నాకేమవుతోంది ఎపిసోడ్ 13 | Nakemavuthondi Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 28, 2023 · 14 MIN

నాకేమవుతోంది ఎపిసోడ్ 13 | Nakemavuthondi Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 13 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  ప్రవల్లిక, ప్రమీలతో మాట్లాడుతూ "ప్రియా కి ఏమీ జరగనందుకు సంతోషంగా ఉంది. మీరు చెప్పిన సంఘటనలకు, ప్రియా కనపడకుండా పోవడానికి ఏదో సంబంధం ఉన్నట్లు నాకనిపిస్తోంది. మీరు చెప్పడం పూర్తి చేయండి" అంది. తిరిగి చెప్పడం ప్రారంభించింది ప్రమీల. "ఆ డాక్టర్ ఆ రోజంతా ప్రియా కు వివిధ రకాల పరీక్షలు చేశాడు. ఎన్నో ప్రశ్నలు వేసి ప్రియా చెప్పిన సమాధానాలను నోట్ చేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం ప్రియాను కాసేపు బయట కూర్చోమని చెప్పి మాతో మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ప్రకారం జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికం. భార్గవి మరణానికి దారి తీసిన పరిస్థితులు తనకు ఒకరోజు ముందే ఏర్పడడం అనుకోకుండా ఏర్పడ్డ సామీప్యత మాత్రమే. అంతేగాని జరగబోయే సంఘటన ప్రియాకు ముందుగా తెలిసిందని అనుకోవడానికి ఏ ఆధారము లేదు. ఇక లేని వ్యక్తిని ఊహించుకొని ప్రియా భయపడడం, ఇంటి నుండి పారిపోవడం ఖచ్చితంగా మానసిక లోపమే. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదని మీరు చెప్పారు కాబట్టి ఇది ప్రారంభ దశ అనుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాను. రోజుకొక మాత్ర చొప్పున ఒక సంవత్సరం పాటు వాడమని మీ అమ్మాయికి చెప్పండి. అమ్మాయి హాస్టల్ లో ఉంటుంది కదా.. ఎవరైనా మాత్రలు వేసుకోవడం చూస్తారేమోనని భయంతో వాడడం మానవద్దని చెప్పండి. అంతగా ఎవరికైనా చెప్పాల్సివస్తే బలానికి వాడే విటమిన్ టాబ్లెట్ అని చెప్పమనండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే వెంటనే నా దగ్గరకు తీసుకొని రండి" అని చెప్పాడు ఆయన. డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాము. మా బావగారు ప్రియను తమ ఇంట్లోనే ఉంచుకుంటామని చెప్పారు. కానీ ప్రియ హాస్టల్ కి వెళ్తానని చెప్పింది. రెండు రోజులు అక్కడే ఉండి ప్రియను హాస్టల్లో దించి వచ్చాము. అప్పుడప్పుడు తన పెదనాన్న ఇంటికి వచ్చి వెళుతూ ఉండమని చెప్పాము. అలాగే అప్పుడప్పుడు మా బావ గారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది ప్రియ. డాక్టర్ ఇచ్చిన మాత్రలను తూచా తప్పకుండా వాడుతోంది. మరొక్క ఆరు నెలలు గడిచాక మరొక సంఘటన జరిగింది. అది అంత తీవ్రమైనది కాదు. దాని గురించి మా వారు వివరంగా చెప్తారు" అంది ప్రమీల. ప్రభాకర్ రావు గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాడు. "మా వదినకు నీరసంగా ఉండడంతో అన్నయ్య ఆమెను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్లు ఆమెకు కొన్ని విటమిన్ టాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేశారు. అయితే ఆమె వాటిని రెగ్యులర్ గా వేసుకోక పోవడంతో అన్నయ్య ప్రతిరోజు ఆమెకు ఆ టాబ్లెట్స్ తీసి ఇచ్చి, మంచినీళ్లు ఇచ్చి, దగ్గరుండి మింగించేవాడు. ప్రియ, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు ఈ దృశ్యం చూసింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/T6EmBGtzNSk

Episode metadata supplied by the publisher feed · Published Feb 28, 2023

Embed this episode

NOW PLAYING

నాకేమవుతోంది ఎపిసోడ్ 13 | Nakemavuthondi Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 14:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 28, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!