EPISODE · Dec 13, 2022 · 11 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 3 | Nakemavuthondi Episode 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
నాకేమవుతోంది…? ఎపిసోడ్ 3 రచన: మల్లవరపు సీతారాం కుమార్ మీకు చదివి వినిపిస్తున్నది చందన. గత ఎపిసోడ్ లో... కొత్తగా కాపురం పెట్టిన ప్రియ అనే అమ్మాయి తనకు ఎదురైన అనుభవాలను చెబుతోంది. ఆరోజు రాత్రి భర్త ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగిస్తుంది. తనకు ఏదైనా హాని జరుగుతుందేమోనని ఆమెకు అనిపిస్తుంది. తన ఆందోళనను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని తలపోస్తుంది. ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక మూడవ భాగం చదవండి… టీవీలో వస్తున్న ఆ మూవీలో ఆ యువతి ఇంటి డోర్ తీసుకుని వేగంగా బయటకు వెళ్ళింది. అతడు ఆమెను వెంబడించాడు. ఆమె ఇంటి బయట లాన్ లో పరుగెడుతోంది. అతడు వేగం పెంచి ఆమెను సమీపించాడు. ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. తన ఎడం చేత్తో ఆమె కళ్ళను వెనకనుండి మూసి కుడి చేతి లోని కత్తిని ఆమె గొంతు మీదికి తెచ్చాడు. నా అదృష్టమేమో.. ఆ ఎపిసోడ్ అక్కడితో ముగియడంతో ఈ లోకం లోకి వచ్చాను. టీవీ ఆఫ్ చేసి, తిరిగి ల్యాప్టాప్ వైపు దృష్టి సారించాను. నాన్న పేరుతో ఒక మెయిల్ క్రియేట్ చేసి మర్నాడు సాయంత్రానికి చేరేలా షెడ్యూల్ చేసాను. నేను టైపు చేస్తున్న మేటర్ ని పూర్తి చేసి ఆ మెయిల్ లో పేస్ట్ చేశాను. ఒకవేళ ఇదే నా చివరి ఉత్తరం అయితే అమ్మకూడా చదవగలుగుతుంది అని తెలుగులో టైపు చేశాను. ల్యాప్టాప్ మూసివేశాను. అంతలో వెనకనించి ఎవరో ఊపిరి పిలుస్తున్న శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడ్డాను. తల వెనక్కి తిప్పే లోగా అతను తన ఎడం చేత్తో నా రెండు కళ్ళు మూశాడు. ఆ స్పర్శ తరుణ్ దేనని తెలుస్తోంది. నా రెండు చేతులతో అతని చేతిని నెట్టేయ్యాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. ఇక నా పని ముగిసినట్లేనని భావించాను. చివరి ప్రయత్నంగా గట్టిగా కేకలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పక్క అపార్ట్మెంట్ నుండి గానీ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నుండి గానీ ఎవరైనా వచ్చి కాపాడే అవకాశం ఉంది. వాళ్లు అంత ధైర్యం చెయ్యకపోయినా, ఎవరైనా విని ఉంటే తనకు ప్రమాదమని తరుణ్ భావించి, ఈరోజుకు తననేమీ చేయకపోవచ్చు. నా ఆలోచనలు మది దాటకముందే నా కళ్ళను మూసిన అతని ఎడమ చేయి కిందికి జారి, నా నోటిని మూసేసింది. మై గాడ్! నా మనసు లోని ఆలోచనలు తరుణ్ కి తెలిసి పోతున్నాయా! ఇప్పుడే టివిలో చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది. కత్తి పోటు పడకూడదని నా కుడిచేతిని మెడ మీద ఉంచుకున్నాను. అతను తన కుడి చేత్తో నా చేతిని అవలీలగా పక్కకు నెట్టేశాడు. 'హమ్మయ్య! ఆ చేతిలో కత్తి లేదన్నమాట..' అని నేను అనుకున్నాను. అంతలో అతని ఊపిరి లో వెచ్చదనం నా మెడను తాకింది. అంటే అతని తలను నా మెడ దగ్గరకు తెచ్చాడన్నమాట. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/v5_Q-kHAvhk
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 3 | Nakemavuthondi Episode 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.