'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు episode artwork

EPISODE · Sep 25, 2022 · 25 MIN

'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు

from Harshaneeyam

‘నాన్న తో ఒక్క రోజు’ తమిళ మూలం: సుప్రసిద్ధ కథా రచయిత  సుందర రామస్వామి గారు నాన్నతో ఒక్కరోజు అనే కథకు తమిళ మూలం సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు. కథను మీ కందించడానికి అనుమతినిచ్చిన కణ్ణన్ గారికి, సహకరించిన గీతారామస్వామి గారికి కృతజ్ఞతలు. నాన్నకున్న ఒకే ఒక దాయాది రాజు పెదనాన్న. పేరుకు దాయాదులన్న  మాటే గానీ ,  ఇద్దరూ, ఒకే కడుపున, పుట్టిన వాళ్ళ కంటే కూడా, ప్రేమగా సఖ్యంగా వుంటారు. నాన్న అమ్మలకు పెళ్ళైన కొన్నాళ్ళకే , ఆస్తులన్నీ కరిగిపోయాయి. బతకడానికి ఏ ఆధారమూ లేక, నిస్సహాయంగా మా కుటుంబం నిలబడుంటే, రాజు పెద్ద నాన్నే  చెయ్యందించాడు. తనకు బాగా డబ్బులు తెచ్చిపెడుతున్న ఒక వ్యాపారాన్ని, నాన్నకిచ్చేసాడు, రాజు పెదనాన్న. ‘అప్పట్నుంచే, డబ్బు సంపాదన అంటూ, ఒకటి మొదలై,  నలుగురిలో తలెత్తుకు తిరిగే స్థితికి చేరుకోగలిగాను. ఏమిచ్చినా ఆ ఋణం తీర్చుకునేది కాదు’ అంటారు నాన్న . అమ్మగూడా అదే అంటుంది. ఎప్పుడు రాజు పెదనాన్న   గురించి మాట్లాడుకున్నా, ఇద్దరికీ కళ్ళు తడవుతాయి.  నాతో, రమణి అక్కతో అమ్మ రాజు పెదనాన్న గురించి ఎంతలా చెప్పిందంటే, మేమిద్దరం ఆయన  ‘దేవుడి’ అంశ  అనుకోడం మొదలెట్టాం. సంవత్సరానికి ఒక సారి, పెదనాన్న, మా ఇంటికి వచ్చేవాడు. ఆయన వస్తున్నట్టు ఉత్తరం అందగానే, ఇల్లంతా సందడి మొదలయ్యేది. పెదనాన్నకి,  నులక మంచం మీద పడుకోడం అంటే ఇష్టం. మొదట, ఆ మంచాన్ని పెరట్లోకి తీసుకెళ్ళి, మరిగే నీళ్ళు పోసి, నల్లులు లేకుండా, శుభ్రంగా, కడిగే కార్యక్రమం ప్రారంభం అయ్యేది. అమ్మ, ఆయన కిష్టమైన పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు తయారు చెయ్యడం మొదలెట్టేది. నాన్న బంగారు అంచుతో వుండే కొత్త విసనకర్రలు కొనుక్కొచ్చేవాడు. మధ్యాహ్నం పూట, భోజనం ఐన  తర్వాత, పెదనాన్న పడుకునుంటే, చెరో వైపు నిలబడి, విసరడం  రమణీ కి, నాకూ అలవాటు.  రమణి ఎప్పుడూ నన్ను ఆయన కాళ్ళ వైపు  నిలబడి విసరమనేది. ‘పెదనాన్న తల వైపు నిలబడి, ఆయన మొహానికి తగలకుండా, విసరడం నీకు చేతకాదు’ అని చెప్పేది. ఎప్పుడైనా అమ్మ పిలిస్తే,  రమణి అక్కడినించి వెళ్ళిపోయినప్పుడు, నేను పెదనాన్న మీదకి, బాగా  ముందుకు  వంగి, విపరీతంగా విసిరేవాణ్ణి.  అప్పుడు, రాజు పెదనాన్న, నీ సంగతి నాకు తెలిసిపోయిందన్నట్టుగా, మూసిన కళ్ళు తెరవకుండానే, నవ్వేవాడు.  ఆ నవ్వులో, తమలపాకులతో పండిన అందమైన ఎరుపు, లీలగా  మెరిసేది. వడసేరి తనుమాలయన్ నేసిన పంచెలు మాత్రమే, తన ఒడ్డూ పొడుగుకి  సరిపోతాయనే వాడు, రాజు పెదనాన్న.   ఆయన కోసమని, ప్రత్యేకంగా, నాణ్యమైన నూరో నంబరు నూలు పంచెలు కావాలని, దుకాణానికి కబురు పంపించేవాడు నాన్న.  అమ్మ, ఆనందత్త కల్సి పెరట్లోకి వెళ్ళి, ఏ అరటిచెట్టు నించి, ఏ ఏ  ఆకులు  కోసి, భోజనాలకు వాడాలో, నిర్ణయించే వాళ్ళు. ఎందుకోగానీ, ఎప్పుడూ రాజు పెదనాన్న రావడం, మా ఆవు ఈనడం ఒకే సారి జరిగేవి. ‘ఇలాటి  జున్ను తినాలంటే, రాజు లాగా పెట్టి పుట్టాలి,’ అనేవాడు గర్వంగా నాన్న. రాజు పెదనాన్న కుటుంబం చాలా పెద్దది. ‘మా ఇంట్లో పన్నెండున్నర మందిమి మేము!’   అనేవారు పెదనాన, తమాషాగా. అది కొంచెం అతిశయోక్తి.  నిజానికి ఆయనకు పద్నాలుగు మంది పిల్లలు.  దాదాపు, ముప్పయి మంది మనవళ్ళు, మనవరాళ్ళూ. ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి వంటిల్లు . కొన్నిరోజులైనా సరే, ఆ సందడంతా వదిలేసి వచ్చి, మా ఇంట్లో ఉండడం పెదనాన్నకి ఎంత కష్టమో, మా అమ్మానాన్నలకి  తెలుసు. ఆయనకు ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చినట్టు గమనించగానే,  ’ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి తొందరేముంది?’ అని అంటూ, ఇంకొన్ని రోజులు, ఉండమని బలవంతం చేసేవారు నాన్న. ఇద్దరూ కూచుని, వాళ్ళ చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ, ‘ఇంతకు ముందు రోజులా ఇవి ? అన్నీ నాశనం అయిపోతున్నాయి’ అని ముక్తాయించే వాళ్ళు. రాత్రంతా మేలుకుని  అలా మాట్లాడుకుంటూనే వుండే వాళ్ళు. అయినా, మరుసటి రోజు పొద్దున్న లేచింతర్వాత గూడా, మాట్లాడుకోడానికి, వాళ్ళకు మాటలు ఇంకా మిగిలుండేవి. ప్రతిరోజూ పొద్దున్న, షాపు తెరవడానికి  వెడుతూ , ‘నాలుగు గింజలకోసం, పెదనాన్న తో సమయం గడపకుండా, వెళ్ళాల్సివస్తోందే’, అన్న  బాధ కనపరుస్తూ, నెమ్మదిగా బయలుదేరేవాడు నాన్న. ఆ రోజుల్లో ఇంట్లో ఫోన్ ఉండడం అనేది చాలా అరుదు. ఓ రోజు తెల్లవారు ఝామున, ఫోన్ ఆఫీసునించి ఒకతను హడావుడిగా వచ్చాడు. నాన్నకు, కొచ్చిన్ నించీ ఏదో  ఫోన్ వచ్చిందనుకుంటా. విషయం విని అమ్మా నాన్నలకు నోట్లో మాట రాలేదు. కొచ్చిన్ లో ఉండేది రాజు పెదనాన్న.  నాన్న మొహాన్ని గమనిస్తూ , విషయం ఏమిటో  తెలుసుకోవాలని  ఆతృత  పడ్డాను. మామూలుగానే, నేనెళ్ళి  ఆయనకెదురుగా నిలబడే  ప్రశ్నే లేదు. ఇపుడేమో, నాలుకలు తెరుచుకుని ఇంటి కప్పు నంటే, మంటలా కనిపిస్తున్నారు  నాన్న.  ఇలాటప్పుడు ,  నేనెప్పుడూ వేసే ఎత్తు ఒకటే.  మా ఇంటికో పక్కన, గోడనానుకుని  వున్న,  వేపచెట్టుకొమ్మ మీద కెక్కి కూచున్నాను. గాలి వీచి, కిటికీని మూసిన తెరలు, పైకి తెరుచుకున్నప్పుడల్లా, ముందువసారాలో, పడక్కుర్చీలో కూచుని వున్న, నాన్న ఎర్రబడిన మొహం నాకు కనపడుతోంది. ఇలా  నాన్న వైపు అపుడపుడూ చూస్తూ, ఏవనుకుంటున్నారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే రమణికి ఈ ఇబ్బంది లేదు. నేరుగా తాను వరండాలోకి వెళ్ళగలదు. కావాలంటే, భయమనేదే లేకుండా  నడుచుకెళ్ళి,   నాన్న పక్కనే, నిలబడగలదు కూడా. ఒక్కోసారి, ఆయన చుట్టూచూసి,  ఎవరూ లేరు, అని నిర్ధారించుకుని, రమణిని దగ్గరకు తీసుకుని ప్రేమగా  తల నిమిరే వారు. వేపచెట్టుమీద కూచునప్పుడు, ఎన్నోసార్లు ఈ దృశ్యాన్ని నేను చూసాను. నేనెక్కడ ఉన్నానో, రమణికి తెల్సు కాబట్టి, నా వైపు తల తిప్పి , ‘ఇదంతా చూస్తున్నావా?’ అన్నట్టుగా మొహం పెట్టేది. నాన్నకు, తనంటే ఎంత ఇష్టమో, నాకు చూపించడం కోసం తహతహలాడేది. నన్ను ఏడిపించడం తన ఉద్దేశ్యం. నేను మటుకు, అందుకు బదులుగా,  నా మొహాన్ని చిత్రవిచిత్రంగా మారుస్తూ తనని వెక్కిరించేవాణ్ణి. గాలి సరిగా లేక కిటికీ తెరలు తగినంతగా  తెరుచుకోవడంలేదు  అనిపిస్తే,  రమణి చూసిందని తేల్చుకునేదాకా, పది పన్నెండు సార్లయినా సరే, ఈ ప్రదర్శనను  కొనసాగించే వాణ్ణి నేను. అదేపనిగా, నాన్న మొహాన్ని తదేకంగా చూస్తున్నాను. బాగా ఎరుపెక్కి వుంది. చాలా బాధతో  వున్నపుడు, ఏదైనా తీవ్ర సమస్యల్లో ఉన్నప్పుడు, ఎడమ చేతి వేళ్ళు  గడ్డం కింద, ఆనించి, బుగ్గలు పైకి వెళ్ళిపోయేలా,  నొక్కి పెడతారు నాన్న. చూపు ఒకే చోట నిమగ్నమై,  కదలకుండా నిలబడిపోతుంది. ఒక్కోసారి, కళ్ళు రెండూ మూసి, దీర్ఘంగా నిట్టూరుస్తారు. బాధనంతా, శ్వాస ద్వారా బయటికి విడిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. మునుపెన్నడూ, ఆయన మొహంలో ఇంత బాధని నేను  చూడలేదు. లోపలుండే తీవ్రమైన నొప్పిని, అతికష్టం మీద,నిశ్శబ్దంగా, భరిస్తున్నట్టుగా వుంది ఆయన వాలకం. చెట్టు దిగి,  ముందు  వరండాలోకి పరిగెత్తాను. మెట్లెక్కి వెళ్ళి, ఒక స్తంభానికి ఆనుకున్నాను. ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ఎప్పటిలా, ‘ఈయన నన్ను చూడగానే చిరాకు పడేట్టు లేరు’,  అన్న విషయం, నాకు అకస్మాత్తుగా స్ఫురించింది. “ఇప్పుడు వెళ్ళి, ఆయన పక్కన కూడా నిలబడొచ్చు! కావాలంటే.”కానీ, అలా ఏవీ జరగలేదు. ‘మీ అమ్మని పిలు’ అన్నారాయన. అంత మృదువుగా ఆయన నాతో ఇంతకు ముందెప్పుడూ మాట్లాడలేదు. మళ్ళీ మెట్లు దిగెళ్ళి,నేల మీద పరిచివున్న పట్టా తోటి,  కాళ్ళు శుభ్రం చేసుకున్నాను. “నాన్న ‘వీడు చాలా తెలివైనవాడు’ అని నా గురించి  అనుకోవాలి. అసలు తెలివితేటలు చూపించే అవకాశం అంటూ ఒకటి, నాకు  ఇవ్వకపోతే, ఈ విషయం ఎవరికైనా  ఎలా తెలుస్తుంది? తెలివితేటలు అనేవి, ఒక్క రమణి సొంతమే కాదు. నా బుర్ర కూడా బాగా చురుకైనదే. కానీ, అది నిరూపించే అవకాశమే ఎప్పుడూ రాలేదు. అంతే.” ఇంట్లోకి పరిగెత్తాను. అమ్మ కిటికీ పక్కకొచ్చి నిలబడి గొంతు సవరించుకుంది.ఆ కిటికీ లోంచి వరండా అంతా కనిపిస్తుంది. మొదటగా , గొంతు సవరించుకోవడం అనేది, ఆమె రాకకు సూచన.  దాని తర్వాత నాన్న వీధి లోకి చూస్తూ, మొక్కలగురించి, తీగల గురించి, కొబ్బరి చెట్ల గురించి, ఎగిరే పక్షుల గురించి అనేకానేక ప్రశ్నలు సంధిస్తారు. అమ్మ తన సమాధానాలన్నీ నాన్న వీపుకి చెప్తుంది.  ఏవైనా, అర్థంలేని, అర్థం కానీ ప్రశ్నలడిగినప్పుడు, ఆయనకు మటుకు,  ఓర్పుతో సమాధానాలు చెప్తూ, తన ముఖం చిట్లించడాలూ, తల కొట్టుకోవడాలూ లాంటివి, మా వినోదానికి వదిలేస్తుంది.  నాన్న కొంచెం గొంతు పెద్దది చేసి, అరిచారు. ‘ఒక్కడూ కనపడ్డం లేదు. నేనే  స్వయంగా అన్నీ చూసుకోవాలి’. రమణి, నేను, చప్పుడు చేయకుండా, అమ్మ దగ్గరికి జరిగాం. కిటికీ తెరకున్న సందులోనించీ, నాన్న వీపు మీదున్న, పుట్టుమచ్చలు, లెక్కపెట్టగలిగినంత, స్పష్టంగా, నాకంతా కనపడుతోంది. ఒకరకంగా ఆయన ఆవేశపడటం సహజమే.  బయటకెళ్ళి పనులు చేసుకోవడం,  నాన్నకు అసలు అలవాటులేదు. నాన్నకు గానీ, ఇంట్లో కానీ,  బయటినించీ ఏదన్నా కావాల్సి వస్తే,  శీను మామో, నటరాజ్ మామో, చూసుకుంటారు. ఆనందత్త కూడా ఒక్కోసారి, అవసరం వచ్చినప్పుడు. వంట సగంలో వదిలేసయినా సరే , బయటకెళ్ళి,  నాన్న పనులు చేసుకవస్తుంది. పోస్ట్ ఆఫీసుకి , కరెంటు ఆఫీసుకి , పచారీ దుకాణానికి, కనీసం పిల్లల విషయంలో స్కూలుకి , ఆసుపత్రికి కూడా, ఆయన వెళ్ళడం అనేది  ఎప్పుడూ జరగలేదు. అంతెందుకు, తమలపాకులమ్మే దుకాణానికి కూడా ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు. “కొంచెం సేపు ఆగుదాం. ఎవరైనా వస్తారేమో చూద్దాం!” అంది అమ్మ. “అసలు నాకు అత్యవసరంగా ఏదైనా  కావాల్సి వచ్చినప్పుడు, ఎవడైనా వచ్చి  తగలడ్డం చూసావా? ప్రతి చిన్న విషయం నేనే చూసుకోవాలి” అన్నారు నాన్న. అలాంటి సందర్భంలో కూడా, నవ్వు ఆపుకోలేక పోయింది అమ్మ. అమ్మ చేతిని నోటికడ్డం పెట్టుకుంటే, వెంటనే రమణి కూడా అలానే చేసింది. నేను, వాళ్ళిద్దరి కంటే కూడా, నవ్వు ఆపుకోడం నాకే  ఎక్కువ  కష్టంగా ఉన్నట్టు, నోటికి,  ‘రెండు’ చేతులు అడ్డం పెట్టుకున్నాను. నాన్న మాటల్లోని హాస్యం, నాకు అర్థం కాలేదని, రమణి అనుకోవడం నా కిష్టం లేదు. అలా జరిగితే, జీవితాంతం అది పట్టుకు వేలాడి, నన్ను ఏడిపించేస్తుంది. నేనెక్కడ దొరుకుతానా? అని రమణి, ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది కదా!అమ్మ మూడోసారి అడిగింది, “ ఫోన్ ఎక్కడనించీ వచ్చిందన్నారు?”. ప్రశ్నకు సమాధానం తనకు బాగా తెలిసినా, నాన్న ఆందోళనను కొంత తగ్గించేందుకు ,అమ్మ చేస్తున్న ప్రయత్నం అది. నాన్న సమాధానం ఇవ్వలేదు. ఆయన మౌనానికి అర్థం, “బుర్ర లేని వాళ్ళతో నేను మాట్లాడను” అని. ఉన్నట్టుండి, ఏదో పూనకం వచ్చినవాడిలా, నాన్న చెప్పులేసుకుని, ముందు మెట్లు దిగారు. అమ్మ ఖంగు తింది. తర్వాత వెంటనే  సర్దుకుని, నా వైపు చూసి  “నువ్వెళ్ళరా! నాన్న తోటి” అంది.  అమ్మ నాన్నతో నన్ను వెళ్ళమనడం, నన్ను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నేను పైసాకి గూడా పనికి రాను” అనే నాన్న అభిప్రాయానికి,  అమ్మ వంత పాడటం అనేది, ఎప్పుడూ జరిగేదే  మా ఇంట్లో. ఈ లోపల, నాన్న ముందు గేటు దాకా వెళ్ళి, వెనక్కి తిరిగి, “వీడేందుకు నా తోటి?” అని కేక పెట్టాడు. “మీ గొడుగు పట్టుకొస్తాడు” అంది  అమ్మ. విపత్కర పరిస్థితుల్లో, మా అమ్మ బుర్ర ఆలోంచించినంత వేగంగా ఎవరి బుర్రా ఆలోచించలేదు. ‘అసలు ఏదో చిన్న, అల్పమైన అవసరానికి, పనికొస్తే తప్ప, నాన్న నన్ను వెంట రానివ్వడు,!’  అనే విషయం  అమ్మకు అంత బాగా ఎలా తెల్సు? ఒక్క ఉదుటున నేను నాన్న గదిలోకి పరిగెడుతూ వెళ్ళి, ఆయన గొడుగును తీసి నా గుండెలకదుముకున్నాను. ఆ క్షణం దాకా, ఆ గొడుగును వేరే వాళ్ళు, తాకడం అనేదే జరగలేదు. నాన్న చాలా దూరం వెళ్ళారు. నేను, తన వేగాన్ని...

Episode metadata supplied by the publisher feed · Published Sep 25, 2022

Embed this episode

NOW PLAYING

'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు

0:00 25:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 25 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on September 25, 2022.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!