EPISODE · Feb 21, 2023 · 16 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 12 | Nakemavuthondi Episode 12 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 12 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ చెప్పడం ఆపిన ప్రమీల తరుణ్ వంక చూసింది. “బాబూ తరుణ్! నీ దగ్గర ఇన్ని విషయాలు దాచి పెట్టి పెళ్లి చేశామని అనుకుంటున్నావు కదూ..” అంది. లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు తరుణ్. “లేదత్తయ్యా.. పూర్తిగా కాకపోయినా నాకు కూడా కొంతవరకు తెలుసు. పెళ్లికి ముందే మామయ్య గారు నన్ను పర్సనల్ గా కలిసి, ప్రియా ను గతంలో సైకియాట్రిస్ట్ కి చూపించినట్లు చెప్పారు. ప్రస్తుతం తను నార్మల్ గా ఉంది కాబట్టి పాత విషయాలు నేను పట్టించుకోనని వారితో చెప్పాను. ఆయన నాతో మాట్లాడిన విషయం తెలిస్తే ప్రియా బాధపడుతుందని, కాబట్టి ఎవరికీ చెప్పవద్దని ఆయన అడిగారు. కానీ ఇంత వివరంగా అయితే నాకు తెలీదు. జరిగిపోయిన విషయాలను నేను తవ్వదలుచుకోలేదు. ప్రియ నా భార్య. ఆమె ఆరోగ్యంగా, క్షేమంగా ఉండడమే నాకు కావాలి. మీరు చెప్పడం కొనసాగించండి. నా ఉద్దేశం ప్రకారం మీరు చెప్పే విషయాలను బట్టి ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని, ప్రియా వీలైనంత తొందరగా దొరుకుతుందని అనిపిస్తోంది” అన్నాడు. “తరుణ్! నీలాంటి మంచి మనసున్న వ్యక్తి భర్తగా దొరకడం, మా అమ్మాయి చేసుకున్న అదృష్టం” అంది ప్రమీల. “భార్గవి నాకు కూడా తెలుసు. ఆ టైంలో నేను అమెరికా టూర్ వెళ్లి ఉన్నాను” చెప్పింది ప్రవల్లిక. తర్వాత ప్రమీల గతంలో జరిగిన సంఘటనలను తిరిగి వివరించడం ప్రారంభించింది. “ప్రియ నీలకంఠం అనే వ్యక్తి పేరు చెప్పడం, ఇక్కడ భార్గవి వాళ్ళ మేనమామ పేరు కూడా అదే కావడం చూస్తుంటే నాకు కూడా ఈ రెండు విషయాలకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. కానీ అదేమిటో తెలియడం లేదు. పైగా ఇతను మా తమ్ముడి ఇంట్లో ఉన్న ప్రియా గదిలోకి వెళ్లడం ఎలా సాధ్యం? అదీకాక సీసీ కెమెరా రికార్డింగ్ లో ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళ లేదని తేలింది కదా” అన్నాను నేను. ఇంతలో బయట ఉన్న ప్రియ, కొందరు స్నేహితులతో లోపలికి వచ్చింది. మేము కూర్చున్న చోటికి వచ్చి, “భార్గవి పేరెంట్స్ డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లారట. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాక డెడ్ బాడీని తీసుకుని వస్తారట. అంత్యక్రియలు రేపు మార్నింగ్ ఉంటాయట. పాపం భార్గవి వాళ్ళ మామయ్య చాలా బాధపడుతున్నాడట. రెండు రోజులకు ముందే ఆయన కొడుకు నిశ్చితార్థం జరిగింది. ఇంతలో తన ఇంట్లో భార్గవి ఉరి వేసుకొని చనిపోవడంతో ఆయన తట్టుకోలేక పోతున్నాడు. మేము వెళ్లి ఒకసారి ఆయన్ని పలకరించి వస్తాము” అంది. “నీతో కాస్త మాట్లాడాలమ్మా! వాళ్లను వెళ్ళనీ. నువ్వు తరువాత వెళ్ళొచ్చులే. అన్నట్లు భార్గవి వాళ్ళ మామగారి పేరు ఏమిటమ్మా?” అడిగారు మావారు. “ఆ అంకుల్ పేరు నీలకంఠం” అని చెప్పింది ప్రియా స్నేహితురాలు. ప్రియా ఒంట్లో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్లు అయింది. నా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/elaZhYo255E
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 12 | Nakemavuthondi Episode 12 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.