నేను వున్నాను | Nenu Unnanu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 21, 2022 · 12 MIN

నేను వున్నాను | Nenu Unnanu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేను వున్నాను రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గోపాల్ ఒక ప్రైవేట్ కంపినీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు, అతని భార్య రాధ ఒక పేరున్న పెద్ద ట్రైనింగ్ కాలేజీ లో ఉద్యోగం. యిద్దరు పిల్లలు తో హాయిగా జీవితం గడుపుతున్నాడు. ప్రైవేట్ ఆఫీస్ అవటం వలన, ఇంటికి రావటం లేట్ ఆవుతోవుంటుంది. ఒకరోజున యధాప్రకారం పనిముగించుకుని స్కూటర్ మీద వస్తున్న గోపాల్ కి ఎందుకో బాగా చలిగాను,  కొద్దిగా వణుకు మొదలవడం గ్రహించి,  ఎలాగో ఇంటికి చేరి,  భార్య తో నాకెందుకో చలిగా వుంది,  పడుకుంటాను,  మీరు తినేయండి అన్నాడు.  అదేమిటి మండు వేసవి కాలం చలి ఏమిటి అంటూ వచ్చి భర్త నుదుటి మీద చెయ్యి వేసి చూసింది రాధ.  కొద్దిగా నులివెచ్చగా వుంది,  వేడి హార్లిక్స్ యిస్తాను త్రాగి పడుకోండి, తెల్లారికి తగ్గుతుంది అంటూ వంట గదిలోనుంచి హార్లిక్స్ కలుపుకొచ్చి భర్త కి యిచ్చింది. అయితే త్రాగిన అయిదు నిమిషాలలో వామిటింగ్ చేసుకున్నాడు గోపాల్. రాత్రి గడిచి తెల్లవారింది. గోపాల్ వొళ్ళు అంతా నొప్పులు,  విపరీతంగా చలి లేవ లేక భార్య తో చెప్పాడు,  నేను కూడా మీ ఆఫీస్ క్లినిక్ లో చూపించుకుంటాను. క్యాబ్ లో వెళ్దాం అని అతికష్టం మీద లేచి పేస్ వాష్ చేసుకుని,  భార్య తో బయలుదేరాడు. డాక్టర్ గారు బీపీ,  chest exam చేసి,  ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఈలోపుగా, ఈ టాబ్లెట్స్ వాడితే చలి తగ్గుతుంది అన్నాడు. టెస్ట్ కి బ్లడ్ యిచ్చి,  ఆఫీస్ కి ఫోన్ చేసి విషయం చెప్పి, రెండు మూడు రోజులు లీవ్ తీసుకుంటానని చెప్పి ఇంటికి చేరుకుని టాబ్లెట్ వేసుకుని ఏమి తినకుండానే పడుకున్నాడు. బ్లడ్ రిపోర్ట్ లో టైఫాయిడ్ అని వచ్చింది. 10 రోజులు మందులు వాడాలిట. చచ్చాం రా నాయనా యిప్పుడు ఎలాగా,  ఆఫీస్ లో చేతినిండా అర్జెంటు పని వుంది, అసలే ప్రైవేట్,  పదిరోజులు సెలవు ఇస్తాడా అనుకుంటూ వాళ్లకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దానికి డైరెక్టర్ ఫైనాన్స్,  టైఫాయిడ్ అయితే యిప్పుడే ఎక్కడ తగ్గుతుంది,  టెండర్లు పంపించే వర్క్ నీకు తప్పా ఎవరికి తెలియదు ఎలా అని గొణుగుతూ,  సరే అవసరం అయితే ఫోన్ లో మాట్లాడుతాము అని ఫోన్ పెట్టేసాడు విసుగ్గా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/q75PpsYHsTM

Episode metadata supplied by the publisher feed · Published Dec 21, 2022

Embed this episode

NOW PLAYING

నేను వున్నాను | Nenu Unnanu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

0:00 12:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 21, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!