నాకేమవుతోంది ఎపిసోడ్ 6 | Nakemavuthondi Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 9, 2023 · 13 MIN

నాకేమవుతోంది ఎపిసోడ్ 6 | Nakemavuthondi Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 6 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  గత ఎపిసోడ్ లో... కూతురు ఫోన్ తియ్యక పోవడం గురించి ఆందోళన  పడుతుంది ప్రియా తల్లి ప్రమీల. కూతురు పంపిన మొదటి మెయిల్ లోని విషయం చెబుతాడు ప్రభాకర రావు. ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదని కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది ప్రమీల. దార్లో డిటెక్టివ్ పురందర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి ప్రియా ఫోన్ నంబర్ గనుక మారిఉంటే తనకు ఇవ్వమని ప్రమీలను అడుగుతుంది. ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఆరవ భాగం చదవండి… భార్య చెప్పింది విన్న ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలైంది. ఫోన్ భార్య చేతి నుండి అందుకుని, "చూడమ్మా! మా అమ్మాయి కూడా మూడు రోజుల నుండి  ఫోన్ తీయడం లేదు. అయితే రెండు మార్లు మెయిల్ చేసింది. పొద్దున ఫోన్ చేయమని మెసేజ్ పెడితే సిగ్నల్స్ సరిగ్గా లేవని, రాత్రికి ఇంటికి వచ్చాక కాల్ చేస్తానని రిప్లై మెసేజ్ ఇచ్చింది" ఆందోళనగా చెప్పాడు. "మీరు బజారులో ఉన్నట్లు ఉన్నారు. వాయిస్ సరిగా వినపడ్డం లేదు. పక్కనే ఏదైనా  ఖాళీగా ఉన్న రెస్టారెంట్ ఉంటే అందులోకి వెళ్ళి కాల్ చేయండి" అంది ప్రవల్లిక. కాస్త దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు ప్రభాకర్ రావు. తరువాత ప్రవల్లిక కి  ఫోన్ చేసి "మా అమ్మాయి మొదట పెట్టిన మెయిల్ లో ఇది షెడ్యూల్ చెయ్యబడ్డ మెయిల్ అని, తను క్షేమంగా ఉంటే దీన్ని మరో తేదీకి మారుస్తానని రాసింది. ఆ మెయిల్ కనుక నాకు చేరితే  తనకేదో ఇబ్బంది కలిగినట్లేనని  కూడా రాసింది. కానీ తరువాతి మెయిల్లో భర్తతో చిన్నపాటి తగాదా అయిందని, ఆ ఆవేశంలో అలా మెయిల్ పెట్టానని, దాన్ని డిలీట్ చేయమని రాసింది. భర్తతో కలిసి  రిసార్ట్ కి వెళ్తున్నానని, అక్కడ సిగ్నల్స్  సరిగ్గా ఉండవని, కాల్ చేయవద్దని కూడా ఆ మెయిల్లో రాసింది" చెప్పాడు ప్రభాకరరావు. “మీరు డిలీట్ చేసిన మెయిల్ ట్రాష్ ఫోల్డర్ లో  ఉంటుంది. దాన్ని రిస్టోర్  చేసి  ఆ రెండు మెయిల్స్  నాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కూడా పంపండి" అంటూ తన మెయిల్ ఐడి చెప్పింది ప్రవల్లిక. భర్త చేతి నుండి ఫోన్ తీసుకున్న ప్రమీల "నేను ఇప్పుడే  హైదరాబాద్ కి బయలుదేరుతున్నాను. ఈ లోపల నువ్వు కాస్త శ్రద్ధ తీసుకొని, మా అమ్మాయి ఎక్కడ ఉందో వాకబు  చేయి. నీకు పుణ్యం ఉంటుంది" అంటూ అభ్యర్థించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Llr6ckPsaak

Episode metadata supplied by the publisher feed · Published Jan 9, 2023

Embed this episode

NOW PLAYING

నాకేమవుతోంది ఎపిసోడ్ 6 | Nakemavuthondi Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 13:54

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!