ఙ్ఞానమ్మ | Jnanamma | Telugu short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 29, 2023 · 5 MIN

ఙ్ఞానమ్మ | Jnanamma | Telugu short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఙ్ఞానమ్మ రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) 'అమ్మగారు' వెళ్ళి పోయింది. ఆశ్రమమంతా విషాదం అలుముకుంది. కన్నీటి వీడ్కోలు చెబుతోంది. ఆశ్రమంలో చిన్నాపెద్దా... అమ్మగారి గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. స్వర్ణ వదనం వివర్ణమైంది... తనకు ఇప్పుడు 50 సంవత్సరాలు.. తను చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఆశ్రమానికి తీసుకురాబడిందో తెలీదు. ఎవరో తనని వాకిట్లో వదిలేసి వెళ్ళారట. అమ్మగారు తన చేతులతో పెంచింది. అమ్మగారు తెల్లని చీరెలాంటి బట్టను తలమీద ముసుగులా వేసుకునేది. నందివర్ధనం పువ్వును గుర్తుకు తెచ్చేది. తను విన్న కథ ప్రకారం ఆలోచిస్తోంది, స్వర్ణ. 'అమ్మగారి' పేరు ఙ్ఞానప్రసూనాంబట. అందరూ పేరుమరిచిపోయారు. 'అమ్మగారు' గానే పిలువబడింది. బాల్యవివాహం పేరుతో అమ్మగారికి ఎనిమిదేళ్ళ వయసులోనే, యాభై ఏళ్ళ రెండో పెళ్ళి వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేసారుట. అప్పుడు ఆమెపేరు... 'ఏమే! ఒసేవ్' ట. అత్తగారింట్లో అదేపేరు. అక్కడ ఆమెపేరు అందరూ మరిచిపోయారు. ఈమె యుక్తవయసు వచ్చి, సంసారం గురించి కలలు కనే వయసులో తన భర్త మొదటి సంబంధం పిల్లలతో 'అమ్మా' అని పిలిపించుకుందామని ప్రయత్నించినా ఈమెను 'సవతి తల్లి'అనే మిషతో గొడవలతో, దూరంగాఉంచేసారు. భర్తతో ఒక్క పిల్లనో, పిల్లవాడినో కని 'అమ్మా' అనిపిలిపించుకోవాలని తపన పడింది. కానీ అప్పటికే క్షయ రోగం ముదిరిపోయి, అతనికి సేవలుచేయటానికే సమయం వెచ్చించింది. ఈమెకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి, భర్తపోయాడు. కాపురం చేయకుండానే 'విధవ' అనే ముద్రతో పుట్టింటికి చేరింది. ఆ రోజుల్లో ఆచారం ప్రకారం శిరోముండనం చేయించి, తెల్లచీర ముసుగుతో తిరిగే 'ఙ్ఞానమ్మ', ఊరిలో అందరికీ వంటలక్క. ఏ ఇంట్లో ఏ కార్యం జరిగినా వంటకు సాయం వెళ్ళేది. తలలో నాలుకలా మెలిగేది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/L15dvc_x8yY

Episode metadata supplied by the publisher feed · Published Jan 29, 2023

Embed this episode

NOW PLAYING

ఙ్ఞానమ్మ | Jnanamma | Telugu short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 5:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 29, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!