EPISODE · Dec 14, 2022 · 5 MIN
నేటి పెళ్లిళ్లు - సమస్యలు | Neti Pellillu Samasyalu | Telugu article | A Annapurna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేటి పెళ్లిళ్లు - సమస్యలు రచన: ఏ. అన్నపూర్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) 'మంచి అంటే? బుద్ధి మంతుడు... బాగా చదువుకుని సంపాదన బాగున్నవాడు... అందగాడు కాకున్నా పర్వాలేదు అనుకునేలా ఉండేవాడు.... అని అబ్బాయిల గురించి.. అమ్మాయిలకూ దాదాపు ఇదే వర్తిస్తుంది అనుకోండి. బుద్ధి గురించి ఎలా చెప్పగలం? ఇంట ఒకలా ఉంటే బయట వేరే వూళ్ళో వుద్యోగం చేసే వారి గురించి ఏమి తెలుస్తుంది? అన్ని చూసి అన్ని బాగుండి చేసే పెళ్లిళ్లే విఫలం అవుతున్నాయి. అదీకాకుండా కొన్ని ఫామిలీ'స్ లో పిల్లలకు ఫ్రీడమ్ మితిమీరి ఇస్తారు. తల్లి తండ్రులు ఇవ్వక పోయినా వాళ్ళే తీసుకుని సమస్యలు తెచ్చి పెడుతుంటారు. కొందరు మరీ చాదస్తంగా వుంటారు. సో మనకు అసలు పరిస్థితులు తెలియవు. ఇప్పుడు కొంత విదేశీ సంబంధాలు చూడటం తగ్గింది. వీసాలు ఉద్యోగాలు కూడా సరిగా లేక. అమ్మాయిలున్నవారు అబ్బయిల తల్లి తండ్రులకంటే నాలుగు మెట్ల పైకే వుంటున్నారు. ఇది చాలా పెద్ద సమస్యగా వుంది. పెళ్ళికి అన్ని అంగీకరించి ఆతర్వాత పేచీ పడేవారు వున్నారు. మరి ముందు తెలిసే చేసుకున్నావుగా అంటే ' అదివేరు. ఇప్పుడేగా నువ్వింత తెలివి లేనివాడివి అని అర్ధం అయ్యింది' అంటున్నారు. ఇక తల్లితండ్రులు అనేవాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది విదేశమే కాదు. స్వదేశంలో కూడా. ఈ మధ్య మాకు తెలిసినవారు(అమెరికా ) కొన్ని రోజులు ఇండియాలో ఉండి అమ్మయికి పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. వాళ్ళది లవ్ మ్యారేజ్. కనుక రెండు కులాలు. అటూ ఇటూ మధ్యరకం కూడా చేయాలని ఆలోచన. విచిత్రం..... కాలం మారింది. చిన్న పెద్దా కూడా చాల విషయాల్లో ఆధునికత పాటిస్తున్నారు..... కానీ పెళ్లి దగ్గిరకి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ - వీళ్ళు తక్కువ అనే బేధాలు మాత్రం వదలడంలేదు. చదువుంది, మంచి హొదావుంది... అమెరికన్ సిటిజన్స్ … అయినా సరే ఎదో వొంకతో రిజక్ట్ చేస్తున్నారు అబ్బాయి తల్లి తండ్రులు. చివరికి ఏమి జరుగుతుందో తెలియదు. పెళ్లి జరిగి పదేళ్లు అయినా ఇద్దరి మధ్య ప్రేమ అభిమానం ఒక బాధ్యత లేని దంపతులు ఇద్దరు పిల్లలు కూడా ఉండి సరిపడక విడిపోయారు. తల్లి తండ్రులు ఒకటే బాధపడుతున్నారు. అయ్యో ఇలాంటి పెళ్లి చేశామే... అని. తప్పు ఎవరిదీ ? పెళ్లి చేసిన తల్లి తండ్రులు పై పై గుణాలు చూస్తారు చదువు అందంకుటుంబం. ఒక చోట జీవితం ప్రారంభించిన అమ్మాయి అబ్బాయి లకు అప్పుడు వస్తుంది అసలు సిసలుబుద్ధి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/AN3-D9ZP6hs
Embed this episode
NOW PLAYING
నేటి పెళ్లిళ్లు - సమస్యలు | Neti Pellillu Samasyalu | Telugu article | A Annapurna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.