నాకేమవుతోంది ఎపిసోడ్ 20 | Nakemavuthondi Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 30, 2023 · 12 MIN

నాకేమవుతోంది ఎపిసోడ్ 20 | Nakemavuthondi Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 20 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ముందుగా తేరుకున్న డాక్టర్ శ్రీనివాస్ "గ్రేట్ ప్రియా! చాలా చక్కగా గుర్తు చేసుకున్నావు" అంటూ ఆమెను అభినందించాడు. త్రిపాఠి మాట్లాడుతూ నీలో కచ్చితంగా అద్భుతమైన శక్తి ఏదో దాగి ఉంది. మిగిలిన విషయాల్లో కూడా నీకు ముందుగా సూచనలు కనపడడంతోపాటు, ఆ వ్యక్తులు కూడా ఆరోజు నీకు గుర్తుకు వచ్చి ఉంటారు. ఆ సందర్భాలు భూషణ్ గారు మీకు చెబుతారు. నువ్వు ఇలాగే ప్రయత్నించి గుర్తుకు తెచ్చుకో" అన్నారు. తర్వాత హిప్నాటిస్ట్ భూషణ్ మాట్లాడుతూ "నువ్వు హాస్టల్ లో ఉండి చదువుకునే దానివి కదూ" అని ప్రశ్నించాడు. అవునని చెప్పింది ప్రియ. "మీ పెదనాన్న గారి ఇంటికి తరచుగా వెళ్లే దానివా?" అడిగాడు అతను. "ప్రతి ఆదివారం వెళ్లేదాన్ని. పండగ రోజుల్లో కూడా వాళ్ళు రమ్మని బలవంతం చేయడంతో వెళ్తూ ఉండేదాన్ని. నేను వెళ్ళినప్పుడల్లా మరో వారం పది రోజులకు సరిపోయేలా పచ్చళ్ళు, పొడులు ఇచ్చి పంపేది మా పెద్దమ్మ" చెప్పింది ప్రియ. "మీ పెదనాన్న, పెద్దమ్మలు గొడవ పడగా ఎప్పుడైనా చూసావా?" అడిగాడు డాక్టర్ శ్రీనివాస్. "లేదు. పెదనాన్న కూడా నాన్నగారిలాగే చాలా సౌమ్యులు. చిన్నగా కసురుకోవడం కూడా నేనెప్పుడూ గమనించలేదు" చెప్పింది ప్రియ. " మీ పెద్దమ్మ బలానికి విటమిన్ టాబ్లెట్స్ వేసుకునేది కదా?" అడిగాడు శ్రీనివాస్. "అవును. ప్రతిరోజూ వేసుకుంటానని నాకు చెప్పింది" అంది ప్రియ. "మరి ఆ మాత్రలు స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయని నీకు ఎందుకు అనిపించింది?" అడిగాడు హిప్నాటిస్ట్ భూషణ్. ఆలోచనలో పడింది ప్రియ. కొంతసేపటికి తేరుకొని "పక్కింటావిడ విషయంలో జరిగేది నాకు అలా అనిపించి ఉంటుంది" అంది. "అది మనం ముందుగానే అనుకున్నదే!నేను అడిగేది నువ్వు మీ పెద్దమ్మతో ఆ మాత్రలు వాడవద్దని చెప్పావు కదా.. ఆరోజు కానీ, ముందు రోజు కానీ, ఆ పక్కింటి ఆవిడ నీకు గుర్తుకు వచ్చిందా.. బాగా ఆలోచించి చెప్పు" అన్నాడు భూషణ్. కొంతసేపు ఆలోచించిన తర్వాత "అవును. ముందు రోజు ఆవిడ మా పెద్దమ్మతో మాట్లాడుతూ తనకు ఒంట్లో నీరసంగా ఉంటుందనీ, మాత్రలు వాడుతున్నా ఏమాత్రం ఉపయోగం లేకపోగా నీరసం ఇంకా ఎక్కువ అవుతోందనీ చెప్పింది. ఆరోజు రాత్రి ఆమె చెప్పిన విషయం గురించే ఆలోచించాను. మరుసటి రోజు మా పెదనాన్న విటమిన్ టాబ్లెట్లు మా పెద్దమ్మ చేత మింగించడం గమనించాను. పెద్దమ్మను పక్కకు పిలిచి ఆ మాత్రలు వాడవద్దని చెప్పాలనిపించింది" చెప్పింది ప్రియ. "అంటే ఇక్కడ కూడా నీకు జరగబోయే విషయం తెలియడంతో పాటు ఆ వ్యక్తులు నీకు ఏదో రకంగా గుర్తుకు రావడం జరిగింది. ఇప్పుడు హన్సిక గురించి అడుగుతాను. బాగా ఆలోచించుకొని చెప్పు" అన్నాడు భూషణ్. అంగీకారంగా తల ఊపింది ప్రియ. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

Episode metadata supplied by the publisher feed · Published Apr 30, 2023

Embed this episode

NOW PLAYING

నాకేమవుతోంది ఎపిసోడ్ 20 | Nakemavuthondi Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 12:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 30, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!