EPISODE · Jul 20, 2023 · 11 MIN
నేటి తరం అమ్మాయి పార్ట్ 2 | Netitharam Ammayi Part 2 | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Netitharam Ammayi Part 2/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla 'నేటి తరం అమ్మాయి పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: కూతురు సౌజన్య పెళ్లికోసం తొందర పడుతుంది సుభద్ర. తాను ఒక అబ్బాయితో కలిసి ఉంటున్నట్లు చెబుతుంది సౌజన్య. తనను పెళ్లి విషయంగా తొందర పెట్టొద్దని చెబుతుంది. రఘు కోరినట్లు ఆస్తిని తనపేరు మీద రాయించుకుంటుంది. ఇక నేటి తరం అమ్మాయి పెద్దకథ చివరి భాగం చదవండి. "ఏమండి ఏం చెప్పారు మీ అమ్మాయికి, నన్నేమో నోరెత్తెద్దు అని నా నోరు మూయించారు. పోనీ.. మీరన్న దాని మనసు మార్చి పెళ్లికి ఒప్పించారా? ఏమన్నదేంటి మీ కూతురు, " అడిగింది భర్త దగ్గర కూర్చుంటూ. "నీ ఆత్రం చూస్తుంటే నీ కూతురు ఒప్పుకుంటే రేపే పెళ్ళి చేసేలా ఉన్నావు.. అంత తొందర పనికిరాదు సుభద్ర.. కాస్త నిదానంగా ఉండు. తొందరలోనే నీ కూతురు నువ్వు చెప్పినట్టు వినే రోజు వస్తుంది, " ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు. "ఊ ఊ .. మీకంతా వేళాకోళంగానే ఉంటుంది, పెళ్ళీడు దాటిపోయి ముదురు తయారవుతుంది మీ కూతురు. ఇంకా పసిపాపేం కాదు తనకు నచ్చచెప్పడానికి. నలుగురిలో తలెత్తుకోలేకుండా ఉన్నాము ఇప్పటికే. ఏం చేస్తారో ఏంటో? నాకు దాని పెళ్ళి చక్కగా చేసి అత్తవారింటికి పంపించేదాక నా మనసు నిలకడగా ఉండదు, " అంది గొంతులో బాధను బయటకు రానివ్వకుండా. *** "హాయ్ రఘు.. ఎక్కడున్నావు ? నేను వచ్చేవరకు గదిలో ఉంటావనుకున్నాను, ఫోన్ చేసాను ఫోన్ ఎత్తలేదు. నువ్వు త్వరగా మన రూం దగ్గరకు వచ్చేయ్యి. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి, " అంటూ ఫోన్ కట్ చేసింది. రఘు ఎప్పుడెప్పుడు వస్తాడా ఆస్తి విషయం చెపితే రఘు ఎంత సంతోషపడిపోతాడోనని ఆత్రంగా చూడసాగింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/3tdve0DN-jI
Embed this episode
Ready to play
నేటి తరం అమ్మాయి పార్ట్ 2 | Netitharam Ammayi Part 2 | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.