EPISODE · Mar 10, 2023 · 15 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 14 | Nakemavuthondi Episode 14 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 14 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఇద్దరు కానిస్టేబుల్స్ ని చేతిలో లాఠీలు పట్టుకొని రంగనాథం పక్కనే నిలబడమన్నాడు ఉదయ్. తరువాత రంగనాథంతో "ఆ లాఠీల అవసరం రాదని ఆశిస్తున్నాను. కానీ నీ బుద్ధి నాకు తెలుసు. ఏదో ఒకటి అరకొరగా చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. చాల విషయాలు సందీప్ చెప్పేసాడు. ఆ విషయాలు నీ దగ్గర క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతున్నాం. అంతే.." అన్నాడు. "ఉదయ్ గారూ! నాకు తెలిసిన ప్రతి విషయం మీకు చెబుతాను" అంటూ చెప్పడం ప్రారంభించాడు రంగనాథం. "ఆ రోజు రిసార్ట్ దగ్గర పడిఉన్న శవాన్ని చూడటానికి వెళ్లాను. ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ నాకు ముందే తెలుసు. గతంలో ఒక చిన్న కేసులో అతనికి సహాయం చేసాను. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఈ కేసులో సహాయం అడగవద్దని, అతనికి ముందే చెప్పాను. అతనితో కలిసి ఆఫీస్ రూమ్ కి వెళ్ళాను. రికార్డ్ లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదేమిటని అతన్ని నిలదీసాను. అంతలో నాకు మాజీ మినిష్టర్ కనకారావు పిఎ దగ్గర్నుండి కాల్ వచ్చింది. ఈ కేసు విషయంలో సందీప్ కి సహకరించమని కనకారావు మాటగా అతని పిఎ చెప్పాడు. ఇది మర్డర్ కేసని, ఏసిపి గారు నాకు కాల్ చేసి ముందుగా హెచ్చరించారని, ఏదైనా పొరపాటు జరిగితే నా ఉద్యోగం పోతుందని చెప్పాను. వినలేదతను. సిసి కెమెరా తాలూకు హార్డ్ డిస్క్ నీ, ఆఫీస్ రికార్డ్ లను ఎవరో ఎత్తుకుపోయినట్లు సందీప్ దగ్గర కంప్లైంట్ తీసుకొమ్మని చెప్పాడు. 'ఆలా చేస్తే ఎవరూ నమ్మర'ని చెప్పాను నేను. 'నమ్మకాలతో అవసరం లేదనీ, రికార్డ్ లు మాయం కావడం ముఖ్యమ'ని చెప్పాడతను. అంతేకాదు.కనకారావు పలుకుబడితో నాకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు అయన పిఎ. అన్నిటికంటే ముఖ్యం.. నాకు కోటి రూపాయలు అఫర్ చేసారు" చెప్పాడు రంగనాధం. ఆశ్చర్యపోయాడు ఉదయ్. 'అంటే.. ఈ కేసులో పెద్దల ప్రమేయం ఖచ్చితంగా ఉందన్నమాట' అనుకున్నాడు. "అసలు హన్సిక ని హత్య చేసిందెవరు? ఎందుకోసం ఆ హత్య జరిగింది? చనిపోయింది ప్రియా అని ఇంటరాగేషన్ లో సందీప్ ఎందుకు చెప్పాడు? ప్రియ ఆ రాత్రి పూట అక్కడినుంచి ఎందుకు మాయం అయింది? నీకు కోటి రూపాయలు అఫర్ చెయ్యడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసులో కనకారావు పాత్ర ఎంత?" వరుసగా ప్రశ్నలు సంధించాడు ఉదయ్. "శవాన్ని చూడడానికి వెళ్ళినప్పటినుండే నేను ఈ కేస్ లో ఇన్వాల్వ్ అయ్యాను. అంతకు ముందు జరిగిన విషయాలు నాకు తెలియవు. పెద్దలతో వ్యవహారం కాబట్టి వీలయినంత తక్కువ తెలుసుకుంటే మంచిదని, అవసరమయితే మరికొంత మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు కనకారావు పిఎ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/uboTowPi3vc
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 14 | Nakemavuthondi Episode 14 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.