EPISODE · Apr 13, 2023 · 15 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 18 | Nakemavuthondi Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది..? ఎపిసోడ్ 18 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తన ఇంటికి వచ్చిన ఉదయ్ ని సాదరంగా ఆహ్వానించాడు డిటెక్టివ్ పురంధర్. అతని భుజం పై చేయవేసి తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు. గది బయటే ఆగిన ప్రవల్లిక ను చూసి "నువ్వు కూడా రావచ్చమ్మా" అన్నారాయన. వెంటనే ప్రవల్లిక కూడా తండ్రి గదిలోకి ప్రవేశించింది. "కాఫీ రెడీగా ఉంచాను. తాగాక మాట్లాడుకోండి" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది శారద. చిన్నగా నవ్వుకున్నాడు పురంధర్. తను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పొరపాటున కూడా మధ్యలో తన గదిలోకి రాదు శారద. మరీ అవసరమైతే గది బయటే నిలబడి తలుపు తడుతుంది. లేదా తనకు మిస్డ్ కాల్ ఇస్తుంది. "అలాగే శారదా! వెయిట్ చేస్తాను" అన్నాడు అతను. చెప్పినట్లుగానే రెండు నిమిషాల్లో వాళ్లకు కాఫీ అందించింది శారద. ఆమె బయటకు వెళ్లాక ఉదయ్, ప్రవల్లికలను కాఫీ తాగమని చెప్పాడు. తను కూడా కాఫీ సిప్ చేస్తూ చెప్పడం ప్రారంభించాడు. "రేపు ఢిల్లీ నుంచి హిప్నాటిస్టు భూషణ్, సైకియాట్రిస్ట్ త్రిపాఠి వస్తున్నారు. భూషణ్ తెలుగు వాడే. నాకు బాగా తెలుసు. గతంలో కొన్ని కేసుల విషయంలో అతని సహకారం తీసుకున్నాను. అతను నాకు క్యాజువల్ గా కాల్ చేశాడు. కనకారావు ఒక పేషంట్ విషయంగా తన సహకారం కోరినట్లు చెప్పాడు. అందుకోసం తను హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పాడు. నన్ను తప్పకుండా కలుస్తానని చెప్పాడు. దాంతో అతను వచ్చేది ప్రియా విషయంగా అని నాకు అర్థమైంది. ఈ కేస్ మీరు పరిశోధన చేస్తున్నట్లు ఆయనకు చెప్పాను. భూషణ్ చాలా మంచి వ్యక్తి. మనకు సహకరిస్తానని చెప్పాడు. త్రిపాఠి తో కూడా మాట్లాడతానని అన్నాడు. వాళ్ళిద్దరూ ప్రియాను పరీక్షించాక ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తరువాత మీతో మాట్లాడి కనకారావుకు ఎంతవరకు చెప్పవచ్చు అనే విషయంలో మీ సలహా తీసుకుంటారు. కనకారావు మనుషులు భూషణ్ తో మాట్లాడుతూ అవసరమైతే ప్రియా కు సంబంధించిన మనుషుల మీద దాడికి ప్లాన్ చేస్తామని, ఆ సమయంలో ప్రియ లో కలిగే మానసిక మార్పులు గమనించవచ్చని చెప్పారట. ముందు ప్రాథమికంగా పరీక్షించనివ్వమని, అంతగా అవసరమైతే ఆ తర్వాత చెబుతానని భూషణ్ దాట వేసాడట" తనకు తెలిసిన విషయాలు చెప్పడం ముగించాడు డిటెక్టివ్ పురంధర్. ప్రవల్లిక మదిలో అప్పటికప్పుడు ఒక ఆలోచన రూపుదిద్దుకొంది. అయితే అది చెప్పడానికి సమయం కాదని ఊరుకుంది. ఉదయ్ మాట్లాడుతూ "డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రియను తన తల్లిదండ్రులకు గాని లేదా పోలీసులకు గాని అప్పగించడానికి సిద్ధపడ్డారు. కానీ ప్రియాకు తనకేం అవుతుందో తెలుసుకోవాలని ఉంది. అందుకోసం రేపు గెస్ట్ హౌస్ కు వెళ్లడానికి సిద్ధపడింది" అని చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/RfUEjqKwJwk
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 18 | Nakemavuthondi Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.