EPISODE · Jan 18, 2023 · 11 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 7 | Nakemavuthondi Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 7 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... హన్సిక మూడు రోజులనుండి కనపడ్డం లేదని ప్రవల్లిక చెప్పడంతో ప్రమీలతో పాటు ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలవుతుంది. ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు. స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్. హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్. ఇంతలో ఏసిపి నుండి కాల్ రావడంతో రిసార్ట్ దగ్గరకు వెళ్తాడు ఉదయ్. ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఏడవ భాగం చదవండి… తన కార్లో రిసార్ట్ దగ్గరకు వెళతాడు ఉదయ్. అప్పటికే సీఐ మురళి, డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక అక్కడ ఉంటారు. వాళ్లకు కాస్త దూరంగా ఎస్సై రంగనాథం, అతని పక్కనే రిసార్ట్ మేనేజర్ సందీప్ చేతులు కట్టుకొని అతివినయం చూపిస్తూ ఉంటారు. ఉదయ్ రాగానే మురళి, ప్రవల్లిక అతన్ని విష్ చేస్తారు. గతంలో డ్రగ్స్ రాకెట్ పట్టుకున్న కేసులో ముగ్గురూ కలిసి పనిచేసే ఉంటారు. ఉదయ్ కూర్చోగానే మురళి అతనితో "ఇప్పుడే మీ బాబాయి ఏసిపి ప్రతాప్ గారు ఫోన్ చేశారు. మీరు ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. మీ సహాయంతో ఈ కేసు తొందరగా ఓ కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాను" అన్నాడు. "మీలాంటి అనుభవజ్ఞులు కేసు డీల్ చేస్తున్నారు పైగా పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక పక్కనే ఉన్నారు. ఇక ఈ కేసులో నా అవసరమే ఉండదు అనుకుంటున్నాను" నవ్వుతూ అన్నాడు ఉదయ్. తరువాత మురళి రంగనాథం వంక చూస్తూ "రిసార్ట్ రికార్డులు సీజ్ చేయమని ఏసిపి గారు మీకు స్వయంగా చెప్పారు కదా" అని అడిగాడు. "చెప్పారు సార్! నేను బయలుదేరబోతూ ఉండగా సందీప్ స్టేషన్ కి వచ్చాడు. తన రిసార్ట్ లో దొంగతనం జరిగిందని, రిసార్ట్ రిజిస్టర్లు, సీసీ కెమెరా తాలూకు హార్డ్ డిస్క్ ఎవరో ఎత్తుకొని పోయారని కంప్లైంట్ చేశాడు. తరువాత నేను రిసార్ట్ కు వెళ్లి అతను చెప్పిన విషయాలు నిజమని ధ్రువీకరించుకున్నాను. ఆ తర్వాత, జరిగిన విషయాన్ని ఏసిపి గారికి ఫోన్ చేసి చెప్పాను" అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/lDW8RAF6p5Y
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 7 | Nakemavuthondi Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.