EPISODE · Jul 11, 2022 · 10 MIN
నేను ఒంటరిని కాదు | Nenu Ontarini Kadu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేను ఒంటరిని కాదు రచన: యశోద పులుగుర్త " పూర్ణా! నవ్వుతున్నావా ఈ నిర్భాగ్యుడిని చూసి ? నానుండి శాశ్వంతంగా ఎందుకంత తొందరగా వెళ్లిపోయావు ? నీవే ఇప్పుడు ఉండి ఉంటే మనిద్దరం ఒక చిన్న గుడిసెలో ఉంటూ గంజిత్రాగుతూ బ్రతికినా మన పాలిట నందనవనంలా ఉండేది కాదూ ? అయినా మీకేం తక్కువంటూ పరిహసిస్తున్నావా ? నిజమే మన 'నందూ' ఇంట రాజభోగాలు అనుభవిస్తున్నాను.. ఆనంద్ పెద్ద డాక్టర్ అవ్వాలని కలలు కన్నావు.. కడుపుకట్టుకుంటూ, ఎన్నో ఆనందాలను, సౌఖ్యాలను త్యాగం చేసి మరీ చదివించాం. కానీ కొడుకుని డాక్టర్ గా చూసుకోకుండానే కన్నుమూసావు.. ఆనంద్ ఇప్పుడు పేరుమోసిన పెద్ద డాక్టర్ పూర్ణా.. చిన్నప్పుడు వాడు మట్టిలో ఆడుకుని వస్తే వాడి కాళ్లు కడిగి మెత్తని టవల్ తో తుడిచి మట్టిలోకి వెళ్లకురా నందూ అంటూ కాలు కిందపెట్టనీయకుండా పెంచావు యువరాజులా.. ఇప్పుడు...... జనం వాడిని తివాసీలమీద నడిపిస్తున్నారు.. పెద్ద బంగ్లా, కారులు, ఇంటినిండా నౌకర్లు.. నీవు వాడి గొప్పతనాన్ని హోదాన్ని చూడకుండానే వెళ్లిపోయిన దురదృష్టవంతురాలివైతే, నేను నా పెద్దకొడుకు ఐశ్వర్యాన్ని, హోదాను కళ్లెదుట చూస్తూ కూడా ఇంకా ఎందుకు ఎవరికోసం బ్రతికి ఉన్నానో అర్ధంగాక సతమతమౌతున్న ఒక దౌర్భాగ్యుడ్ని. కంటి నుండి స్రవిస్తున్న కన్నీటిని చేతిరుమాలుతో వత్తుకుంటూ ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చుని శూన్యంలోకి చూస్తూ భార్యతో తన ఆవేదనను పంచుకుంటూ ఉండిపోయారు దశరధరామయ్యగారు.. Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/QgbryVgYJ3s
Embed this episode
NOW PLAYING
నేను ఒంటరిని కాదు | Nenu Ontarini Kadu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.