నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ | Nanna Nannu Daggaraku Tisukovuu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · May 25, 2023 · 7 MIN

నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ | Nanna Nannu Daggaraku Tisukovuu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Nanna Nannu Daggaraku Tisukovuu' New Telugu Story Written By Neeraja Hari Prabhala 'నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) భార్య సరోజ పురిటికని పుట్టింటికి వెళ్ళి రెండు నెలలైంది. ఇన్నిరోజులు వంట చేతకాకపోయినా ఎలాగో చేతులు కాల్చుకుంటూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నాడు రాము. ఇంకో రెండు రోజుల్లో డెలివరీ డేట్ అని డాక్టరు చెప్పిందని రాత్రి సరోజ చెప్పింది. ఆ తీయని కబురు కోసం ఎదురు చూస్తున్నాడు తను. శెలవు పెట్టి సరోజ వద్దకు వెళదామంటే ఆఫీసులో శెలవు దొరకలేదు. ఆ మరుసటిరోజు మామగారు ఫోన్ చేసి 'సరోజకు లేబర్ పెయిన్స్ మొదలయ్యాయి' అంటే తన మససంతా టెన్షన్. తొలిచూలు. పాపం సరోజ ఎంత బాధ పడుతోందో? ఈ సమయంలో తను దగ్గర ఉండి కాస్త ధైర్యం చెపితే ఎంత బాగుండునో కదా!' అని పరిపరి విధాలా మదన పడుతుండగా మళ్ళీ అత్తగారు ఫోన్ చేసి " నీకు ఆడపిల్ల పుట్టింది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి నీ ఇంటికి వచ్చింది" అని చెప్పగానే పట్టరాని ఆనందంతో స్వీట్లు తీసుకెళ్లి ఆఫీసులో పంచి శెలవు పెట్టి వెంటనే బస్సు ఎక్కి అత్తారింటికి వెళ్ళాడు రాము. హాస్పిటల్ కు వెళ్లి భార్యను చూసి పలకరించి పాపను చేతుల్లోకి తీసుకుని ఒక్కసారిగా తృళ్ళిపడ్డాడు. తను ఎంతగానో ఊహించుకుని, కలలు కన్న తన కలల పంట ఇలా కనపడేటప్పటికి ఒక్క సారిగా నిరుత్సాహం ఆవరించింది. నల్లగా ఉండి, రూపురేఖలు కూడా బాగా లేదు. చూడడానికి మనసొప్పక భార్య చేతికి పాపను ఇచ్చి వెళతానని వెంటనే ఊరికి బయలుదేరి వచ్చాడు రాము. భర్త ప్రవర్తనకు చాలా బాధ పడింది సరోజ. పాపకు మూడవవనెల వస్తోంది. బారసాలకు రమ్మని మామగారు చెపితే మొక్కుబడిగా వెళ్ళి అయిందనిపించాడు రాము. పాపకు 'విద్య ' అని పేరు పెట్టి భార్యను, పాపను తనతో ఇంటికి తీసుకుని వచ్చాడు. సరోజతో చాలా ప్రేమగా ఉండే రాము కూతురి విషయంలో చాలా నిర్దయగా ఉండటం చూసి సరోజ భర్తను మార్చ ప్రయత్నించి విఫలురాలైంది. ' అందుకు కాలమే తగిన సమాధానం చెపుతుంది' అని మిన్నకున్నది. సరోజ. విద్య పెరుగుతూ మాట, నడక వచ్చి అన్నిట్లో చలాకీగా, చురుకుగా ఉంటూ తల్లి ప్రేమను పొందుతోంది. విద్యకు 5 సం. వచ్చాయి. తండ్రి దగ్గరకు. వెళితే ఆయన తనను పట్టించుకోకుండా ఉండటం ఆ పసిమనసుకు అర్థంకాక ఏదోగా అనిపిస్తోంది. ఈలోగా సరోజ మళ్ళీ నెలతప్పి 9నెలు నిండగానే మరో ఆడపిల్లను కన్నది. ఆ పాపను చూసి రాము ఆనందానికి అవధుల్లేవు. చాలా అందంగా, చూడముచ్చటగా ఉన్న ఆ పాపకు 'రూప' అని పేరు పెట్టి చాలా గారాబంగా పెంచుతున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/wjRBVfuaZ5U

Episode metadata supplied by the publisher feed · Published May 25, 2023

Embed this episode

Ready to play

నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ | Nanna Nannu Daggaraku Tisukovuu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 7:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 7 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 25, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!