EPISODE · Jun 5, 2022 · 3 MIN
నిలువెల్లా విషమే మానవుడికి | Niluvella Vishame Manavudiki | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నిలువెల్లా విషమే మానవుడికి రచన: కిడాల శివకృష్ణ మా మామయ్య కారు దిగి దీనంగా ఇంట్లోకి అడుగులు వేస్తూ వస్తున్నాడు. ఆ అడుగులను చూసిన నేను “ఎందుకు మామయ్యా ఇంత నీరసంగా ఎదో పోగొట్టుకున్న వాడిలాగా వస్తున్నావు ఇంటికి?” అని అడిగాను. “హా.. ఏమీ లేదురా రిషీ, ఎదో అలా వస్తున్నాను అంతే” అంటూ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. “ఆగు మామయ్యా! ఏమో జరిగింది. చెప్పచ్చు కదా..” అంటూ కాస్త గట్టిగా అడిగాను. “అవునురా! మన సూఫీని ఎవరో పట్టుకెళ్ళిపోయారు. అందుకే దిగులుగా ఉందిరా రిషీ” అన్నాడు మామయ్య. అసలే మామయ్యకు సూఫీ అంటే చాలా ఇష్టం. అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. మనుషులను అసలే పట్టించుకునే వాడు కాదు మా మామయ్య. “సర్లే మామయ్యా! ఇంకో కుక్కను తెచ్చుకుందాం” అన్నాను నేను. “సరేలేరా.. నువ్వు చెప్పినట్లే చేద్దాం” అంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు మా మామయ్య. మా మామయ్య ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాము. తరువాత మామయ్య ఫోన్ పట్టుకుని తన మిత్రులకు, కనిపించకుండా పోయిన సూఫీ గురించి కనుక్కోమని చెపుతున్నాడు. అప్పుడు నేను “మామయ్యా! ఒక విషయం అడుగుతాను. నువ్వు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాలి” అని అడిగాను.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/7wSyCIY3V-Q
Embed this episode
NOW PLAYING
నిలువెల్లా విషమే మానవుడికి | Niluvella Vishame Manavudiki | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.