EPISODE · Jan 11, 2023 · 21 MIN
నాటకం | Natakam | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాటకం రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు సాయంకాలం నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో రాఘవ వచ్చి. "నీతో మాట్లాడాలి" అని చెప్పాడు. రాఘవ ఆఫీసులో నా కొలీగ్; నాటకాలంటే బాగా పిచ్చి. ఎప్పడూ శలవులు పెట్టి పరిషత్ నాటక పోటీలనీ, నంది నాటకాలనీ తిరుగుతుంటాడు. అందుకే అతనికి ఆఫీసులో మంచి పేరు లేదు. అతనికి ఎన్నో సార్లు బదిలీ జరిగినా ఏ మంత్రినో, ఎమ్మెల్యేనో పట్టుకొని వాటిని ఆపించుకుంటూ ఉంటాడు. “ఏమిటి సంగతి రాఘవా? మళ్ళీ ఏదైనా నాటక పోటీలున్నాయా?” అని వాడిని నవ్వుతూ అడిగాను.. "నీకు నాటకాలంటే బాగా చిన్న చూపు గురూ! ఒక్కసారి నాటకంలో వేషం వేస్తే దానిలో సాదక బాదకాలు నీకు తెలుస్తాయి. నాటకాలాడి మేమేదో బోలెడు సంపాదిస్తునాం అని మీరంతా అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల నేను ఒక్క పైసా సంపాదించలేదు. అంతా చేతి చమురు భాగోతం; నా చేతి డబ్బులు ఇప్పటిదాకా ఐదు లక్షలు ఖర్చై పోయాయి. అయినా కళా సేవ కోసం ఆ పాటి త్యాగం చెయ్యక తప్పదు” అన్నాడు తానే నాటకరంగాన్ని ఉద్దరిస్తున్నట్లు ఫోజు పెడుతూ. “అది సరే. ఇంటికెళ్ళిపోతున్న సమయంలో వచ్చావేంటి? ఏం అంత అర్జెంటా?" అని అడిగాను.. “చెప్పాలంటే అర్జంటే!... పదిహేను రోజుల్లో నంది నాటకోత్సవాలు జరగబోతున్నాయి. మేం ప్రతీ సంవత్సరం ఆడే నాటకాలన్నింటికీ బహుమతులు వచ్చేసాయి . ఎంత కాలం ఆ పాత చింతకాయ పచ్చళ్ళు పట్టుకొని వేళాడతాం చెప్పు. అందుకని ఈ సంవత్సరం ఓ కొత్త నాటకం వెయ్యాలని నిర్ణయించుకున్నాము. నువ్వు ఎలాగూ కథలు, నవలలు వ్రాస్తుంటావు కాబట్టి మా కోసం ఒక మంచి నాటకం వ్రాస్తే ఈ సంవత్సరం దాన్నే ఆడి ఫస్ట్ ప్రైజ్ కొడతాము” అన్నాడు రాఘవ. “నేనెప్పడూ నాటకాలు వ్రాయలేదు రా... అన్నీ కథలూ, నవలలే.. అంతగా వెయ్యాలంటే ఏదో నచ్చిన నవలని నాటకంగా మార్చుకుంటే సరి” అన్నాను వాడితో. “బాబూ! ఆ పనేదో నువ్వే చేసి పెట్టి మాకు ఒక మంచి నాటకాన్ని తయారు చెయ్యి... నీ పేరు చెప్పుకొని బహుమతులందుకుంటాము." అన్నాడు మళ్ళీ నవ్వుతూ.. “అవునులే కష్టం రచయితది, డబ్బు, బహుమతులు మీవి! కవుల్ని, రచయితల్ని ఎప్పుడీ సమాజం గుర్తించింది కనుక? అప్పటి శ్రీనాథుడు నుంచి మొన్నటి మహాకవి శ్రీశ్రీ దాకా.... కవులందరికీ పేరొచ్చింది కానీ ధనలక్ష్మి వాళ్ళని కనికరించలేదు. ఈ విషయంలో మాకూ, లక్ష్మిదేవికి చుక్కెదురు "అన్నాను కుర్చీలోంచి లేస్తూ... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2ObkXiSDPbM
What this episode covers

NOW PLAYING
నాటకం | Natakam | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m