EPISODE · Jan 28, 2023 · 12 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 8 | Nakemavuthondi Episode 8 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 8 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... రిసార్ట్ దగ్గరకు వెళ్లిన ఉదయ్ - సీఐ మురళి, డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక లను కలుస్తాడు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్. రిసార్ట్ మేనేజర్ సందీప్ ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. రెస్టారెంట్ లో ఉన్న రిసెప్షనిస్ట్, తరుణ్ ఇద్దరు అమ్మాయిలతో - ఒకరి తరువాత ఒకరితో రెస్టారెంట్ కి వచ్చినట్లు చెబుతాడు. వాళ్లిద్దరూ ప్రియ, హన్సికలని ఫోటోలు చూసి గుర్తు పడతాడు. ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఎనిమిదవ భాగం చదవండి… "నన్ను వదిలి పెట్టండి.. నిజం చెప్పినందుకు అరెస్ట్ చేస్తారా.." అంటూ గొడవకు దిగాడు రెస్టారెంట్ రిసెప్షనిస్ట్. కానీ పోలీసులు అతనికి సమాధానం చెప్పకుండా జీప్ లో ఎక్కించుకొని స్టేషన్ కి తీసుకొని వెళ్ళారు. మరికొద్ది సేపటికి ఎసిపి ప్రతాప్ ఆ రిసార్ట్ దగ్గరకు వచ్చాడు. రిసార్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకచోట సమావేశపరిచాడు. తరుణ్, ప్రియ, హన్సికల ఫోటోలను వాళ్లకు చూపించి ఎవరైనా గుర్తుపడతారేమో అడిగాడు. తరుణ్, ప్రియా లను ఒక కాటేజ్ లోకి వెళుతూ ఉండగా చూసినట్లు కొందరు చెప్పారు. అలాగే వాళ్ళిద్దరూ రెస్టారెంట్ కు వచ్చినట్లు కూడా ఒకరిద్దరు చెప్పారు.. తరుణ్ ప్రియాలు ఉన్నారని చెబుతున్న కాటేజ్ లోకి ప్రతాప్ తో పాటు వెళ్లారు ఉదయ్, ప్రవల్లిక. ఆ గదిలో ఏ విధమైన వస్తువులు లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న కాటేజీలు తనిఖీ చేశారు. ఖాళీగా ఉన్న ఒక కాటేజీలో నేల మీద ఏవో రక్తపు మరకలు చెరిపివేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ రూమ్ లో ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. తర్వాత ఎసిపి ప్రతాప్, స్టేషన్లో ఉన్న సిఐ మురళికి కాల్ చేశాడు. "ఇక్కడ ఒక గదిలో రక్తపు మరకలు ఉన్నాయి. కాబట్టి హత్య రిసార్ట్ లోనే జరిగినట్లు అనిపిస్తోంది. రిసార్ట్ మేనేజర్ ను సరైన పద్ధతిలో విచారించండి. ఇక్కడి దర్యాప్తు పూర్తి చేసుకొని నేను మరో గంటలో స్టేషన్కు వస్తాను. ఈ లోగా అతని చేత నిజం కక్కించండి. అదుపులోకి తీసుకున్న రిసార్ట్ వాచ్మెన్ ని, ఇతర రిసార్ట్ సిబ్బందిని విడివిడిగా విచారిస్తే ఎవరో ఒకరు నిజం బయటపెడతారు" అని ఆదేశించాడు ప్రతాప్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 8 | Nakemavuthondi Episode 8 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.