EPISODE · Jan 3, 2023 · 14 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 5 | Nakemavuthondi Episode5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 5 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... ప్రియ అనే యువతి, తన భర్త ప్రవర్తనలో తేడా ఉన్నట్లు తండ్రి ప్రభాకర రావుకి షెడ్యూల్ చేసిన మెయిల్ పంపుతుంది. తరువాత ఆ మెయిల్ ఆవేశంలో పంపినట్లు మరో మెయిల్ వస్తుందతనికి. ఎస్సై రంగనాథం, రిసార్ట్ సమీపంలో పడిఉన్న శవాన్ని పరిశీలించడానికి వెళ్తాడు. రిసార్ట్ రిజిస్టర్ లో వరుణ్, రియా అన్న పేర్లు చూసి అనుమానిస్తాడు. ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఐదవ భాగం చదవండి… హాల్లో పేపర్ చదువుకుంటున్న భర్త ప్రభాకరరావు దగ్గరకు వచ్చింది ప్రమీల. అతని పక్కనే నిల్చుని మెల్లిగా “ఏమండీ !" అని పిలిచింది. అతను పేపర్ లో నుంచి తల పైకి ఎత్తకుండానే "ఏమిటి?" అన్నాడు. ప్రమీల అతని చేతిలో నుంచి పేపర్ లాక్కొని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టింది. తెల్లబోయి తలెత్తి ఆమె వంక చూసాడు ప్రభాకరరావు ఏమిటన్నట్లు. "ఈరోజు ఏం వారం?" అని అడిగింది సీరియస్ గా. "అది అడగడానికి నా చేతి నుంచి పేపర్ లాగేయాలా? ఈరోజు మంగళవారం. ఇంతకీ ఏమిటి విషయం?" అన్నాడు. "అది నాకు కూడా తెలుసు. మంగళవారం అనగానే మీకేమీ గుర్తుకు రావడం లేదా?" అడిగింది కాస్త కోపంగా. కాసేపు బుర్ర గోక్కున్నాడు ప్రభాకరరావు. తరువాత ఏదో గుర్తుకు వచ్చి "అమ్మాయి చేత శుక్రవారం నోములు నోయిస్తానన్నావు. మంగళవారం నోములు కాదు గదా.. నాకు లాగే నీకు కూడా మతిమరుపు మొదలయిందన్నమాట" అన్నాడు. "ఫరవాలేదు. మొత్తానికి మీకొక కూతురు ఉన్నట్లు గుర్తుకు వచ్చింది. మూడు రోజుల నుండి ఆ కూతురు ఫోన్ తీయడం లేదు అన్న సంగతి గుర్తుకు రాలేదా?" సీరియస్ గా అడిగింది ప్రమీల. "నేను మర్చిపోయినా నువ్వు వదిలి పెట్టావు కదా.. నిన్న రాత్రి కూడా ఫోన్ తీయలేదని చెప్పావు. నిన్న కూడా రిసార్ట్ లోనే గడిపి ఉంటారు. ఈ విషయం రాత్రి నువ్వు అడిగినప్పుడే చెప్పాను కదా!" అన్నాడు ప్రభాకరరావు. "అలాగే అనుకున్నా ఈరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేయాలి కదా! ఈరోజు ఇద్దరూ ఆఫీస్ కి వెళ్లాలి కదా" అంది ప్రమీల. ఒక సారి టైం చూసుకున్నాడు ప్రభాకరరావు. "ఉదయం ఎనిమిది గంటలయింది. సరేలే.. మరో గంట ఆగి నేను ఫోన్ చేస్తాను. ఈలోగా నీకు టెన్షన్ లేకుండా ఉండడానికి ఒక ఉపాయం చెప్తాను" అన్నాడు భార్యతో. "చెప్పండి" అంది ప్రమీల అతని పక్కనే కూర్చుంటూ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/yaepgSXDV5c
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 5 | Nakemavuthondi Episode5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.