నాకేమవుతోంది ఎపిసోడ్ 9 | Nakemavuthondi Episode 9 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 5, 2023 · 14 MIN

నాకేమవుతోంది ఎపిసోడ్ 9 | Nakemavuthondi Episode 9 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 9 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  తరుణ్ కి స్పృహ తప్పడంతో జీప్ ను రోడ్డు పక్కగా ఆపమంటాడు ఏసిపి ప్రతాప్. ఉదయ్, జీప్ లో ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్లు తరుణ్ ముఖం మీదికి చిలకరిస్తాడు. కొద్దిసేపటికి తరుణ్ కాస్త కదులుతాడు. ఉదయ్ అతని భుజాలు పట్టుకొని కుదపడంతో అతను కళ్ళు తెరుస్తాడు. "తరుణ్! ఆందోళన పడకు. ధైర్యంగా ఉండు" అన్నాడు ఉదయ్. "నామీద ఏదో కుట్ర జరుగుతోంది. చనిపోయింది ప్రియా కాదు. నేను కచ్చితంగా చెప్పగలను. కానీ ప్రియను నేను హత్య చేసినట్లు, శవాన్ని మాయం చేయడానికి సందీప్ సహాయం తీసుకున్నట్లు అతను ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్.. నన్ను నమ్మండి" అభ్యర్థనగా అన్నాడు తరుణ్. ప్రవల్లిక మాట్లాడుతూ "భయపడకండి మిస్టర్ తరుణ్! రిసార్ట్ మేనేజర్ చెప్పినంత మాత్రాన చనిపోయింది ప్రియా అనే నిర్ధారణకు పోలీసులు రారు. డీఎన్ఏ పరీక్షలో నిజం బయటకు వస్తుంది" అని చెప్పింది. ఉదయ్ మాట్లాడుతూ "డీఎన్ఏ పరీక్షలు జరుపుతారని తెలిసినా ఆ శవం ప్రియాదేనని రిసార్ట్ మేనేజర్ సందీప్ ఎందుకు చెబుతున్నట్లు? నా ఉద్దేశంలో అతను ఈ హత్యను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. డీఎన్ఏ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపల మనం ప్రియా కోసం గాలించ కూడదనేదే అతని ఉద్దేశం. ఈ మధ్య కాలంలో ఏం జరగబోతోంది? ప్రియా కు హాని చేయాలనుకుంటే అంత సమయం అవసరం లేదు. ఆమె ద్వారా ఏదైనా పని చేయించాలనుకుంటున్నారా.. లేదా ఆమెను ఎందుకైనా ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు ఆమె ఎక్కడ ఉందో.. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది" అన్నాడు. ఏసిపి ప్రతాప్ తరుణ్ తో మాట్లాడుతూ "చూడండి మిస్టర్ తరుణ్! మీ ఆవేదన మాకు అర్థమయింది. చనిపోయింది ప్రియా అనే అభిప్రాయానికి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్  వచ్చేవరకు మేము నిర్లక్ష్యంగా ఉంటామని మీరు భావిస్తున్నారు. ఈ లోపల ప్రియా కు ఏదైనా అపకారం జరుగుతుందేమోనని భయపడుతున్నారు. కానీ మీకు పోలీసు దర్యాప్తు గురించి అవగాహన లేదు. కేవలం ఒకరు చెప్పేది విని ఒక అభిప్రాయానికి రాము. ఏ కేసునైనా అన్ని విధాలుగా పరిశీలిస్తాము. కేసు దర్యాప్తు చేస్తున్న మన సీఐ మురళి మంచి సమర్థుడు. ఇక ఉదయ్, ప్రవల్లికలు ఈ పరిశోధనలో తమ వంతు సహకారం అందిస్తున్నారు. డిటెక్టివ్ పురంధర్ గారు రేపు బెంగళూరు నుండి తిరిగి వస్తున్నారు. రేపటినించి మనకు అయన సహకారం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడవద్దు. మీరు కోలుకున్నట్లు చెబితే మనం స్టేషన్ కు వెళదాం. లేదా మీకు అవసరమైతే మిమ్మల్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాం" అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/uacZ8NR_kog

Episode metadata supplied by the publisher feed · Published Feb 5, 2023

Embed this episode

NOW PLAYING

నాకేమవుతోంది ఎపిసోడ్ 9 | Nakemavuthondi Episode 9 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 14:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 5, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!