EPISODE · Aug 12, 2023 · 9 MIN
నగరంలో వంటావిడ | Nagaramlo Vantavida | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Nagaramlo Vantavida' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao 'నగరంలో వంటావిడ' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “నాన్నా! దేశాంతరాలు వెళ్ళిపోతారు కానీ నా దగ్గరికి రమ్మంటే బద్ధకం మీకు. మాకు కూడా మీతో గడపాలని ఉండదా, అమ్మని అడిగితే ‘నన్ను అడిగి లాభం ఏముంది ఆ మొండి మనిషి ని అడుగు’ అంటుంది.. మీరు మాత్రం హైదరాబాద్ పట్టుకుని వుంటారు. అక్కడైనా, నా దగ్గరైనా మీరు చేసే పని ఏముంటుంది.. గంటల తరబడి యూట్యూబ్ చూడటం, ఫోన్లో మాట్లాడుకోవడం” అన్నాడు తండ్రి శ్రీకాంత్ తో కొడుకు వినయ్. “నాకు రాకూడదు అనికాదు రా, ప్రయాణాలు చెయ్యలేకపోతున్నాను అంతే. మీ మొగుడు పెళ్ళాలు యిద్దరు జాబ్ కి వెళ్ళిపోతారు, మనవడు స్కూలుకి. అమ్మకి వంటా, నాకు ఫోన్, పెద్ద మార్పు ఏమి వుంటుంది?” అన్నాడు కొడుకు తో శ్రీకాంత్. “అదేమిటి డాడీ, వంట కి వంటమనిషి వుంది అని చెప్పానుగా, అప్పుడే మర్చిపోయారా” అన్నాడు కొడుకు వినయ్. “వంటమనిషి వుంటే మంచిదే, అమ్మకూడా యిక్కడ నాకు వంట చేసి బాగా అలిసిపోయింది, అక్కడ కి వస్తే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది లే. నాకు కూడా కాళ్ళు నొప్పి, అక్కడకి వస్తే మనవడు, నువ్వు కొద్దిగా కాళ్ళమీద కూర్చుంటారు, హాయిగా వుంటుంది, వచ్చే వారం కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి, ట్రైన్ లో అంతసేపు కూర్చోలేను” అన్నాడు శ్రీకాంత్. “అవును.. వంటమనిషి మనవాళ్లేనా, ముంబయిలో మన వాళ్ళు దొరుకుతారా?” అని ఆడిగాడు కొడుకుని. “ఆ.. మనవాళ్లే! జానకమ్మ పేరు, అయితే మరాఠి తప్పా ఏమి రాదు, యిప్పుడే కొద్దిగా హింది నేర్చుకుంటోంది” అన్నాడు వినయ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/GnRyFx5NtYA
Embed this episode
NOW PLAYING
నగరంలో వంటావిడ | Nagaramlo Vantavida | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.