EPISODE · Jul 18, 2023 · 16 MIN
నేటి తరం అమ్మాయి పార్ట్ 1 | Netitharam Ammayi Part 1 | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Netitharam Ammayi Part 1/2' New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla 'నేటి తరం అమ్మాయి పార్ట్ 1/2' తెలుగు కథ రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ! మన అమ్మాయికి మంచి పెళ్ళి సంబంధం వెతకండి, ఈడొచ్చిన పిల్లను అలా గాలికొదిలేసినట్టు ఊరుకుంటే ఎలాగా? అదేమో ఉద్యోగమంటూ పట్నంలోనే ఉంటుంది. పెళ్ళి అంటేనే అంతెత్తు ఎగిరిపడుతుంది. అది తానా మీరు తందానా అంటారే తప్ప దాన్ని ఒప్పించే ప్రయత్నం చెయ్యరు. నేనుంటేనేమో నన్ను గంజిలో ఈగను తీసిపడేసినట్టు చూస్తుంది. దానితోటి వాళ్ళందరు పెళ్ళిళ్ళు చేసుకుని చక్కగా కాపురాలు చేస్తూ పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. ఇదేమో మన మాట వినడంలేదాయే.. దేవుడా! నువ్వన్నా దాని మనసు మార్చు తండ్రి, " అంటూ భర్తతో చెప్పిందే చెప్పి దేవుడితో మొరపెట్టుకుంది సుభద్ర. “అబ్బా.. ఏమిటే నీగోల! ఉదయం లేచినప్పటి నుండి ఇదే నసనా, ఇంకేవిషయాలు తోచవా మాట్లాడడానికి? అదేమో నేను నాకు నచ్చిన అబ్బాయి వచ్చేంతవరకు పెళ్ళిమాట ఎత్తకండి అంటుంది, నువ్వేమో పెళ్ళో పెళ్లో అంటూ నా ప్రాణం తింటున్నావు. నేనెవరి మాట వినాలో నాకు తెలియడం లేదు సుభద్రా, " అన్నాడు కృష్ణమూర్తి. “బాగుంది మీ వరస.. కన్న కూతురిని చూసి భయపడేవాణ్ణి మిమ్మల్నే చూస్తున్నా, అదన్నదని చెప్పి మన ప్రయత్నం మనం చెయ్యకుండా ఉంటామా? అయినా ఏ ఆడపిల్లైనా నాన్న.. నాకు పెళ్ళిచెయ్యండి అని అడుగుతుందా? దానికి నచ్చిన అబ్బాయి దొరకాలన్నా ప్రయత్నం చెయ్యాలి కదా! ఊరకే వచ్చి ఎదురుగా నిలబడడు కదా! అది చెప్పడమూ మీరు గంగిరెద్దులా తలూపడం సరిపోయింది, " వ్యంగ్యంగా అంది సుభద్ర. "అమ్మా మహాతల్లి.. నీతో మాట్లాడలేను గానీ నువ్వు, నీ కూతురు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొండి, " చిర్రుబుర్రులాడుతూ చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/NkaKyXDTkDI
Embed this episode
NOW PLAYING
నేటి తరం అమ్మాయి పార్ట్ 1 | Netitharam Ammayi Part 1 | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.