నాకేమవుతోంది ఎపిసోడ్ 16 | Nakemavuthondi Episode 16 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 30, 2023 · 14 MIN

నాకేమవుతోంది ఎపిసోడ్ 16 | Nakemavuthondi Episode 16 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి నాకేమవుతోంది…? ఎపిసోడ్ 16 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ డాక్టర్ శ్రీనివాస్ తనకు తెలిసిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు. "తనకు సంబంధించిన వారి ప్రమేయం ఉన్న విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం, కనకరావుకి అనుమానాన్ని కలిగించింది.ఒక దశలో అతనివల్ల చనిపోయిన స్త్రీ తాలూకు ఆత్మ నిన్ను ఆవహించిందేమోనని అనుమాన పడ్డాడు. అలాంటిదేమీ లేదని నేను నమ్మకంగా చెప్పాను. అయినా నిన్ను హాస్పిటల్ లో కొద్ది రోజులు ఉంచితే వాస్తవాలు తెలుస్తాయని భావించాడు. నీకు తెలిసిన వారికి హాని కలిగించి, ఆ విషయం నీకు ముందుగా తెలుస్తుందేమో చూడాలనుకున్నాడు.స్నేహితుడి గదిలో ఉన్న తరుణ్ కి తప్పించుకోవడానికి సహాయం చేసినట్లు నటించి తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు. అతనికి హాని కలిగిస్తే, ఆ విషయం ముందుగా నీకు తెలుస్తుందేమో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ తరుణ్ తప్పించుకోవడానికి అంగీకరించ లేదు. దాంతో ఆ ఉపాయం ఫలించలేదు. ఢిల్లీ నుండి తన మాట వినే డాక్టర్లను పిలిపించి నీ మెదడు మీద ప్రయోగాలు చేయించాలనుకున్నాడు.నీ కోసం పోలీసులు ఖచ్చితంగా హాస్పిటల్ లో గాలిస్తారని, విషయం సద్దుమణిగేదాకా నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి ఇక్కడికి తీసుకోని వచ్చాను. నువ్వు కోలుకున్నాక నీ ఇష్టప్రకారం చేయాలనుకున్నాను." చెప్పాడు శ్రీనివాస్.కొంతసేపు మాట పెగల్లేదు ప్రియకు.డాక్టర్ శ్రీదేవి ప్రియా భుజంపైన మృదువుగా తడుతూ "రిలాక్స్ ప్రియా..భయపడకు. నీకేమీ కాదు. నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటావు. మాకు రిస్క్ వచ్చినా సరే.. నిన్ను క్షేమంగా ఉంచడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం." అంది.కొంతసేపటికి తేరుకున్న ప్రియా "ఆ కనకారావు ఎంత దుర్మార్గుడు.. నాకు అతనితో ఏ విరోధం లేకున్నా నాకు, నా వాళ్లకు హాని చెయ్యాలని చూస్తున్నాడు.అతన్ని జైలుకు పంపే ఆధారాలు నాకు కలగానో భ్రమగానో వస్తే బాగుండునని ఇప్పుడు అనిపిస్తోంది" అంది ఆవేశంగా.ఇంతలో డాక్టర్ శ్రీనివాస్ ఫోన్ మోగింది.అటువైపునుండి కనకారావు పిఎ..ఆ విషయం తన భార్య డాక్టర్ శ్రీదేవికి సైగ చేసి చూపించి కాల్ లిఫ్ట్ చేసాడు."చెప్పండి సార్! ఏమిటి విశేషాలు?" అడిగాడు శ్రీనివాస్."ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది?" అడిగాడు అతను."ఇంకా పూర్తిగా కోలుకోలేదు సార్! మరో రెండు మూడు రోజులకు నార్మల్ అవుతుంది" చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్."నార్మల్ కావాల్సిన అవసరం మనకు లేదు. స్పృహ లోకి వచ్చి ఉంటే చాలు" అన్నాడు పిఏ."కానీ పూర్తిగా కోలుకోకుండా మనం ఏమైనా ప్రశ్నలు వేస్తే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. మరొక రెండు రోజులు ఓపిక పడదాం" చెప్పాడు శ్రీనివాస్."ఆ అమ్మాయికి ఏమైతే మనకేం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు. ఢిల్లీ నుంచి ప్రముఖ హిప్నాటిస్టు, మరో ప్రముఖ సైకియాట్రిస్ట్ రేపు వస్తున్నారు. వాళ్లను కనకారావు గెస్ట్ హౌస్ లో దించుతున్నాము. మీరు కూడా ఆ అమ్మాయిని తీసుకొని గెస్ట్ హౌస్ కి రండి. అక్కడ వాళ్లు 'ఆ అమ్మాయి మీద వేరెవరి ప్రభావమైన ఉందా' అనే కోణంలో పరిశీలిస్తారు. కనకారావు కారణంగా చనిపోయిన వారి ఆత్మ ఏమైనా ఆ అమ్మాయి మీద ప్రభావం చూపిస్తోందా అనే విషయం గమనిస్తారు. అలాంటిదేమీ లేని పక్షంలో జరగబోయేవి తెలుసుకొనే అతీంద్రియ శక్తి ఆ అమ్మాయికి ఉందా అని పరిశీలిస్తారు. అలాంటి శక్తి ఏమైనా ఉంటే ఆ అమ్మాయికి, ఆమె భర్తకు కనకారావు కంపెనీలలో మంచి ఉద్యోగం ఇచ్చి తన దగ్గరే ఉంచుకుంటారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/NwhF8aSw4Ug

Episode metadata supplied by the publisher feed · Published Mar 30, 2023

Embed this episode

NOW PLAYING

నాకేమవుతోంది ఎపిసోడ్ 16 | Nakemavuthondi Episode 16 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 14:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 30, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!