EPISODE · Mar 19, 2023 · 9 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 15 | Nakemavuthondi Episode 15 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 15 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ డాక్టర్ శ్రీనివాస్ భార్య శ్రీదేవి, "మరొక గ్లాస్ జ్యూస్ ఇవ్వనా?" అంది ప్రియా వంక చూస్తూ."ఇవ్వండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నాను. బాగా నీరసంగా ఉంది" అంది ప్రియ."అలా అయితే మీరు కాసేపు రిలాక్స్ కండి. నేను ఓ గంటకి మిమ్మల్ని కలుస్తాను" అన్నాడు శ్రీనివాస్."అవసరం లేదు. నన్ను చెప్పనివ్వండి. నా ఆలోచనలన్నీ మీకు తెలియడం మంచిది" అంది ప్రియ."అయితే ఓ రెండు నిమిషాలు ఆగు. జ్యూస్ తీసుకొని వస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది శ్రీదేవి."హాస్పిటల్లో ప్రమాదం ఉందని మీ ఇంట్లో ఉంచినట్లు చెప్పారు. ఏమిటా ప్రమాదం? నేను గతంలో కూడా రెండు మూడు సార్లు హాస్పిటల్ కి వచ్చాను కదా.." అంది ప్రియ."నీ జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, కేకేఆర్ హాస్పిటల్ అధినేత కనకారావు కు ఏదో తెలియని సంబంధం ఉందనిపిస్తోంది, ముందు చెప్పడం పూర్తి చేయి, దాన్నిబట్టి నేను ఒక అభిప్రాయానికి వస్తాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.ఇంతలో శ్రీదేవి ఒక గ్లాసులో జ్యూస్ తీసుకొని వచ్చి ప్రియ చేత తాగించింది. ఒంట్లోకి కాస్త శక్తి వచ్చినట్లు అయింది ప్రియా కి. డాక్టర్ శ్రీదేవికి థాంక్స్ చెప్పి చెప్పడం కొనసాగించింది.ఖచ్చితంగా హన్సికకు ఏదో ఆపద కలగబోతోందని నా సిక్స్త్ సెన్స్ చెబుతోందనిపించింది. గతంలో నా మీద మా మేనమామ అత్యాచార యత్నం చేసినట్లు, అది విఫలం కావడంతో హత్యా ప్రయత్నం చేసినట్లు నాకు భ్రమ కలిగింది. కానీ అదే విషయం నా స్నేహితురాలు భార్గవి విషయంలో నిజమైంది. తన మేనమామ ఆమెను హత్య చేశాడు. ఇప్పుడు తరుణ్ నన్ను చంపబోయినట్లు అనిపించింది. మరి హన్సిక భర్త చేతిలో చనిపోతుందా? ఆమె భర్త అమెరికాలో ఉన్నాడు కదా.. ఒకవేళ అతను ఇండియాకు ఏమైనా వచ్చాడా.. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను. మర్నాడు ఉదయం లేవగానే హన్సికకు ఫోన్ చేయడానికి ట్రై చేశాను. తన నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను, తరుణ్ రిసార్ట్ కి బయలుదేరాము. దారిలో మీరు పని చేసే కేకేఆర్ హాస్పిటల్ కనిపించింది. మీరు గుర్తుకు వచ్చారు. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనిపించింది. కానీ తరుణ్ కి ఏమని చెప్పాలి.. 'నా మానసిక స్థితి గురించి అతనికి అనుమానాలు రేకెత్తించడం ఎందుకు..?' అనిపించింది.అర్థరాత్రి సమయంలో కిటికీ బయటనుండి హన్సిక నన్ను పిలిచినట్లు అనిపించింది.తరుణ్ మంచి నిద్రలో ఉన్నాడు.వెంటనే బయటకు వెళ్లాను. హన్సిక పక్క కాటేజ్ లోకి వెళ్లడం గమనించాను.వేగంగా ఆ కాటేజ్ ని సమీపించాను.తలుపు తట్టాను. చేతికి ఏదో తడిలా తగిలింది.టెన్షన్ లో నేను అది పట్టించుకోలేదు.ఒక యువకుడు తలుపు తీసాడు..ఇంత రాత్రి పూట పక్క కాటేజ్ వాళ్ళను డిస్టర్బ్ చేయడమేమిటని విసుక్కున్నాడు .నేను తిరిగి వచ్చేటప్పుడు తరుణ్ నాకోసం వెతుకుతూ కనిపించాడు.ఇందాక అతను నిద్ర నటించాడా..ఏమీ అర్థం కాలేదు.ఇప్పుడు నేను అతనికి కనిపిస్తే చంపేస్తాడా.,అప్పుడు చూసుకున్నాను నా చేతికి అంటిన రక్తపు మరకలను. వేగంగా కాటేజ్ లోని గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/4T4omxUVZTM
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 15 | Nakemavuthondi Episode 15 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.