EPISODE · Apr 6, 2023 · 14 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 17 | Nakemavuthondi Episode 17 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 17 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "అలాగే ప్రియా..నేను వెంటనే బయలుదేరుతాను.ఎసిపి ప్రతాప్ గారి అన్న కొడుకు ఉదయ్, తరుణ్ కి స్నేహితుడు. నాకు కూడా బాగా తెలుసు. డాక్టర్ శ్రీనివాస్ గారికి అభ్యంతరం లేకుంటే అతన్ని కూడా తీసుకొని వస్తాను. ఒకసారి వారిని కనుక్కో" అంది ప్రవల్లిక.ప్రియ, శ్రీనివాస్ తో విషయం చెప్పింది. అయన సరేనన్నాక ప్రవల్లికకు కాల్ చేసి ఉదయ్ ని తీసుకొని రమ్మంది.మరో అరగంటకు ఉదయ్, ప్రవల్లికలు డాక్టర్ శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు శ్రీనివాస్ దంపతులు."తెలీదు తెలీదంటూనే చాలా వివరాలు చెప్పారట సస్పెండైన ఎస్సై రంగనాథం, రిసార్ట్ మేనేజర్ సందీప్ లు. హన్సిక హత్య గురించి చాలా వివరాలు తెలిసాయి. అవన్నీ ఉదయ్ మీకు చెబుతాడు" అంది ప్రవల్లిక.ఉదయ్, శ్రీనివాస్ వంక సందేహంగా చూడటంతో "మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. డాక్టర్ దంపతులిద్దరూ మన శ్రేయోభిలాషులే. అన్నట్లు తరుణ్ మిమ్మల్ని కలిశాడటగా..మీరు సపోర్ట్ గా ఉండక పోతే తరుణ్ చాలా ఇబ్బంది పడేవాడు" అంది ప్రియా."తరుణ్ ని అతని స్నేహితుడి గదిలో కలిసినప్పుడే నాకు అతను నిర్దోషనిపించింది. కానీ రిసార్ట్ మేనేజర్ సందీప్ ఆ శవం మీదేనని, మిమ్మల్ని తరుణ్ హత్య చేసి, శవాన్ని మాయం చేయమని తన సహాయం కోరాడని స్టేషన్ లో ఇంటరాగేషన్ లో చెప్పాడు. అయితే ప్రవల్లిక మాత్రం నా అంచనా తప్పు కాదని, తరుణ్ నిర్దోషి అని వాదించింది. లేకుంటే తరుణ్ ని ఇంటరాగేట్ చేసి ఉండే వాళ్ళు." చెప్పాడు ఉదయ్."రంగనాథం, సందీప్ లు బయట పెట్టిన విషయాలు వీళ్లకు చెప్పండి" అంది ప్రవల్లిక.ప్రియ వంక చూస్తూ చెప్పడం ప్రారంభించాడు ఉదయ్."చూడండి ప్రియ గారూ! మీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనలను గురించి మీ తల్లిదండ్రులు స్టేషన్లో చెప్పారు. ఆ విషయాలు ప్రవల్లిక నాకు తెలియజేసింది. గతంలో జరిగిన సంఘటనలలో కనకారావు ప్రమేయం ఉన్నట్లే హన్సిక హత్య విషయంలో కూడా అతని ప్రమేయం ఉంది. హన్సిక భర్త పేరు శ్రీ రాజ్. అతని తండ్రి దామోదర్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. కనకారావు కు మంచి స్నేహితుడు కూడా. హన్సిక తన భర్తను వదిలి ఇండియాకు వచ్చేసింది. అంతే కాకుండా అతని ఆస్తిలో సగభాగం కావాలని కేసు పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. హన్సిక అడ్డు తొలగించుకుంటే ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం ఉండదని దామోదర్ భావించాడు. అంతేకాకుండా తన కొడుకు శ్రీ రాజ్ కి మరొక కోటీశ్వరుడి కూతురి సంబంధం చేసుకోవచ్చని ఆశించాడు. తనకు సహాయం చేయమని కనకారావును అభ్యర్థించాడు. కనకారావు, ఇండియాకు వచ్చిన హన్సిక ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆరా తీశాడు. తను మీ ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉన్నట్లు తెలుసుకున్నాడు. మీ దగ్గర నుండి వెళ్ళాక హన్సిక రోషన్ అనే మీ క్లాస్మేట్ తో కొద్ది రోజులు కలిసి తిరిగినట్లు తెలుసుకున్నాడు. హన్సిక హత్యకు సహకరిస్తే భారీ మొత్తం ఇస్తానని రోషన్ కి ఎర చూపాడు కనకారావు. తను హత్య చేయలేనని, కావాలంటే మీరు చెప్పిన చోటికి హన్సికను తీసుకొని వస్తానని రోషన్ చెప్పాడు.హన్సికను తను స్వయంగా కలిసి కేసు పెట్టవద్దని చెబుతానని కనకారావును కోరాడు ఆమె భర్త శ్రీ రాజ్. తన మాట హన్సిక వినకపోతే అప్పుడు ఆమెను హత్య చేయవచ్చునని చెప్పాడు. కానీ హత్య జరిగే సమయానికి శ్రీరాజ్ ఇండియాకు వచ్చి ఉండడం మంచిది కాదని కనకారావు సూచించాడు. ఖచ్చితంగా అనుమానం అతని మీదకే వెళుతుందని చెప్పాడు. కానీ శ్రీ రాజ్ ఒకసారి హన్సిక ను కలవాలని పట్టు పట్టాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/WQAOZbXsQG8
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 17 | Nakemavuthondi Episode 17 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.