EPISODE · Nov 4, 2022 · 5 MIN
నీలో నువ్వే | Nilo Nuvve | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నీలో నువ్వే రచన: కిడాల శివకృష్ణ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో...................... అయితే నిత్య చర్చనీయ అంశాలకు చక్కని పరిష్కారాన్ని చూపేది ఒక్క మిత్రుడు మాత్రమే, ఎందుకంటే మిత్రుని దగ్గరే మనం కొంత చనువుగా ఉంటాము, అన్ని విషయాలను చర్చిస్తూ ఉంటాము, అటువంటి సమయంలోనే మన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అదెలాగో మనం తెలుసుకుందాం....!!!! శివ సురేష్ వినయ్ సుంకన్న దశరథ ఈ ఐదుగురు ఒకే కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఒకే గదిలోనే అద్దెకు కూడా కలిసి ఉండటం విశేషం. మొదట వీరి పరిచయం ఎలా జరిగినా ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం. ఇంతలా స్నేహాన్ని పెంచుకున్న వారి మధ్య కొన్ని అంశాలు చర్చలోకి వస్తుంటాయి. ఇలా వచ్చినపుడు అన్ని సమస్యలకూ పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది, ఎందుకంటే ఐదు మంది ఉన్నారు కాబట్టి ఎవ్వరికో ఒకరికి అయినా సరైన సమాధానం ఆలోచనా రూపంలో వస్తుంది కదా....!!!! మరి ఆ సరైన ఆలోచనను అందరూ తప్పకుండా పాటిస్తారు, నిజమంటారా కాదంటారా?? ఆ విధంగానే ఒక రోజు శివ ఒక సమస్యాత్మక సందేహాన్ని చర్చనీయాంశంగా తీసుకువచ్చాడు. ఆ విషయం ఏమిటి అంటే ‘సంతోషం ఎందులో ఉంది’ అనీ… ప్రతి ఒక్కరినీ అడుగుతూ చర్చిస్తూ ఉన్నాడు. అలా వారి గదిలో ఉండే మిగిలిన మిత్రుల దగ్గరకు తీసుకువచ్చాడు. గదిలోకి వచ్చి “సంతోషం ఎందులో ఉందో నేను తెలుసు కోవాలి అనుకుంటున్నాను. మీరు నాకు సమాధానం చెప్పాలి” అన్నాడు శివ. “నాకు తెలిసినంతవరకూ డబ్బు ఉంటే సంతోషం అదే ఎగురుతూ వస్తుంది. ఎందుకంటే అన్ని సమస్యలను తీరుస్తుంది. అన్ని కొరికలని కూడా తీర్చుకోవచ్చు కదా” అన్నాడు సురేష్. “అదేం కాదురా! నీకు ఒక అమ్మాయి ప్రేమ దొరికింది అంటే చాలా సంతోషంగా ఉంటావు” అన్నాడు వినయ్. “లేదు లేదు… నీకు చాలా మంచి కుటుంబం ఉంది అంటేనే అదృష్ట వంతుడు అవుతావు. నిత్యం సంతోషంగా ఉంటావు” అన్నాడు సుంకన్న. ఇవన్నీ విన్న శివ “ఏం దశరథా.. ఏమీ మాట్లాడకుండగా ఉన్నావు. నువ్వైనా చెప్పచ్చు కదరా ఏది సంతోషమో” అన్నాడు. అపుడు మిగిలిన స్నేహితులు “మేము చెప్పింది అబద్ధం అనుకున్నావా రా..!! మళ్ళీ వాణ్ణి అలా అడుగుతున్నావ్?” అన్నారు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/NzEZ_wiQGR0
Embed this episode
NOW PLAYING
నీలో నువ్వే | Nilo Nuvve | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.