EPISODE · May 9, 2023 · 13 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 21 | Nakemavuthondi Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 21 ప్రియను చంపేస్తానంటూ కనకారావు చెప్పిన మాట విన్న శ్రీనివాస్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. "తొందరపడకండి కనకారావు గారూ! ఆ అమ్మాయి మిస్ అయినట్లు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీ రిసార్ట్ మేనేజర్ సందీప్, అతనికి సహకరించి సస్పెండ్ అయిన రంగనాథం పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక కనిపించడం లేదు. వాళ్లను పోలీసులే దాచి టార్చర్ పెట్టి ఉంటే, వాళ్లు ఈపాటికి మీ పేరు చెప్పే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి హత్యకు గురైతే, కచ్చితంగా పోలీసులు మిమ్మల్నే అనుమానిస్తారు" కనకారావు ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. అటువైపు నుండి వికృతంగా నవ్వాడు కనకారావు. "పోలీసులు అనుమానిస్తారనీ, పత్రికల్లో ఏదో రాస్తారనీ భయపడే స్థాయి దాటిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. పట్టపగలు నడిరోడ్డు మీద నేను స్వయంగా ఎవరినైనా చంపినా నన్నేమీ చేయలేరు. ఒక వారం రోజులు పేపర్లలోనూ, టీవీల్లోనూ నా గురించి వార్తలు వస్తాయి. నన్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ నా మనుషులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. కొద్దిరోజులకు నేను బెయిల్ మీద బయటకు వస్తాను. కోర్టులో నాకు వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పకుండా చూసుకుంటాను కొంతకాలానికి కేసు కొట్టివేయబడి నిర్దోషిగా విడుదలవుతాను. ఇవన్నీ నాకు చిన్న విషయాలే. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరినీ రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి పంపించేస్తాను. రేపు రాత్రికి ఆ అమ్మాయి పని పూర్తి చేస్తాను" చెప్పాడు కనకా రావు. "కానీ ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది? ట్రాన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి మీ గురించి ఏమీ తెలియదని చెప్పింది. అసలే సిబిఐ ఎంక్వయిరీ లో తప్పించుకోలేక అవస్థ పడుతున్నారని నాకు తెలుసు. ఇప్పుడు మరో సమస్య సృష్టించుకోవడం ఎందుకని చెప్పాను. అంతే" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. "సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు జరిగింది? నా గుట్టుమట్లు బయట వాళ్లకు చేరాయి కాబట్టి జరిగింది. టీవీలో, న్యూస్ పేపర్లలో రావడంతో నా మినిష్టర్ పదవి పోయి మాజీని అయ్యాను. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా?" ప్రశ్నించాడు కనకారావు. "పార్టీలో మీరంటే గిట్టని వాళ్ళు చేయించి ఉంటారు" అన్నాడు శ్రీనివాస్. "అది నిజమే అయి ఉండవచ్చు. కానీ వాళ్లకు నా రహస్యాలని చెప్పింది ఎవరో ఊహించగలవా?" అడిగాడు కనకారావు. లేదని చెప్పాడు శ్రీనివాస్. "ఇంతసేపూ నా పిఎ ఫోన్లో నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఊహించగలవా.. నా రహస్యాలు అతనే బయట వాళ్లకు చేరవేస్తున్నాడని నా అనుమానం. అందుకే వాడిని బంధించి, వాడి ఫోను నా కస్టడీలో పెట్టుకున్నాను. వీడికి ఎవరెవరి దగ్గర నుండి ఫోన్లు వస్తాయో గమనిస్తాను. ఇక నీ సంగతి చెప్పు. నా గురించి నీకు బాగా తెలుసు. నేనెంత దుర్మార్గుడినో నా నోటితో చెప్పించవద్దు. కొద్దిరోజులు ట్రీట్మెంట్ చేశావు కాబట్టి నీకు ఆ అమ్మాయి మీద జాలి ఉండవచ్చు. కానీ ఏదైనా నీ ప్రాణం తరువాతే అని తెలుసుకో. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/bm7TM1pLpoE
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 21 | Nakemavuthondi Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.