ బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు, ఇద్దరి ముఖాలనీ కర్చీఫ్ లతో అదిమి ఉంచారు. తియ్యటి వాసన వస్తూ ఉండగా ఆ ఇద్దరూ స్పృహ తప్పారు. రంగనాథానికి స్పృహ వచ్చేసరికి తనని ఒక గోడౌన్ లో బంధించినట్లు అర్థమయింది. అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్లు కట్టి పడేశారు. సందీప్ కోసం తల అటు ఇటు తిప్పి చూశాడు. అతను ఎక్కడా కనపడలేదు. "ఎవరైనా ఉన్నారా?" అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు.. “నేను మాజీ మినిస్టర్ కి బాగా కావలసిన వాడిని. నన్ను తక్కువ అంచనా వేయవద్దు. ఈపాటికి నా కోసం మా వాళ్లు వెతుకుతూ ఉంటారు” అంటూ కేకలు పెట్టాడు రంగనాథం. మరో అరగంటకు ముఖానికి ముసుగు వేసుకున్న ఒక యువకుడు ఆ గోడౌన్ లోకి వచ్చాడు. అతని వెనుకే నలుగురు అనుచరులు వచ్చి, తిరిగి గోడౌన్ తలుపులు మూసివేశారు. అందరూ రంగనాథాన్ని సమీపించారు. "ఎవరు మీరు? నన్ను ఎందుకు బంధించారు.." అంటూ కేకలు పెట్టాడు రంగనాథం. "మన ట్రీట్మెంట్ ప్రారంభం కాకముందే గావు కేకలు పెడుతున్నాడు. వీడి నోట్లో గుడ్డలు కుక్కి అసలైన టార్చర్ అంటే ఏమిటో చూపించండి" అన్నాడు ఆ యువకుడు. వెంటనే ఒక వ్యక్తి రంగనాథం నోట్లో గుడ్డలు కుక్కి నోటికి పెద్ద టేప్ అంటించాడు. మరో వ్యక్తి రంగనాథాన్ని కట్టి ఉన్న కుర్చీని బాగా వెనక్కి వాల్చాడు. మరో ఇద్దరు వ్యక్తులు అతని అరికాళ్ళ మీద లాఠీలతో బలంగా కొట్టడం ప్రారంభించారు. దెబ్బలను ఓర్చుకుంటూనే వేగంగా ఆలోచించాడు రంగనాథం. వీళ్లు కచ్చితంగా మఫ్టీలో ఉన్న పోలీసులే.. కానీ రికార్డుల్లో తనను వదిలి పెట్టేసినట్లు రాసుకొని ఉంటారు. వీళ్లు ఏం చేసినా తనకు దిక్కు లేదు. సందీప్ పక్కన లేడు అంటే అతన్ని వేరేచోట ఇలాగే టార్చర్ పెడుతూ ఉంటారు. ఇక రిసార్ట్ వాచ్మెన్ ఇతర సిబ్బందిని స్టేషన్లోనే చిత్రహింసలు పెడుతూ ఉంటారు. తను దెబ్బలకు ఓర్చుకున్నా వీళ్ళలో ఎవరో ఒకరు విషయం బయట పెట్టేస్తారు. అదేదో తనే చెబితే ఈ దెబ్బలన్నా తప్పుతాయి అనుకున్నాడు. కానీ ఎలా చెప్పడం..? చేతులు కాళ్లు కట్టేసి ఉన్నారు. నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నారు. తలను అటు ఇటు ఊపుతూ రెప్పల్ని ఆర్పుతూ కొట్టడం ఆపమని సైగ చేయడానికి ప్రయత్నించాడు. అంతలోనే అతనికి స్పృహ తప్పింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/6eRi5-J8G3U
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 10 | Nakemavuthondi Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.